ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా శాఖ:
మిత్రులారా ఈరోజు అనగా 19.09.2020 న జరిగిన విజయనగరం మన జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా శాఖ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షులుగా D ఈశ్వరరావు గారిని,జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను(పువ్వల.ధనంజయ రావు, బలిజిపేట వారిని),మిగతా కార్యనిర్వహణ సమితిని , జిల్లా కార్యవర్గాన్ని,ఆడిట్ కమిటీని,రాష్ట్ర కౌన్సిలర్స్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరి అంచనాలు, ఆకాంక్షలు తగ్గట్టుగా అందరితో కలిసి సంఘాన్ని ముందుకు నడిపించడం లో ఇప్పటిలాగే ప్రతి పనిలో ఇదే రకమైన సహాయ సహకారాలు ఎన్నికైన సభ్యులందరికీ అందించాలని కోరుకుంటూ అందరికీ ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాము.
-పి.ధనుంజయ్ రావు, ప్రధాన కార్యదర్శి, విజయనగరం జిల్లా, APTF