ఫ్రెండ్స్!
టీచర్ల / హెచ్.యం ల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.11.20 నుండి మొదలుకాగా అదే రోజు మధ్యాహ్నం APTF జిల్లా శాఖల నుండి కొన్ని సందేహాలు రాగా రాష్ట్ర నాయకత్వం వెంటనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఆ మేరకు జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) శ్రీ. డి.దేవానంద రెడ్డి గారు కొన్నింటిపై నివృత్తి చేశారు. అవి....
1)APTF: 2018 డీఎస్సీ ద్వారా నియామకం కాబడిన వారికి ట్రెజరీ ఐడి లేనందున వారి స్పోజ్ లకు దరఖాస్తుకు వీలులేకుండా వున్నది.
👉 జే.డి గారు: డైరెక్టరేట్ నుండి DEO ఆఫీసులకు రాండమ్ గా నెంబర్స్ కేటాయించడం జరిగింది. తాత్కాలిక ట్రెజరీ ఐ.డి ని క్రియేట్ చేస్తారు. ఆ సమస్య గల వారు ఆయా DEO కార్యాలయాల్లో సంప్రదించాలి.
2)APTF:కనీస అర్హత రెండేళ్ల సర్వీస్ లేకపోయినా ఆన్లైన్ దరఖాస్తు సబ్మిట్ కాబడుతుంది.
👉 జే.డి గారు: అటువంటి దరఖాస్తుకు అవకాశం లేకుండా సరిచేశాము. ఐతే రి అప్పోర్షన్ (రేషనలైజేషన్) కు గురైన మిగులు టీచర్స్ అయా పాఠశాలల్లో రెండు సం.ల లోపు వున్నను వారి దరఖాస్తు సబ్మిట్ కు అవకాశం కల్పించబడింది.
3) APTF:i) గత సం.లలో కేటగిరి 1V, III లలో మార్పులు,
ii) రేషనలైజేషన్ లో మిగులుగా తేలిన వారికి జి. వో ప్రకారం పూర్వపు పాయింట్స్ కేటాయింపు ,
iii) DEO పూల్ లో వుండే టీచర్ల సర్దుబాటు మరియు
iv) ట్రాన్స్ఫర్ మెసేజ్ రానివారికి తగు పరిష్కారాలపై కోరగా....
👉 జే.డి గారు: పై నాలుగు అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని అందరూ DEO లకు మార్పులు - చేర్పులు - సర్దుబాటు - దోషాలను సరిచేయుటకు తగు అధికారం (సౌకర్యం ) కల్పించామన్నారు. ఈలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే వారు ఆయా జిల్లాల్లో DEO ఆఫీస్ ట్రాన్స్ఫర్ సెల్ సిబ్బందిని సంప్రదించాలని స్పష్టం చేశారు.
4) APTF: దరఖాస్తులో Widow కాలమును చేర్చాలి.
👉 జే.డి గారు: ప్రిఫరెన్సియల్ కేటగిరీలో Widow కాలమ్ ను చేర్చడం జరిగింది. అప్లికేషన్ లో అవసరం లేదని తెల్పారు.
ఇట్లు:
అధ్యక్షుడు: జి.హృదయ రాజు & ప్రధాన కార్యదర్శి: కె.వెంకటేశ్వర రావు, APTF