నవోదయ ప్రవేశాలు
═══ ❈ ═══
★ నవోదయ విద్యాలయంలో 2021-2022 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు.
★ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయునితో ధ్రువీకరణ పత్రం తీసుకుని మీసేవా కేంద్రంలో లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో లేదా ఆన్‌లైన్లో డిసెంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
★ రిజర్వేషన్లలోని 16 కేటగిరీల నుంచి ఎంపిక జరుగుతుంది. ఇందులో గ్రామీణ విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తారు.
★ విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రవేశ పరీక్ష 2021 ఏప్రిల్ 10వ తేదీన జరుగుతుంది.
ప్రవేశ పరీక్ష సిలబస్ ఇలా..
★ ప్రవేశ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు. పరీక్ష సమయం 2.30గంటలు
★ రీజనింగ్: (బొమ్మలను విద్యార్థి తన మేథస్సును ఉపయోగించి గుర్తించడం): ఈ విభాగంలో 40 ప్రశ్నలు-50 మార్కులు. ఇందులో భిన్నమైనవి, సదృశ్య బొమ్మలు, ఏకరూప, సంబంధిత బొమ్మలు గుర్తించడం వంటి అంశాల నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు.
★ అర్థమెటిక్: 20 ప్రశ్నలు- 25 మార్కులు. ఇందులో సంఖ్యామానం, లాభనష్టాలు, బారువడ్డీ-చక్రవడ్డీ, కాలం-పని, వేగం-దూరం, చుట్టుకొలత-వైశాల్యం-ఘన పరిమాణం, ద్విపరిమాణం- త్రిపరిమాణం, సరళరేఖలు, వక్రరేఖలు, దత్తాంశ నిర్వహణ, క్యాలెండర్ తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
★ లాంగ్వేజ్ (తెలుగు, ఇంగ్లీష్): ఈ విభాగంలో 20 ప్రశ్నలు-25 మార్కులు. ఇందులో 4 పేరాగ్రాఫ్‌లు ఇస్తారు. ఒక్కో దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి.