2008 డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది.
------------------------
డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఒప్పంద ఉపాధ్యాయులుగా నియామకాలు..
👉2,193మందికి ఎస్జీటీలుగా ఉద్యోగాలు..
👉పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..
🔶️డీఎస్సీ-2008కి చెందిన 2,193మంది అభ్యర్థులను ఒప్పంద ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ప్రక్రియలో చేసిన మార్పుల కారణంగా నష్టపోయిన వీరిని మినిమమ్ టైం స్కేల్‌తో ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తిస్తున్న నిబంధనలే వీరికి వర్తిస్తాయి. 60ఏళ్ల వరకు ఉద్యోగంలో ఉంటారు. అభ్యర్థుల వయసుకు సంబంధించిన ఎలాంటి భద్రత ఉండదు. వచ్చే డీఎస్సీలో పేర్కొనే అకడమిక్, సాంకేతిక అర్హతలకు సంబంధించిన అంశాలను రెండేళ్లల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక విద్యపై ఆరు నెలల బ్రిడ్జి కోర్సును నియామకమైన తరవాత రెండేళ్లల్లో పూర్తి చేయాలి. భవిష్యత్తులో చేపట్టబోయే ఎస్జీటీల నియామకాల్లో ఈ పోస్టుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
👉ఒక్క డీఎస్సీకే అనుమతి..
🔷️అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు డీఎస్సీ- 1998, 2008, 2012 సమస్యలను పరిష్కరించేందుకు 2018లో ఎమ్మెల్సీలతో కమిటీని ఏర్పాటు చేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్సీ-2008లో ఎస్జీటీల ఎంపికలో అమలు చేసిన విధానం కారణంగా నష్టపోయిన వారికి విద్యావాలంటీర్లు, ఒప్పంద, పొరుగు సేవల కింద 60ఏళ్ల వరకు ఉద్యోగం కల్పించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఎంపిక ప్రక్రియలో డీఈడీ, బీఈడీ మార్పుల కారణంగా నష్టపోయిన డీఎస్సీ-2008 అభ్యర్థులకు మాత్రమే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆమోదించింది. పాఠశాల విద్య కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ మినిమమ్ టైం స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించేందుకు అభ్యర్థుల నుంచి అనుమతి తీసుకుందని పేర్కొన్నారు.
---------------------------------
Change of selection లో నష్ఠపోయిన DSC 2008 SGT లకు contract Basis లో ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ G.O No 39 St 21.6.2021 ద్వారా ఆదేశాలు జారీ చేయబడినవి
దీని ప్రకారం
>ఈ 2193 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు నియామకాల నిబంధనలు SGT వేతనం స్కేలు లో మినిమం పే వేతనం గా ఇవ్వబడును
>Without Security గా 60ఏళ్ళ వయస్సు వరకు పని చేయవచ్చును
>రాబోయేDSC కు నిర్ణయించిన అర్హతలు 2 ఏళ్ళలో పొందాలి.
> ఈ 2193 నియామకాల వలన రాబోయే DSC లో ఖాళీలు తగ్గించి నియామకాలు చేపట్టబడును
>ఈ కాంట్రాక్టు టీచర్లు ఇతర కాంట్రాక్టు టీచర్లు వలె వేతన లాభాలకు అర్హులు..రెగ్యులర్ టీచర్ల Benifits కొరకు claim చేయరాదు
>CSE AP వారు తగు తదుపరి చర్యలు చేపపడతారు..