APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » రేషనలైజేషన్/బదిలీలు...కదలిక జిల్లా వారీ బదిలీల పరిశీలనకు ఆఫీసర్స్ ని డెప్యూటీ చెయ్యమని పాఠశాల విద్యా శాఖ వారి ఉత్తర్వులు

రేషనలైజేషన్/బదిలీలు...కదలిక జిల్లా వారీ బదిలీల పరిశీలనకు ఆఫీసర్స్ ని డెప్యూటీ చెయ్యమని పాఠశాల విద్యా శాఖ వారి ఉత్తర్వులు

Posted by Mohan
» CSE GO
» Friday, 11 September 2020

  •  Rc.No.memo.No.13/27/2019-Est 3-CSE  Dated 11-09-2020


  • బదిలీలపై సన్నాహక‌ చర్య- ఖాళీలను,రేషన్ లైజేషన్   కొరకు Soft copies ను Ready చేయుట


  • రేషనలైజేషన్/బదిలీలు...కదలిక
  • జిల్లా వారీ బదిలీల పరిశీలనకు ఆఫీసర్స్ ని డెప్యూటీ చెయ్యమని  పాఠశాల విద్యా శాఖ వారి ఉత్తర్వులు.⤴️


  • 16-09-2020 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, మరియు పశ్చిమ గోదావరి.. 
  • 17-09-2020  కృష్టా,గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు...
  • 18-09-2020 చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం.. 


  • పైన కనబర్చిన తేదిలలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రొవిజనల్ జాబితాను DSE నందు సబ్మిట్ చేయడానికి సంబంధిత అధికారులను డిప్యూట్ చేయాలని ఆదేశాలు...


Click here to Download Copy


ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కదలిక వచ్చింది. టీచర్ల పునర్విభజన ప్రక్రియను వెంటనే పూ ర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ జాబితాలు తయారీకి జిల్లాల వారీ అధికారులను నియమించారు. జిల్లా, మండల పరిషత్‌, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్విభజన చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29నాటికి పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, యూడైస్‌ ఆధారంగా కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు, ఎంతమంది టీచర్లను కేటాయించాలో కూడా ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. పాఠశాలలున్న ప్రాంతాలు, అక్కడ ఉపాధ్యాయులు పొందే హెచ్‌ఆర్‌ఏ ప్రాతిపదికగా కేటగిరీ 1, 2, 3, 4 వారీగా జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఆగస్టు 31నా టికి ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి అర్హులు. అలాగే ఐదేళ్లు పూర్తిచేసిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తిచేసిన ఎస్జీటీలు, స్కూలు అసిస్టెంట్లు, ఇతర కేటగిరీ టీచర్లందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.

♦16లోపు కమిషనర్‌కు అందజేయాలి

ఉపాధ్యాయుల పునర్విభజన జాబితాలు అన్నింటిని ఈ నెల 18నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. జిల్లాలో తయారుచేసిన జాబితాలను పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలోని యూడైస్‌ డేటాతో సరిపోల్చి ధ్రువీకరణ పొందాల్సి ఉంది. జాబితాల తయారీ అధికారం పూర్తిగా జిల్లాలకే అప్పగిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉన్నందున దానికి చెక్‌పెడుతూ కమిషనర్‌ కార్యాలయంలో జాబితాలను ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన జిల్లా జాబితాలను పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.  ఆయా తేదీల్లో కేటాయించిన జిల్లాల అధికారులు ఉదయం 10.30 కల్లా కమిషనర్‌ కార్యాలయంలోని ఐటీ సెల్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారు 18వ తేదీన ధ్రువీకరిస్తారు.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |