ఒకటి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను ఒకరోజు పాఠశాలలకు పిలిచి ఆయా క్లాస్ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి.
❖ ప్రస్తుత కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ పనిని పూర్తి చేయాలి.
⊹ సూచనలు:
↦ మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్ చేసిపెట్టుకోవాలి
↦ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి.
↦పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.
↦ ఒక తరగతి పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.
↦ వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.
↦ పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్ లో ఇచ్చిన లింక్ లో...
☛
https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES
ఖచ్చితంగా నమోదు చేయాలి.