ప్రజలకు ప్రమాదకరమైన అప్రజాస్వామిక,ఆశాస్త్రీయ నూతన జాతీయ విద్యా విధానాన్ని నిలవరించాలి: జి. హృదయ రాజు
ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు & అఖిలభారత విద్యాహక్కు వేదిక పిలుపులో భాగంగా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందు ఆంద్రప్రదేశ్ విద్య పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ గట్టుతిమ్మప్ప అధ్యక్షతన నిరసన ప్రదర్శన జరిగింది.
నిరసనలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు జి.హృదయరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం ఏసేపూ జిల్లా కో -కన్వీనర్ ఇస్మాయిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు కమలాకర రావు,బజారప్ప,మద్దయ్య, రామకృష్ణ, మరియానందం,కాంతారావు లు పాల్గొన్నారు.
నిరసనలో ఎపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం అమలైతే జరిగే ప్రమాదం గురించి వివరించారు.ఒకే దేశం, ఒకే విద్య పేరున రెసిడెన్షియల్ విద్యావిధానాన్ని అమలు చేసి, వెనకబడిన,అణగారిన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు.ఉద్యోగ నియమకాలలో,పదోన్నతులలో మెరిట్ పేరున సామాజిక న్యాయానికి చెల్లుచీటి ఇచ్చి సీనియర్లకు అన్యాయం చేస్తుందన్నారు.
రత్నం ఏసేపు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టములో పేర్కొన్న ప్రజలకు మేలు చేసే అంశలను పక్కన పెట్టి బడా పారిశ్రామిక వేత్తలైన అంబానీ,ఆదనీ సంస్థలకు విద్యను అప్పచెప్పటానికి ఈ డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. దీనిని పూర్తిగా వ్యతిరేకించి రద్దు అయ్యేంతవరకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
- ఏపి సెక్, కర్నూలు జిల్లా