ఫ్యాప్టోగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు వెబ్ పద్ధతిలో కౌన్సెలింగ్ లో పాల్గొంటే తీవ్రంగా నష్టపోతారని కనీసం SGT ల కైనా మాన్యువల్ కౌన్సెలింగ్ జరపమని కోరుతూ వచ్చాము . అక్టోబర్ 27 న తమతో సమావేశం అయినప్పుడు , మరియూ నవంబర్ 18 న మంత్రిగారి సమక్షంలో ఫ్యాప్టోతో చర్చలు జరిపిన సందర్భంలో కూడా డెమో చూసిన తర్వాత సంతృప్తి చెందక పోతే మాన్యవల్ కౌన్సెలింగ్ జరుపుతామన్నారు . డెమో కు ఆహ్వానిస్తామన్నారు . ఇప్పుడు ఆకస్మికంగా వెబ్ కౌన్సెలింగ్ డెమో వెబ్ ద్వారానే చూపాలనుకోవడం సరైంది కాదు . ప్రత్యక్ష పద్ధతిలోనే డెమో చూపి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో ) డిమాండ్ చేసింది