APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF » గుంటూరు లో ప్రారంభం అయిన ఏ. పి. టి. ఎఫ్. ప్లాటినం జూబ్లీ వేడుకలు

గుంటూరు లో ప్రారంభం అయిన ఏ. పి. టి. ఎఫ్. ప్లాటినం జూబ్లీ వేడుకలు

Posted by APTF 1938
» APTF
» Sunday, 20 October 2019


ఆదివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏపీటీఎఫ్ ( 1938 ) ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు సందర్భంగా మూడు రోజు లపాటు జరగనున్న 19 వ రాష్ట్ర విద్యా వైజ్ఞా నిక మహా సభలు ప్రారంభమయ్యాయి . ఈ సభకు ఏపీటీఎఫ్ అధ్యక్షుడు కే వెంక టేశ్వరరావు . ఈ సభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి , గుంటూరు తూర్పు , చిలకలూరిపేట , వినుకొండ , వేమూరు ఎమ్మె ల్యేలు ముస్తఫా , విడదల రజనీ , జొల్లా బ్రహ్మనాయుడు , మేరుగ నాగార్జున తదితరులు ప్రసంగించారు . పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ , పురపాలకశాఖ కమీషనర్ విజయ్ కుమార్ , పాఠశాల విద్య ఆర్టేడీ కె . రవీంద్రనాథ్ రెడ్డి , డీఈవో గంగాభవాని , ఏపీ జేఏసీ సెక్ర టరీ జనరల్ జోసఫ్ సుధీర్ బాబు , ఫ్యాప్టో చైర్మన్ జి . వి . నారాయణ రెడ్డి , ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ కె . నరహరి , ఎఎఫ్ కార్యదర్శి పి . బాబురెడ్డి , ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె . వెంకటేశ్వర్లు , ఆహ్వాన సంఘం అధ్యక్షులు తాతా సేవాకుమార్ , జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి . వేళాంగినిరాజు , కె . నరసింహారావు , 13 జిల్లాల నుంచి సంఘం నాయకులు పాల్గొన్నారు .
విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం
ఏపీటీఎఫ్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
 రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు సమూల మార్పు లకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొ న్నారు . మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని దీనిని నిల బెట్టుకునేందుకు కృషి చేస్తామన్నారు . కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం పై ( సీపీఎస్ ) నియమించిన కమిటీలు అన్ని ప్రాధమ్యాలు , ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని ముందు కెళ్తున్నాయని , త్వరలో ప్రభుత్వం సీపీఎస్ పై శుభవార్త చెబుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు . ఉద్యోగాల భర్తీతో పాటు ఏకీకృత సర్వీసు నిబంధనలు , కోర్టు కేసుల్లో నలుగుతున్న ఎంపిక ప్రక్రియలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. సేవా భావంతో వ్యవహారించాల్సిన విద్యారంగంలో వ్యాపారం మొదలైం దని , దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి కమిషన్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు . త్వరలో పాఠశాలల రూపురేఖల్ని మార్చివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుం దన్నారు . దీనిలో భాగంగా ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చి ' ప్రభుత్వ పాఠశాలలు నాడు - నేడు ' అనే నినాదంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభమైందని వివ రించారు . 2020 - 21 విద్యా సంవత్సరానికి సిలబస్ , 2021 – 22 కి పదో తరగతి పాఠ్య ప్రణాళికలో మార్పులు చేపడుతున్నట్లు చెప్పారు . సర్వశిక్ష అభియాన్ పీవోల పోస్టిం గుల్లో మార్పులు చేశామని వివరించారు . జిల్లా విద్యాధికారులకు జేడీ స్థాయినిచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈసంద ర్భంగా విద్యా శాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ విద్యా శాఖను ఉన్న తంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 28వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు .

విద్యాశాఖ మంత్రి డా.సురేష్ గారు



రాష్ట్ర అధ్యక్షుడు కె. వేంకటేశ్వర రావు గారు

ఉపాధ్యాయులు ఏకీకృత పాఠశాల విధానంపై యోచిస్తున్నాం : మంత్రి బొత్స
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 75సంవత్సరాల ఉపాధ్యాయ ఉద్యమంలో మార్పు బాలకృష్ణమ్మ కృషి ఎనలేనిదని గుర్తుచేశారు . నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపిన ఘనత ఏపీటీఎఫ్ దేనని శ్లాఘించారు. రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల కింద ( జడ్పీ , మున్సిపల్ , ప్రభుత్వ , ఎయిడెడ్ , మండల పరిషత్ ) ఉన్న పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు . మంత్రి మాట్లా డుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయునికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు . నాడు - నేడు కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతుందన్నారు . మున్సిపల్ పాఠశాలల్లో 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారికి జీపీఎఫ్ సమస్య ఉందని , ఈ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు , పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందాలన్నదే లక్ష్యంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. విద్యా రంగంలో నూతన సంస్కరణలు చేపట్టే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు . ఫలితంగా నాణ్యమైన విద్య అందుతుందన్నారు .
  ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో సంస్కరం ణలు ప్రారంభమయ్యాక విద్యారంగంలో ప్రైవేటు , కార్పొరేటీకరణ అధికమై ప్రభుత్వ విద్యారంగం దెబ్బతిందని పేర్కొన్నారు . ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని అంశాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నందున ఉపాధ్యా యులు నిరంతరం నూతన ఆంశాలు నేర్చుకుని విద్యార్థులను తీర్చి దిద్దాలని సూచించారు .

స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ మేనల్లుడు , విద్యా హక్కుల వేదిక ఆధ్య క్షుడు జగె మోహన్ సింగ్ ( పంజాబ్ ) మాట్లా డుతూ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం కూడా స్థాపించి అదే స్పూర్తితో పని చేయడం అభినం దనీయమని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదం రంగు , రూపు మార్చుకున్నాయేగానీ దోపిడీని మార్చుకోలేదన్నారు . భారతదేశంలో సమానత్వ సాధనకు పోరాటాలే శరణ్యమని , సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు


భగత్ సింగ్ మేనల్లుడు జగ్ మోహన్ సింగ్ గారు


రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హృదయ రాజు గారు




Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |