రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు పని కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వారి సేవలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆ మేరకు వేతనాలను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో పది రోజులు మినహా మిగిలిన 12 నెలల కాలాన్ని పని దినాలుగానే పరిగణించిందని పేర్కొన్నారు