FAFTO తో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు విజయవంతం 21/11/2020 డిఇవో కార్యాలయాల పికెటింగ్ విరమణ
పాఠశాల విద్యాశాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ గారితో ఫ్యాప్టో నాయకత్వం రోజులు పాటు నడిపించిన నాయకత్వం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి . చర్చల్లో పాఠశాల కమీషనర్ వి . చిన వీరభద్రుడు , జాయింట్ డైరెక్టర్ డి దేవానంద రెడ్డి గారలు పాల్గొన్నారు .
- SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ విషయంలో కొత్త సాఫ్ట్వేర్ పై డెమో అనంతరం అది ఫలప్రదం కాకపోతే మాన్యువల్ కౌన్సెలింగ్ చేస్తామన్నారు .
- స్టేషన్ పాయింట్లపై ఉన్న సీలింగ్ 11 ఏళ్ళవరకూ పెంచడానికి అంగీకరించారు .
- సర్వీసు పాయింట్లు 31 ఏళ్ళకు ఇస్తారు . అంటే 15.5
- చైల్డ్ ఇన్ఫో లో మీడియం మారిన విషయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకించి అప్పీలు ఇస్తే పరిష్కరిస్తారు .
- ఖాళీలను బ్లాక్ చేసే విషయం లో ప్రతి మండలాన్ని రివ్యూచేసి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగని విధంగా చూస్తాము .
- ప్రధానోపాధ్యాయులకు అకడమిక్ ఇయర్స్ కు బదులుగా 5 పూర్తి సంవత్సరాలకు అంగీకరించారు .
- పదవీ విరమణ కు 3 ఏళ్ళ లోపు సర్వీసు ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు కొరకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు .
 |
విద్యాశాఖ మంత్రి గారితో జరిగిన FAPTO చర్చల్లో మాట్లాడుతున్న APTF రాష్ట్ర అధ్యక్షులు & FAPTO రా.కా.వ సభ్యులు జి.హృదయరాజు
|