ప్రచురణ/ ప్రసార నిమిత్తం
తేది:21.2.21, కర్నూలు
*11వ పి.ఆర్.సి ని అమలు చేయాలి: జి.హృదయ రాజు,రాష్ట్ర అధ్యక్షులు, APTF*
11వ PRC లో జాప్యాన్ని నివారించి వెంటనే అమలు చేయాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా APTF కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు బి.మాధవ స్వామి అధ్యక్షతన గాంధీనగర్ APTF జిల్లా కార్యాలయంలో జరిగింది.
దశాబ్ద కాలం తర్వాత ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారి ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వ సంఘాల సమావేశంలో డిమాండ్ చేసిన సమస్యలను హృదయ రాజు వివరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సి పి ఎస్ విధానాన్ని రద్దు చేయాలని,
PRC నివేదికను బహిర్గతం చేసి 55 శాతం ఫిట్మెంట్ తో అమలు చేయాలని, ఫ్రీజ్ చేసిన డి. ఏ లను మంజూరు చేయాలని కోరినట్లు తెల్పారు. బదిలీల్లో విద్యాశాఖ అధికారులు అనుసరించిన విధానాలతో టీచర్స్ ఇబ్బంది పడ్డారని, ఇప్పటి వరకూ జీతాలు రాలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సర్వీస్ రూల్స్ రూపొందించి అన్ని కెడర్ల పదోన్నతులు ఇవ్వాలని, జె. యల్ పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెల్పారు. సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి , ధనుంజయ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ లు త్వరలోనే PRC నివేదిక బహిర్గతం చేస్తామని ఆర్థికపరమైన అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని తెల్పారు. ఏప్రిల్ లో సంఘాలతో ప్రత్యేక సమావేశం పెట్టి సమస్యలు పరిష్కరిస్తామని తెల్పరన్నారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.కమలాకర రావు, యస్.ఇస్మాయిల్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఉద్యోగ సిబ్బందికి కనీస బస్ సౌకర్యాలు లేవని, కేడర్ ను బట్టి స్టేజ్ 1, స్టేజ్:2 పి. వో, ఓ పి ఓ డ్యూటీ లు లేవని, అనవసరంగా 100 కి.మీ దూరంలో డ్యూటీ లు వేశారని, రెమ్యునరేషన్ లు ఒక్కో చోట ఒక రకంగా చెల్లించారని ఈ విధానం MPTC/ ZPTC, మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా అధికార్లు చూడాలని తెల్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సభ్యులు టి.వి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ శేషాచలం ,రాష్ట్ర కౌన్సిలర్ హబిబుల్ల జిల్లా, మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
- జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, APTF