APTF:1938 INFO
ముఖ్యమంత్రి ఆఫీస్ (CMO) ముఖ్య కార్యదర్శి శ్రీ.ప్రవీణ్ ప్రకాష్ ఐఏయస్ గారిని ఏపి జెఏసి ఛైర్మన్:యన్.చంద్రశేఖర్ రెడ్డి, కో- ఛైర్మన్: జి. హృదయ రాజు, డిప్యూటీ సెక్రెటరీ జనరల్: బండి శ్రీనివాసులు గార్లు కలసి ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
- ఉద్యోగుల 2నెలల డెఫర్ సాలరీస్, పెన్షనర్ల 1 నెల పెన్షన్ లను వెంటనే మంజూరు చేయాలని
- ఫ్రీజింగ్ చేసి జారీ చేసిన డి.ఏ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని & 2018 - 2019 లకు జారీ చేసిన డి.ఏ భవిష్యత్ లో చెల్లించే బకాయి ఉత్తర్వు రద్దు చేసి వెంటనే చెల్లించాలని
- 11వ పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని తదితర అంశాలపై చర్చించగా సి.యం గారి దృష్టికి తీసుకెళ్తామని తెల్పారు.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎపిటీఎఫ్