మిత్రులారా!
ఈరోజు సాయంత్రం
విద్యా శాఖాశాఖ మంత్రి , ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ పాఠశాల విద్య వారితో వర్చువల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలోఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు హృదయ రాజు గారు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ క్రింది సమస్యలను ఫెడరేషన్ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
కరోనా వల్ల మరణించిన ప్రతి టీచర్ కు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పెన్షన్ బెనిఫిట్స్ సత్వరం క్లియర్ చేయాలని కోరడం జరిగింది. అలాగే టీచర్స్ ను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి రెండు డోసులు ప్రత్యేక క్యాంపు ద్వారా ఇవ్వాలని కోరడం జరిగింది ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ పరీక్షలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహించడం సాధ్యం కాదు కావున రద్దు చేయాలని కోరడం జరిగింది. పాఠశాల పునః ప్రారంభం కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ప్రారంభించాలని కోరడం జరిగింది. నాడు నేడు పాఠశాలల పనుల బాధ్యత ప్రధానోపాధ్యాయుల నుంచి నుంచి తప్పించాలని కోరడం జరిగింది. అలాగే గతంలో పనిచేసిన వారికి సంపాదిత సెలవులు మంజూరు కోరగా, అప్పటికప్పుడు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కరానా బారిన పడిన వారికి 14 రోజుల స్పెషల్ క్యాజువల్ మంజూరుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. సీబీఎస్ఈ సిలబస్ పైన ఒక అవగాహన సదస్సు నిర్వహించుటకు, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగులో ఉందని అది క్లియర్ చేయుటకు చర్యలు గైకొనాలి అని కోరడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు సి పి ఎస్ కమిటీ సభ్యులు అయినందున సి పి ఎస్ రద్దు చేయుటకు నిర్ణయం చేయాలని కోరడం జరిగింది. అలాగే స్పెషల్ విద్యావాలంటీర్ల సర్వీసును అప్రయత్న పదోన్నతి కి వర్తింపజేయాలని అర్హతలులేని పి ఈ టి లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి పీడీలు గా ప్రమోషన్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరడం జరిగింది. ఇంకను అమ్మ ఒడి అందని 80 వేల మంది పిల్లలకు అమ్మబడి మొత్తం వారి ఖాతాలో జమ చేయుటకు చర్యలు గైకొనాలి అని కోరడం జరిగింది. అంతర్ జిల్లా బదిలీలు మరియు అంతర్ రాష్ట్ర బదిలీలు చేపట్టుటకు షెడ్యూల్ విడుదల చేయాలని కోరడం జరిగింది ఇందుకు స్పందించిన అధికారులు ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షలు మొదటి వాయిదా వేయుట సుముఖత వ్యక్తం చేశారు కరోనా బారిన పడి మరణించిన వారికి వీలైనంత సహాయం చేయుటకు అంగీకరించారు నాడు నేడు పనులలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నందువల్ల నాణ్యతగా ఉన్నాయని అయితే రెండవ దఫా నాడు నేడు లో వారికి చాలా బాధ్యతలు తప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతర్ జిల్లా బదిలీలు పైన బదిలీ అప్లికేషన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. సీబీఎస్ఈ సిలబస్ అవగాహనకు ఒక వర్క్ షాప్ నిర్వహించుటకు అంగీకరించారు. యాప్ ల విషయంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీ అందించి కేవలం 10 నిమిషాలలో ఆ పని పూర్తి అయ్యేటట్లు చూస్తామని ముఖ్య కార్యదర్శి గారు హామీ ఇచ్చారు. మనం ప్రాథమిక పాఠశాలలో బయోమెట్రిక్ హాజరు ఎత్తివేయాలని కోరడం జరిగింది.
జి. హృదయ రాజు , అధ్యక్షులు
కె. వెంకటేశ్వర రావు , ప్రధాన కార్యదర్శి
ఏ. పి.టి.ఎఫ్