ఏపిటిఎఫ్ 1938 జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కీర్తిశేషులు జి బ్రహ్మానంద రాజుగారి దంపతులకు సంతాప సభ:
గుంటూరు జిల్లా వినుకొండ నగరంలో లో హనుమాన్ నగర్ నందు LFMHM గా పని చేయుచున్న బ్రహ్మానంద రాజుగారు మరియు వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలోLFMHM గా పనిచేయుచున్న జి దుర్గా రాణి గార్లు నాడు -నేడు కార్యక్రమం లో అవిశ్రాంతం గా పని చేయుచూ అసువులు బాసిన ఏపీటీఎఫ్ 1938 సీనియర్ నాయకులు సంతాప సభ ఏపిటిఎఫ్ 1938 జిల్లా కార్యాలయంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎం .దేవదానం బాబు గారు అధ్యక్షతన 29/11/20 ఉదయం 11 గంటలకు జరిగినది. ఈ కార్యక్రమమును జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కె నరసింహారావు ప్రారంభ ఉపన్యాసంలో బ్రహ్మానంద రాజుగారు జిల్లా ఏపీటీఎఫ్ కార్యవర్గంలో గతంలో అదనపు కార్యదర్శి గాను, ప్రస్తుతం అసోసియేట్ అధ్యక్షులు గాను పనిచేస్తూ హాస్పటల్లో చేరిన తర్వాత కూడాను ఏపిటిఎఫ్ వినుకొండ వాట్సాప్ గ్రూపు లో ఈ మెసేజ్ లు పెడుతూ తన తుది శ్వాస వరకు ఫెడరేషన్ కోసం పనిచేశారని ఒక నిబద్ధత గల సీనియర్ కార్యకర్తలను కోల్పోవడం ఏ పి టిఎఫ్ కు తీరని లోటని తెలిపారు. ముఖ్యఅతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జె.విజయానంద్ గారు మాట్లాడుతూ బ్రహ్మానంద రాజు దంపతులు ఏపిటిఎఫ్ నకు చేసిన సేవలను కొనియాడారు. వారి కుమారుడు శ్రీ వేణుగోపాల రావు గారికి సత్వరమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మరియు కోవిట్ కారణంగా చనిపోయిన నేపథ్యంలో వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ ఎమ్. వి ప్రసాద్ గారు మాట్లాడుతూ బ్రహ్మానంద రాజుగారు శావల్యాపురం ,వినుకొండ, బొల్లాపల్లి మండలాల్లో ఏపిటిఎఫ్ 1938 వ్యాప్తికి ఉద్యోగంలో చేరిన నాటి (1989 )నుండి పనిచేశారని భార్యాభర్తలు ఇరువురూ ఫెడరేషన్ కొరకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారని తెలియజేశారు.ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు P. రమేష్ కుమార్ జిల్లా అదనపు కార్యదర్శి M.సాయన్న గుంటూరు నగర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు శ్రీ D.సురేష్ , A.జోజప్ప గార్లు పాల్గొని సంతాపం తెలియజేశారు
