APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » పేరంట్స్ కమిటీ ఎన్నిక కు సూచనలు

పేరంట్స్ కమిటీ ఎన్నిక కు సూచనలు

Posted by APTF 1938
» CSE GO
» Tuesday, 17 September 2019


1.Govt.Memo.No.ESE01SEDNOSPD110/2019-PROGII, dated: 15.09.2019 of School Education (Prog.II) department,Govt.of A.P  ( Download)

2. Proceedings of the State Project Director, Samagra Siksha, A.P., Vijayavada, vide Rc.No.3939/APSSA/A6/CMO, Dated:15.09.2019   (Download)
          


  •  సూచిక (01) లోని ఉత్తర్వుల ద్వారా  ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల నందు (అన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహా ) పేరెంట్స్ కమిటీలు (గతంలో SMCలు) ఏర్పాటు చేయు విషయమై ఉత్తర్వులు జారీ చేసియున్నారు. 

  • శ్రీ యుత రాష్ట్ర పధక సంచాలకులు. సమగ్ర శిక్ష, ఆం.ప్ర.విజయవాడ వారి ఉత్తర్వుల ననుసరించి (అన్ని మేనేజ్ మెంట్ లు) ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల నందు (అన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహా ) పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయు విషయమై ఎన్నికలు నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసి యున్నారు. 
  • పాఠశాలలోని పిల్లల తల్లిదండ్రులు / సంరక్షకులు ప్రతి తరగతి నుండి  ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకోవలెను. వీరిలో కనీసము ఒకరు Disadvantage group (షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్  తెగలు, అనాధలు, వలస మరియు వీధి బాలలు, ప్రత్యేక అవసరములు గల పిల్లలు మరియు HIV affected / infected children) నకు మరియు మరొకరు  weaker sections కు (వెనుకబడిన తరగతులు, మైనారిటీలు ) మరియొకరు తల్లి దండ్రుల వార్షిక ఆదాయం రూ. 60,000 /- లోపు గల వారు చెంది వుండవలెను. 
  • ఏదైనా తరగతికి సంభంధించి వివిధ  మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణించ వలెను. 
  • ప్రాధమిక పాఠశాలలో తరగతికి ముగ్గురు చొప్పున మొత్తము 15 మంది, ప్రాధమికోన్నత పాఠశాలలో తరగతికి ముగ్గురు చొప్పున మొత్తము 21 మంది, ఎలిమెంటరీ  పాఠశాల నందు తరగతికి ముగ్గురు చొప్పున మొత్తము 24 మంది మరియు ఉన్నత పాఠశాలలో6,7,8,9, 10 తరగతులకు   తరగతికి ముగ్గురు చొప్పున మొత్తము 15మంది సభ్యులను ఎన్నుకోవలెను. ప్రతి తరగతికి మొత్తముపై ఇద్దరు మహిళలై వుండవలెను. 
  • ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య 6 లోపు ఉన్నప్పుడు వారిని క్రింది తరగతి నందు గాని లేదా పై తరగతినందు గాని కలిపి ఎన్నుకొను వారి సంఖ్య  ఆరు పైగా ఉండునట్లుచూడవలెను. 
  • ఎన్నికైన సభ్యుని కాల పరిమితి 2 సంవత్సరాలు లేదా తమ బిడ్డ పాఠశాలలో చదువు నంత కాలము (ఏది తక్కువైతే దానిని పరిగణించవలెను). 
  • ప్రారంభ తరగతికి సంభంధించి సభ్యులను ఇతర సభ్యుల కాల పరిమితి తీరిపోయి ఏర్పడిన  ఖాళీల నందు ఎంపిక చేయునట్లుగాచూడవలెను.
 Ex- Officio సభ్యులకుసంబంధించి

  1. సంబంధిత పాఠశాలల ప్రధానోపాద్యాయుడు లేదా ఇంచార్జ్ ప్రధానోపాద్యాయుడు మెంబర్ కన్వీనర్  గా వ్యవహరించవలెను. 
  2. సంభంధిత మండల విధ్యా శాఖాధికారి సదరు పాఠశాలలోని మరొక ఉపాధ్యాయుని సభ్యునిగా నామినేట్ చేయవలెను (మెంబర్  కన్వినర్ పురుషుడైనచో సహ ఉపాధ్యాయుడు స్త్రీ గా ఉండునట్లు లేదా మెంబర్ కన్వినర్ స్త్రీ అయినచో సహ ఉపాధ్యాయుడు పురుషుడుఉండునట్లు ప్రాధాన్యత ఇవ్వవలెను ). 
  3. సంబంధిత కార్పొరేటర్ /కౌన్సిలర్ / వార్డ్ మెంబర్ 
  4. సంబంధిత ఆవాస ప్రాంతపు అంగన్ వాడీ వర్కర్లు 
  5. సంబంధిత ఆవాస ప్రాంతపు ఏ.యన్.యం
  6. సంబంధిత  గ్రామపు / వార్డ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు 

🌳 Co-opted Members : 


  1. పేరెంట్స్ కమిటీ కి ఎన్నికైన సభ్యులు పాఠశాలకు సహకరించుచున్న విద్యా వంతులు / దాతలు / స్వచ్చంధ సేవా సంస్థ / Alumni / ఇతరులు నుండి ఇద్దరిని ఎంపిక చేయవలెను. 
  2. కో – ఆప్షన్ సభ్యుల కాల పరిమితి 2 సంవత్సరాలు 

  • సంబందిత గ్రామ సర్పంచ్ / మునిసిపల్ చైర్ పర్సన్ / మేయర్ వారి పరిధిలోని పాఠశాలల పేరెంట్స్ కమిటీసమావేశములకు హాజరు కావచ్చును. 
  • పేరెంట్స్ కమిటీ కి ఎన్నికైన సభ్యులు వారి నుండి ఒకరిని చైర్ పర్సన్ గాను మరియు మరొకరిని వైస్ చైర్ పర్సన్ గాను ఎన్ను కోవలెను. వీరిలో కనీసము ఒకరు మహిళ అయి వుండ వలెను. మరొకరు ప్రతికూల పరిస్థితులలో ఉన్న వర్గానికి చెందిన వారు లేదా బలహీన వర్గాలకు చెందిన వారై వుండవలెను. 
  • తల్లిదండ్రులలో ఒకరు మాత్రమే SMC సభ్యులను ఎన్నుకొను ఓటింగ్ ప్రక్రియ లో అనుమతించవలెను.
  • వివిధ తరగతులలో చదువుచున్న తమ పిల్లల తల్లి / తండ్రి ఆయా తరగతికి సంబంధించి ఓటింగ్ చేయుటకు అర్హులు 
  • సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించవలెను. 
  • ఎన్నికలు నిర్వహించుటకు గాను కనీసము 50% తల్లిదండ్రులు హాజరుకావాలీ . 
  • ఎన్నికలు చేతులు ఎత్తు పద్దతి ద్వారా గాని లేదా Voice vote ద్వారా నిర్వహించవలెను. అసాధారణ పరిస్థితులలో  మాత్రమే రహస్య ఓటింగ్ నిర్వహించవలెను.
  • పేరంట్స కమిటీ సమావేశము విద్యా సంవత్సరములో కనీసము 2 నెలలకు ఒకసారి నిర్వహించవలెను. మొదటి సమావేశము విద్యా సంవత్సరము ప్రారంభము నందు, చివరి సమావేశము విద్యా సంవత్సరము ముగింపు నందు నిర్వహించవలెను.
  •  ఎంపికైన సభ్యులు ఎవరైనా సమావేశము నిర్వహించవలసినదిగా కోరినప్పుడు చైర్ పర్సన్ అనుమతితో  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక సమావేశము నిర్వహించవలెను
  •  మద్యాహ్న భోజన పధకము,Academic review, Grants and Expenditure and Social audit for effective Monitoring and implementation of RTE లకు సంబంధించి PC సబ్ కమిటీలను ఏర్పాటు చేయవచ్చును. 
  • PC సమావేశము మినిట్స్ మరియు నిర్ణయములు రికార్డు  చేసి సభ్యులందరికి అందుబాటులో ఉంచవలెను. 
  • పాఠశాల పేరంట్స్  కమిటీ క్రింది బాధ్యతల కూడా నిర్వహించవలెను. 

  1. క్రమాను గతముగా కారికులం నకు  సంబంధించి పిల్లలసామార్ధ్యములను పరిశీలించుట, విద్యార్ధ్యుల   మరియుఉపాధ్యాయుల గైరుహాజరును పరిశీలించి సరైన చర్యలు గైకొనుట. 
  2. పిల్లల నమోదు మరియు ప్రతి దినము హాజరును పరిశీలించుట 
  3. 6-14 సంవత్సరముల పిల్లల జాబితాను నిర్వహించుచూ బడి బయట పిల్లలను  పాఠశాలలలో నమోదు చేయించుట. 
  4. ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది హాజరు మరియు లభ్యతను పర్యవేక్షణ మరియు సమీక్ష చేయుట.
  5. మధ్యాహ్న భోజన పధకమును పర్యవేక్షణ చేయుట.
  6. పాఠశాలకు సంబంధించిన జమ ఖర్చులను పరిశీలించి వార్షిక అకౌంట్ తయారుచేయుట 

  • P C కి సంబంధించి ఛైర్  పర్సన్ మరియు కన్వీనర్ జాయింట్   అకౌంట్ నిర్వహించుచూ పాఠశాలకు అందు మొత్తములను జాయింట్ అకౌంట్ కు జమచేయవలెను.  పాఠశాల అకౌంట్ ను ఆడిట్ నిర్వహణకు సిద్దముగా ఉంచవలెను.  ప్రతి సంవత్సరాంతమున వినియోగ ధృవ పత్రములను గ్రాంట్స్ విడుదల చేయు ఆధారిటీకి సమర్పించవలెను. 
  • ఠశాల పేరంట్స్  కమిటీ అకౌంట్ల ను ఇంప్లిమెంటేషన్ ఆధారిటీచే నియమించబదీన ఏజెన్సీ  లేదా టీం చే ఆడిట్ నిర్వహించబడును.
  • క్రింది విధముగా పాఠశాలల పేరంట్స్  కమిటీ ఎన్నికల నిర్వహణ కొరకు షెడ్యూల్ రూపకల్పన చేసియున్నారు.
  • 16.09.2019 (Monday) Issue of Notification to Conduct of Elections to SMC Members, Chairman & Vice Chairman 10.00 A.M.
  • Display of Voter List for conduct of Elections to SMC Members in the Notice Board of Primary / Upper Primary Classes / High Schools 2.00 P.M
  • 19.09.2019 (Thursday) Calling of Objections on Voter List and Redressal of Grievances if any 9.00 A.M to 1.00 P.M
  • Finalization of Voter List for Conduct of Elections to SMCs and its display in the Notice Board of the Primay / Upper Primary Schools / High Schools 3.00 P.M to 4.00 P.M
  • 23.09.2019 (Monday) Conduct of Elections to SMC Members Finalisation of Elected SMC Members & Formation of New SMCs 7.00 A.M to 1.00 P.M Conduct of Election of Chairman & Vice Chairman by SMC Members 1.30 P.M Oath taking by SMC Members, Chairman & Vice Chairman 2.00 P.M Conducting First SMC Meeting 3.00 P.M to 3.30 P.M.
  • ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో  వారిపై  చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి.  There should not be any political interference. 
  • MRO.MPDO. VRO.VRA లు ఎన్నికల  Observers. గా రావచ్చును.
  •  Disadvantages & weeker section  నుంచి  సభ్యులు దొరకనపుడు  it can. Be filled as per existing Rules of Reservation.
  • PMC ఎన్నికలలో పాల్గొనే  voters. వారి  ID Cards(. Aadar card /Ration card) తప్పక తీసుకు రావాలి.
  • If the school strength is below 15,there need not be conduct Election for PC members.All parents will be acted as  members.
  • PC ఎలక్షన్  జరుగుతున్నపుడు ఒక ఫోటో మరియు PCమీటింగ్ జరుగుతున్నపుడు ఒకఫోటోSTMS app నందుఅప్ లోడ్ చేయాలి.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |