APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF VZM
Showing posts with label APTF VZM. Show all posts
Showing posts with label APTF VZM. Show all posts

ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు...APSEC & APTF బొబ్బిలి

Mohan
APTF Updated at: April 09, 2022

 ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు... విద్యా పరిరక్షణ సమితి ఏ పి టి ఎఫ్ బొబ్బిలి....... అప్రజాస్వామిక ,విద్యా ప్రతిబంధక నూతన విద్యా విధానాన్ని 2020 ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ వ్యతిరేకిస్తుంది .ఈరోజు బొబ్బిలి విద్యావనరుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 నిరసన తెలియజేసింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చప్పా వెంకటరమణ మాట్లాడుతూ 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల వరకు తరలించే జిఓ నెంబర్ 85 ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 ఉండాలని,  ఉన్నత పాఠశాలలో  రెండు మాధ్యమాలను కొనసాగించాలని, 4674 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 37 రద్దు చేయాలని ,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యను ఉన్నది జాబితానుంచి రాష్ట్ర పరిధిలోకి వచ్చేటట్టుగా రాష్ట్ర చట్టసభల్లో తీర్మానం చేయాలని అన్నారు ప్రాథమిక పాఠశాల ముక్కలు చేస్తే తల్లిదండ్రులతో, ప్రజలతో ప్రజాతంత్ర పోరాటం చేయడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదనంతరం మండల విద్యాశాఖ అధికారి చల్ల లక్ష్మణ రావు గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట సత్యనారాయణ, బొబ్బిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తేంటుభాస్కర్ రావు ,కోట గోపాలకృష్ణ, ఎం ప్రసాద్ రావు చిన్ని కృష్ణ, సింహాచలం, వెంకటేశ్వరరావు చక్రధర్ పాల్గొన్నారు






రాష్ట్ర  ఏపిటిఎఫ్ బాధ్యులు DTA గారిని ,సి ఎఫ్ ఎం ఎస్ ceo గారిని,CSE కమిషనర్ గారిని కలిసి ప్రాతినిధ్యం

రాష్ట్ర ఏపిటిఎఫ్ బాధ్యులు DTA గారిని ,సి ఎఫ్ ఎం ఎస్ ceo గారిని,CSE కమిషనర్ గారిని కలిసి ప్రాతినిధ్యం

Mohan
APTF Updated at: March 23, 2022

 APTF(1938) VZM

పాఠశాలలు upgrade అయిన వాటికి ,స్కూల్ బై ఫర్ కేషన్ అయినవాటికి,NEW Schools కి ఆర్గనైజేషన్ కోడ్ లేకపోవడం వలన ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు ఖర్చు చేసిన నిధులు డ్రా చేసే అవకాశం లేక ఆ పాఠశాలలష ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.అలాగే కొంత మంది ఉపాధ్యాయులకు పొజిషన్ ఐ డి  లు క్రియేట్ కాకపోవడంతో ఉపాధ్యాయుల జీతాలు డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తెర్లాం గరివిడి ,బలిజిపేట మండల శాఖలు ఈ రెండు అంశాలను  విజయనగరం జిల్లాశాఖకు ప్రాతినిధ్యం చేయటం తో. జిల్లా శాఖ రాష్ట్ర  సంఘంనకు ప్రాతినిధ్యం చేయటం తో రాష్ట్ర  ఏపిటిఎఫ్ బాధ్యులు DTA గారిని ,సి ఎఫ్ ఎం ఎస్ ceo గారిని,CSE కమిషనర్ గారిని కలిసి ప్రాతినిధ్యం చేశారు. దానికి స్పందించిన పై వారు ఈ నెల 25వ తేదీ తర్వాత STO లకు  పై రెండు సమస్యలు పరిష్కరించే అధికారం  ఇస్తామని అని హామీ ఇచ్చారు.  ఈ సమస్యలు రాష్ట్రంలో దాదాపు గా అన్ని మండలాల్లో కూడా ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఏపిటిఎఫ్ శాఖ  రాష్ట్ర సంఘంనకు ప్రాతినిధ్యం చేసినది.ఇదే విషయమై గత సంవత్సరము( జనవరి 2021) కూడా ప్రాతినిధ్యం చేయగా అధికారులు Non HRMS లో జీతాలు చేసుకునే వెసులుబాటు కల్పించినారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేదు.

ఈ విషయంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కృషి చేస్తున్న రాష్ట్ర బాధ్యులకు జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము

రైతులు, ఉద్యోగులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి.

Mohan
APTF Updated at: December 19, 2021


👆 *APTF(1938) VZM*
 గత కొన్ని రోజుల నుండి రైతులకు ,కార్మికులకు బకాయిలు చెల్లింపు మరియు ఫ్యాక్టరీ కొనసాగింపు విషయమై విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ncs sugars వద్ద  రైతు సంఘాల , శ్రీరామ సుగర్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం  జరుగుతూనే ఉన్నాయి.
 ఈ రోజు (19.12.2021) ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని  ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 విజయనగరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పువ్వల ధనుంజయ రావు సందర్శించడం జరిగింది  ఈ సందర్భంగా శిబిరాన్ని ఉద్దేశించి యాజమాన్యం, ప్రభుత్వం కలగజేసుకుని రైతులు, ఉద్యోగులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని ,ఫ్యాక్టరీని కొనసాగించాలని తెలియజేయడమైనది. ఈ శిబిరానికి సంఘీభావం తెలియజేయడమైనది.

విజయనగరం జిల్లా APTF కార్యవర్గ సమావేశం

Mohan
APTF Updated at: October 11, 2021


ఈరోజు విజయనగరం జిల్లా APTF కార్యవర్గ సమావేశం డి. ఈశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏ. సదాశివ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ రావు, రాష్ట్ర , జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొని పలు అంశాలపై తీర్మానాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి.హృదయరాజు గారు కార్యవర్గాన్ని ఉద్దేశించి ఆన్లైన్ ఫోన్ ద్వారా ప్రసంగించారు.

విజయనగరం జిల్లా లో APTF 1938 సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mohan
APTF Updated at: September 24, 2021

 APTF(1938) THERLAM/VZM






ఈరోజు(23.09.2021) తెర్లాం  మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి వి రమణ, డి సింహాచలం గార్ల ఆధ్వర్యంలో తెర్లాం మండలం లో గల 12 పాఠశాలలో సభ్యత్వ, జనరల్ ఫండ్, ఉపాధ్యాయ ప్రగతి క్యాంపైన్ నిర్వహించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు అయిన మండల శాఖ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ను చాలా చక్కగా నిర్వహించినది ఉపాధ్యాయులు కూడా చక్కగా ప్రతిస్పందించారు. కొత్తగా ఏర్పాటు అయిన మండల శాఖ వద్ద ఈ రకమైన పరిస్థితి ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మండల శాఖల ఉపాధ్యాయులు ఎంత చక్కగా స్పందిస్తారో ఊహించ వచ్చును. కావున మనం పాఠశాలలకు వెళ్ళటమే ఆలస్యం ఉపాధ్యాయుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నది కావున ప్రతి ఒక్క మండల శాఖ రేపటి నుండే  క్యాంపైన్ నిమిత్తం కదలాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట. సత్యనారాయణ గారు, జిల్లా మాజీ సహాధ్యక్షులు పి వి రాజశేఖర రావు గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం బలరాం నాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పువ్వల ధనంజయ రావు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, చక్కని సహకారం అందించిన తెర్లాం మండల ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్  ఫెడరేషన్ (1938) తెర్లాం మండల శాఖ మరియు జిల్లా శాఖల పక్షాన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము.

సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది: ఏపీటీఎఫ్ విజయనగరం శాఖ

సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది: ఏపీటీఎఫ్ విజయనగరం శాఖ

Mohan
APTF Updated at: June 02, 2021

ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలందరికీ 
ఉధ్యమాభివందనాలు.

__ మిత్రులారా! 

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 31-5-2021 నాడు విడుదల చేసిన సర్కులర్ నం. 172/ A&I/ 2020 పూర్తిగా అశాస్త్రీయ మైనది, ఆచరణ సాధ్యం కానిది. పాఠశాల విద్యా రంగాన్ని సమూలంగా మార్చడానికి ( దీని నేపథ్యం జాతీయ విద్యా విధానం - 2020) ఉద్దేశించబడిన ఈ సర్కులర్ మన రాష్ట్ర పాఠశాల విద్యా రంగాన్ని మరింతగా సంక్షోభం లోనికి నెట్టివేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, విద్యా వేత్తలతో ఏమాత్రం వివరంగా చర్చించ కుండా ఆగమేఘాల మీద విడుదల చేసిన ఈ సర్కులర్ వల్ల  ప్రాథమిక విద్య, సెకండరీ స్కూల్ విద్య అమలు మరింత గందరగోళానికి దారితీస్తుంది. అంగన్ వాడి వ్యవస్థ నిర్వీర్య మై పోతుంది. పూర్వ ప్రాథమిక విద్యను బలో పేతం చేయడమే ప్రభుత్వ సంకల్పం అయితే, ప్రస్తుతం వున్న ప్రాథమిక పాఠశాలల పరిధిలోనే  పాఠశాలలకు అనుబంధంగా ECCE  కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొఠారి కమిషన్, విద్యా హక్కు చట్టం - 2009  చెబుతున్నాయి. మరియు ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్నాయి. ఉన్న ప్రాథమిక తరగతులను ( 1- 5 తరగతులు) విడదీసి విడి విడిగా, వేరు వేరు ప్రాంతాలలో నిర్వహించడం అశాస్త్రీయం. అది కూడా ఓకే SGT ఉపాధ్యాయుని తో నిర్వహించాలని సూచించడం దారుణం. సర్కులర్ ప్రకారం తరగతుల వర్గీకరణ, ఉపాధ్యాయుల వర్గీకరణ, శాస్త్రీయంగా వున్నాయి. ఒక తరగతి కి ఒక ఉపాధ్యాయుడు అన్న విద్యా హక్కు - 2009 సూత్రాలకు భిన్నంగా ఈ నిబంధనలు ఉన్నాయి. 6 పేజీల నిడివిగల ఈ సర్కులర్ నిండా సాంకేతిక, అద్భుతమైన డాంభిక  సామాన్య మానవులకు అర్థం కాని పదజాలం వుంది. ఈ పదాల అర్థం సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం కాని పదజాలాన్ని వినియోగించి, చదివిన వారిని గందరగోళ పరిచేలా వుంది తప్ప, ఆచరణ లో ఇబ్బందులే వుంటాయి. ప్రభుత్వ విద్య పేద బడుగు వర్గాల వారికి దూరం చేసేలా వుంది. పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య , సెకండరీ విద్య ల వర్గీకరణ శాస్త్రీయ బద్దంగా లేదు. విద్యారంగ శాశ్విత మార్పులకు ఉద్దేశింప బడిన ఈ ఉత్తర్వులను ఇంత తొందరగా ఈ కరోనా కష్ట కాలంలో తీసుకు రావలసిన అవసరం లేదు. ఈ కరోనా మహమ్మారి కాలంలో  దేశ వ్యాప్తంగా విద్యా రంగం మొత్తం సంక్షోభంలో వుంది. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద మైన ఈ జాతీయ విద్యా విధానం - 2020 అమలుకు ఈ కరోనా సంక్షోభ కాలాన్ని ఒక అవకాశం గా వాడుకోవాలని చూస్తున్నది. రాష్ట్రా ల హక్కులను హరించి వేసి, దేశ ఫెడరల్ సూత్రాలకు భిన్నంగా తీసుకు వస్తున్న ఈ జాతీయ విద్యా విధానం - 2020 ని రాష్ట్ర ప్రభుత్వాలు అనాలోచితంగా తొందరపడి అమలుచేస్తున్నాయి. ఈ విషయంలో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరి ఒకడుగు ముందుకు వేసి, ఈ సర్కులర్ ను జారీ చేసింది.

  అసలు ఇంత పెద్ద మార్పులకు ఉద్దేశించిన ఈ విధానాలను ఒక G.O. గా ( పటిష్ఠ మైన ప్రభుత్వ ఉత్తర్వులు) కాకుండా సర్కులర్ రూపంలో విడుదల చేసింది. దీన్ని ఎవరైనా న్యాయస్థానంలో సవాలు చేస్తే రద్దు చేయబడుతుంది.

        ___ మిత్రులారా, ఉపాధ్యాయ సంఘాలుగా, విద్యార్థి సంఘాల బాధ్యులుగా మొత్తం సమాజానికి, విద్యారంగానికి, ఉపాధ్యాయ వర్గానికి బాధ్యత వహించ వలసిన మనం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సర్కులర్ ను తిరస్కరించాలి. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చి, ఈ మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో, విద్యా వేత్తలతో, ఉపాధ్యాయ MLC లతో, తల్లిదండ్రులలో చర్చించిన అనంతరం, కరోనా సంక్షోభం అనంతరం, అందరికీ ఆమోద యోగ్యమైన విధంగా అమలు చేసేలా చూడవలసిన బాధ్యత మనపై వుంది. ఈ సర్కులర్ రద్దు కొరకు మనందరం డిమాండ్ చేయాలి. మన మన క్యాడర్ ను ఈ విషయంలో చైతన్యం చేసుకోవాలి. MLC లపై ఒత్తిడి తీసుకు రావాలి. ఆ దిశగా సోదర ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రయత్నించ వలసిందిగా మినమ్రంగా మిమ్ముగా కోరుతున్నాను.

చుక్క జగన్నాధం మాస్టారు గారు తన పదవీ విరమణ :: APTF VZM

Mohan
APTF Updated at: February 22, 2021

 చుక్క జగన్నాధం మాస్టారు గారు తన పదవీ విరమణ సందర్భం గా  
APTF  మాస పత్రిక ప్రగతి కు 1000,
జిల్లాకు1000, 
బలిజిపేట శాఖ కు 3000 
total 5000₹ అందచేశారు....       
ఈ సందర్భంగా జగన్నాధం మాస్టారు గారికి అభినందనలు & ధన్యవాదములు....      
🙏 APTF VZM&APTF balijipeta


విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న విజయనగరం జిల్లా అధ్యక్షులు D ఈశ్వరరావు గారు

Mohan
APTF Updated at: February 11, 2021

Aptf  విజయనగరం జిల్లా శాఖ  మొదటి కార్య నిర్వహణ సమితి

Aptf విజయనగరం జిల్లా శాఖ మొదటి కార్య నిర్వహణ సమితి

Mohan
APTF Updated at: February 01, 2021

 ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా శాఖ నిన్న జరిగిన మొదటి కార్య నిర్వహణ సమితి లో భాద్యులందరూ నూతన ఉత్సాహంతో సంఘ పటిష్టత కోసం సంఘ నిర్మాణంలో అనేక ముఖ్య సూచనలు, సలహాలు ఇవ్వడంలో,  తీర్మానాలు ఆమోదించడం లో ,ఆర్థిక సహకారం అందించడం లో, చర్చల్లో పాల్గొనడం లో, చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించినందుకు గాను ప్రతి ఒక్క బాధ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నాలుగు గంటల పాటు చక్కగా నిర్వహించినందుకు జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము నిన్న ఆమోదించిన తీర్మానాలను మనమే మరవకుండా ఇదే ఉత్సాహంతో అమలులో చిత్తశుద్ధి చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

APTF (1938)విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన సందర్భంగా శ్రీ పువ్వల ధనంజయ రావు గారికి సన్మాన కార్యక్రమం

Mohan
APTF Updated at: December 01, 2020

 BALIJIPETA నుండి  నూతనం గా APTF (1938)విజయనగరం  జిల్లా ప్రధాన కార్యదర్శి గా  ఎన్నికైన సందర్భంగా  శ్రీ పువ్వల ధనంజయ రావు గారికి ఈ రోజు న (తేదీ 01.12.2020 ది న) సన్మాన కార్యక్రమం ప్రాథమికోన్నత పాఠశాల గళావళ్లి నందు MPUPS GALAVALLi teachers & n n valasa school complex teachers ఆధ్వర్యంలో నిర్వహించడమైనది


APTF (1938)  విజయనగరం  జిల్లా   ప్రధాన కార్యదర్శి తో  పాటుగా నూతనంగా మండల శాఖ కు ఎన్నికైన APTF (1938)మండల శాఖ అధ్యక్షులు శంబంగి వెంకటేశ్వర రావు గారికి,        ప్రధాన కార్యదర్శి మజ్జి శేషగిరి రావు గారికి కూడా  ఘనంగా సత్కరించడం జరిగినది.


ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసిన కార్యకర్తల యావన్మందికి, వివిధ కారణాలతో హాజరు కాలేకపోయినా కార్యకర్తల యావన్మందికి జిల్లా శాఖ పక్షాన, మండల శాఖ పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము.







APTF విజయనగరం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ( 19.09.20)

Mohan
APTF Updated at: September 20, 2020

 ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా శాఖ: 

మిత్రులారా ఈరోజు అనగా 19.09.2020 న జరిగిన విజయనగరం మన జిల్లా శాఖ కార్యాలయంలో  జిల్లా శాఖ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షులుగా D ఈశ్వరరావు గారిని,జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను(పువ్వల.ధనంజయ రావు, బలిజిపేట వారిని),మిగతా కార్యనిర్వహణ సమితిని , జిల్లా కార్యవర్గాన్ని,ఆడిట్ కమిటీని,రాష్ట్ర కౌన్సిలర్స్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు   కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరి అంచనాలు, ఆకాంక్షలు తగ్గట్టుగా అందరితో కలిసి సంఘాన్ని ముందుకు నడిపించడం లో ఇప్పటిలాగే ప్రతి పనిలో ఇదే రకమైన సహాయ సహకారాలు  ఎన్నికైన సభ్యులందరికీ అందించాలని కోరుకుంటూ అందరికీ ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాము.

-పి.ధనుంజయ్ రావు, ప్రధాన కార్యదర్శి, విజయనగరం జిల్లా, APTF





22న విద్యా వైజ్ఞానిక సభ.. విజయనగరం  జిల్లా ప్రధాన కార్యదర్శి జేసీ రాజు

22న విద్యా వైజ్ఞానిక సభ.. విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి జేసీ రాజు

Mohan
APTF Updated at: September 10, 2019

 విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 8:

