2-07-2021 తేదీ సాయంత్రం ఏ.పీ.టీ.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఏపీ.జేఏసి సెక్రెటరీ జనరల్ జి. హృదయ రాజు గారి ఆకస్మిక పర్యటన లో భాగంగా గిద్దలూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో రాష్ట్ర ఏ. పీ.టి.ఎఫ్ కార్యదర్శి వై. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో హృదయ రాజు గారు పాల్గొని ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానఉపాద్యాయులు యం. సిద్దేశ్వర శర్మ ఏ. పి. టి. ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యస్. హెచ్ కబీర్,ఏ.పి.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, గిద్దలూరు ఏ. పి. టి.ఎఫ్ మండల అధ్యక్షుడు వి.రవి శంకర్,రాచర్ల ఏ. పి. టి.ఎఫ్ నాయకుడు డి.వి.పిచ్చయ్య, కోమరోలు ఏ. పి. టి.ఎఫ్ నాయకుడు యస్.కె.నూర్ అహ్మద్ తది తర స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంలో ఏపి జే. యే. సి.సెక్రెటరీ జనరల్ గా ఎన్నికైన జి. హృదయ రాజు గారిని సన్మానించారు.ఈ సందర్భంలో హృదయ రాజు గారు మాట్లాడుతూ
- 8 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్ల్,కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
- 34 నెలల పి. ఆర్. సి బకాయిలు డి. ఎ లు వెంటనే చెలించాలని డిమాండ్ చేశారు.
- సి.పి. యస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,కోవిడ్ కారణంగా మరణించిన ఉపాధ్యాయ ఉద్యోగులకు 50 లక్షలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
- దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.