ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు సిపిఎస్ విధానం రద్దు చేయలేదని, ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ విధానం రద్దు చేయాలని ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మాధవ స్వామి ఎస్.ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏర్పడక ముందు వై యస్ జగన్ మోహన్ రెడ్డి తన సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానని,రెండు సంవత్సరాలైనా ఇంతవరకు సిపియస్ విధానం రద్దు చేయలేదని అన్నారు. వెంటనే సిపియస్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి ఉపాధ్యాయులందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను వారి పిల్లలను ఆదుకోవాలని కోరారు.
ఇట్లు బి .మాధవ స్వామి,
జిల్లా అధ్యక్షులు, ఏపిటిఎఫ్