DA వా—యి—దా....!.
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు జులై 2019 నుంచి చెల్లించాల్సిన 5% DA వాయిదాను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. 6th CPC ఫార్ములా ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల DA లెక్కిస్తారు. ఆ ఫార్ములా ప్రకారం.... జనవరి 2019 నుంచి 3.144%, జులై 2019 నుంచి 5.24% అదనపు DAను రాష్ట్ర ప్రభుత్వోద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం DAలు ఎప్పుడు మంజూరు చేస్తుందంటారా? ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంటు కదా! IR, PRC, 61 ఏళ్ళకు రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఏడాదిన్నరగా తీవ్రాతి తీవ్రంగా కసరత్తులు, అధ్యయనాలు చేస్తున్నారు కదా! DA వాయిదాల చెల్లింపూ అంతే! పైగా ఇది వా—యి—దా ఆయే! 🤔🤔
✍మానేటి ప్రతాపరెడ్డి.