APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TEACHING » ఇది నిజమా....?

ఇది నిజమా....?

Posted by APTF 1938
» TEACHING
» Sunday, 29 September 2019

aptfnlr@gmail.com

ఇది నిజమా....? 
       DSC-2001, DSC-2002 ఉపాధ్యాయులకు శుభవార్త. ఇటీవల ఆన్ ట్రైన్డ్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రెమెంట్లు జారీ అయిన సందర్భంగా 2002 లో జాయిన్ అయిన వారు బేసిక్ గా రూ.36,070/-జనవరి 2019 నుండి తీసుకుంటున్నారు. మన కంటే జూనియర్ లు, జాయిన్ అయిన నాటికి అర్హతలు లేనివారు, మన కంటే ఒక ఇంక్రిమెంట్ అదనంగా పొందుతున్నారు కావున వెంటనే త్వరపడి మనకు జరిగిన నష్టాన్ని తిరిగి సరిచేసుకుని వారి మాదిరిగా రూ.36,070/- బేసిక్ పొందటానికి రీ ఫిక్స్ చేసుకుని జరిగిన నష్టాన్ని తిరిగి పొందాల్సిందిగా విన్నపము.

     దీని వలన ఒక లక్ష నుండి రెండు లక్షలు వరకు అరియర్లు గా పొందవచ్చును. 
     ప్రస్తుతము అదనంగా ఇంక్రెమెంట్లు పొందుతున్న వారి సర్వీస్ రిజిస్టర్ మరియు ఇతరవివరాలు పొందగోరు వారు ఎవ్వరి CFMS లాగిన్ లోనైనా BLM లోకి వెళ్లి, search bills లో, File number is దగ్గర ఈ క్రింది బిల్ నంబర్లు ఇచ్చి సెర్చ్ చేయడం ద్వారా వారి SR మరియు ప్రొసీడింగ్స్ మరియు బిల్లుల అన్ని వివరాలు పొందవచ్చు...

2019-603008
2019-603176
2019-582913
2019-600369
2019-603137
2019-600893
2019-603181
2019-595580

          ఇది నిజమా సర్? అని కొందరు అడుగుతున్నందున ఈ పోస్టింగ్ పెడుతున్నా! 

నిజం కాదు! అది AP వార్త! 
     AP ప్రభుత్వం గత సంవత్సరం Un-Trained ST టీచర్ల సుదీర్ఘకాల డిమాండ్ ను ఆమోదిస్తూ... వారికి బహుళ  ప్రయోజనాలు కలిగేలా ఒక మంచి ఉత్తర్వు జారీ చేసింది. DSC-2000, Special DSC-2000 మరియు DSC-2001లలో సెలెక్ట్ అయిన Un-Trained ST టీచర్లకు DSC-1989 టీచర్ల మాదిరిగా నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు ఆదేశాలు జారీచేసింది. 
        AP ప్రభుత్వ మెమో No 79/Ser.III-1/2001-2 Education (Ser-III) Department Dated 31.7.2003 ఆధారంగా నియామకపు తేదీ నుంచి టీటీసీ క్వాలిఫికేషన్స్ పొందే వరకు గల Un-Trained పీరియడ్ కు (ST టీచర్లకు) నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, విద్యార్హతలు పొందిన మరుసటి రోజు నుంచి నగదు చెల్లించుటకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డైరెక్టర్ Pro RC No 2096/Esst.III/2016 తేదీ 01.08.2018 ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. అక్కడి ఉపాధ్యాయ సంఘాల పోరాట ఫలితం ఇది. ఇవే ఉత్తర్వులను SC కేటగిరీ Un-Trained టీచర్లకు ఎందుకు వర్తింపజేయలేదో అర్థంకాదు. దీంతో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ కు పాక్షికంగానే ఆమోదం లభించినట్లయింది. . 
        కాగా, ఇదే డిమాండ్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడా ఉంది. DSC-2000... ఆ తర్వాత నియామకమైన SC, ST కేటగిరీ Un-Trained టీచర్లకు Un-Trained పీరియడ్ కు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ప్రతి సందర్భంలోనూ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నయ్! విషాదమేంటంటే... ప్రభుత్వం ఈ డిమాండ్ ను ఇంతవరకు కనీసం సానుకూలంగా పరిశీలించలేదు. 
      వాస్తవం ఇది కాగా, అవి గత ఏడాది AP ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులని తెలియక కొందరు గత కొన్ని రోజులుగా వాట్సాప్, పేస్ బుక్కుల్లో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి SGTలు, భాషాపండితులు PETలు గందరగోళానికి గురవుతున్నారు. 
✍మానేటి ప్రతాపరెడ్డి,
TRTF రాష్ట్ర గౌరవాధ్యక్షుడు.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |