ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో కోవిడ్ positive గా నిర్ధారించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం (EHS) ద్వారా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికి జిల్లాలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు హెల్త్ కార్డ్స్ కింద వైద్యం నిరాకరించి డబ్బును వసూలు చేస్తున్నారని APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాష్ర్ట EHS స్టీరింగ్ కమిటీ సభ్యులు జి. హృదయరాజు, APTF జిల్లా గౌరవాధ్యక్షులు ఏ.కమలాకర రావు, ప్రధాన కార్యదర్శి ఎస్.ఇస్మాయిల్, సహద్యక్షులు కె.శేఖర్ లు EHS కర్నూలు జిల్లా కో ఆర్డినేటర్ గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. జిల్లాలోని AMILEO హాస్పిటల్ మరియు MEDICOVER ఆసుపత్రులలో ఇటీవల కాలంలో కోవిడ్ positive గా నిర్ధారించిన ఒక ఉపాద్యాయుడు మరియు పెన్షనర్ కి EHS క్రింద వైద్యం నిరాకరించి ఒకరి దగ్గర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇంకొకరి దగ్గర 3.6 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసారని, ఇటువంటి సంఘనలు జిల్లాలో చాలా ఉన్నాయని వాటిని వెంటనే వెనక్కి చెల్లించేలా ఆసుపత్రు లపై చర్యలు తీసుకోవాలని వీరు తెలిపారు.దీనిపై EHS జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీణ్ గారు తక్షణమే స్పందించి ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటానన్నారు.అదే విధంగా జిల్లా లోని ఆసుపత్రులలో ఎక్కడైనా హెల్త్ కార్డ్స్ ద్వారా వైద్యం నిరాకరిస్తే తక్షణమే 104 కి గాని కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఐతే ఆసుపత్రుల యాజమాన్యాలు , EHS సిబ్బంది సమస్యలపై స్పందించనిచో రాష్ట్ర CEO గారి దృష్టికి తీసుకెళ్తామని APTF నాయకులు అన్నారు.