 ఏపీటీఎఫ్‌ (1938) ఏర్పాటై 75 ఏళ్లవుతున్న నేపథ్యంలో ఈ 22న విజయనగరంలో విద్యా వైజ్ఞానిక సభను నిర్వహించనున్నట్టు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జూసీ రాజు చెప్పారు. ఆదివారం ఏపీటీఎఫ్‌ జిల్లాశాఖ కార్యాలయంలో విద్యా,వైజ్ఞానిక సభల కరపత్రాన్ని ఆ సంఘ నాయకులతో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీటీ ఎఫ్‌ 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేసిందన్నారు. ఉపాధ్యా య సమస్యలు, హక్కులను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేసిందని తెలి పారు. విద్యా రంగం ఎదుర్కొంటున్న సమ స్యలపై పోరాడిన ఘనత తమ సంఘానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించాలన్న డి మాండ్లపై ఎంతో శ్రమించామని తెలిపారు. ఈ నెల 22న నిర్వహించే కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ సాధించిన విజయాలు, భవిష్యత్‌లో సాధించా ల్సిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొం టారన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డి ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ మహాసభలలో విద్యా, ఉపాధ్యాయ, పాఠశాల, సామాజిక రంగ సమస్యలపై చర్చ, తీర్మానాలు ఉంటాయని తెలిపారు. ఈ సభలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ్యుడు కోలగట్ల వీర భద్రస్వామి, అధికారులు, విద్యావేత్తలు హాజ రవుతారన్నారు. జిల్లాలోని ఏపీటీఎఫ్‌ నాయ కులు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విద్య, వైజ్ఞానిక సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ సంఘ నాయకులు ఎ.సదాశివరావు, ఆర్‌.కృష్ణ, పైడిరాజు, పి.ఈశ్వరరావు, వై.వెంకటరావు, ఏవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

"అమ్మ ఒడి" పధకం ప్రభుత్వ పాఠశాలలకు అమలు చేయవలసిందిగా విజయనగరం శాసన సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి వినతి పత్రం

Mohan
APTF Updated at: June 15, 2019

మిత్రులారా! APTF1938 రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఈరోజు "అమ్మ ఒడి" పధకం ప్రభుత్వ పాఠశాలలకు పంపించిన వారికి అమలు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభ లో ప్రస్తావించవలసిందిగా విజయనగరం అసెంబ్లీ శాసన సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి వినతి పత్రం APTF 1938 కార్యకర్తలు సమర్పించారు



ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే లక్ష్యం :ఈశ్వర్ రావు

Mohan
APTF Updated at: June 04, 2019

ఈరోజు DEO విజయనగరం వారి ద్వారా పాఠశాల డైరెక్టర్ గారికి APTF1938 జిల్లా శాఖ వినతి పత్రం

Mohan
APTF Updated at: April 23, 2019


మిత్రులారా!
ఈరోజు DEO విజయనగరం వారి ద్వారా పాఠశాల డైరెక్టర్ గారికి APTF1938 జిల్లా శాఖ వినతి పత్రం అర్జెంటీగా పంపించ వలసిందిగా కోరడం జరిగింది. మేడం గారు వెంటనే పంపించారు.
  1. 1. ఉపాధ్యాయుల కు MDM విధుల నుండి తప్పించాలి, విద్యాశాఖలో బోధన సిబ్బందికి Vacation కావున తప్పిచాలి లేదా 30 ELs మరియు గౌరవ వేతనం ఇవ్వాలి.
  2. 2. 220 పని దినాలు చాలని పాఠశాలలు ఏప్రిల్ 23 తరువాత కూడా పనిచేయాలి అని పాఠశాల డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ఉత్తర్వులుకు అర్ధం లేదు విద్యార్థులు పరీక్షలు అయిన తరువాత బంధువులు ఇళ్లకు, వినోద లేదా తీర్ధ యాత్రలకు మానసింకంగా తయారు అవుతారు ఈ సమయం లో ఉపాధ్యాయులు పాటశాలకు రమ్మంటే తల్లిదండ్రులు తిరగబడతారు కావున వెంటనే ఉపసంహరించండి. 220 రోజులు పని దినాలు చాలక పోవడానికి కారణం ప్రభుత్వం 1 సార్వత్రిక ఎన్నికలు,2. ప్రకృతి వైపురత్యాలు తదితర కారణాలు
  3. 3.SSC విధులు నిర్వహించిన వారికి Remuneration పెంచాలి మరియు 8 కి.మీ. దాటిన వారికి TA&DA ఇవ్వాలి.
  4. 4. 8 కి. మీ. దాటిన SSC Exams నియమింప బడిన Chief,DO, Invigilator కి TA&DA ఇవ్వాలి.
  5. 4.SSC spot మరియు ఇతర సమావేశాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |