టీచర్లు, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు సబంధించి ఆన్ లైన్ దరఖాస్తు వెబ్ సైట్ లో పొందుపరిచారని, అన్ని ఖాళీలుచూపకుండా బ్లాక్ చేయడం వల్ల టీచర్లు తీవ్ర నిరాశ చెందుతున్నారని ఏపీటీఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావు లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి హామీ ఇచ్చిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొనకపోవడం భాదకరం అన్నారు. ప్రస్తుత బదిలీల్లో అన్ని కేడర్లలో అన్ని ఖాళీలను చూపాలని, యస్.జి టీచర్లకు మ్యానువల్ విధానం ద్వారా కౌన్సిలింగ్ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరిన వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాంగ్ స్టాండింగ్ దాటిన వారికి ప్రస్తుత స్టేషన్ అన్ని పాయింట్స్ ఇవ్వాలని, రీప్పోర్షన్ లో కట్ ఆఫ్ డేట్ ఏది రోల్ ఎక్కువ వుంటే దాన్ని పరిగణించాలని, సంఘాలకు హామీ ఇచ్చిన వాటన్నిటినీ అమలు చేయాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు