*ఘనంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి.సుబ్బారావు గారు మరియు 5 మంది కార్యకర్తల పదవీవిరమణ అభినందన సభ*
నేడు ఒంగోలు లోని ఆర్యవైశ్య భవన్ లో APTF ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయ వృత్తిలో పదవీవిరమణ పొందిన APTF నాయకులు పి.వి.సుబ్బారావు, ఏ.అమ్మయ్య, వి.బాలాజీ రావు, పి రంగారెడ్డి డి.వెంకటేశ్వర్లు గార్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు కె.వి.జి కీర్తి అధ్యక్షత వహించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి సభ ఉద్దేశ్యాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో AIFEA జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు, రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి. సిహెచ్ వి.కుమారి, సీనియర్ నాయకులు వీరభద్రాచారి, వీరయ్య, కందుకూరు Dy EO యస్.సుబ్బారావు, DCEB సెక్రెటరీ వెంకరెడ్డి, BTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకట్ రావు, APUS ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రావణ కుమార్, TNUS ఉపాధ్యక్షులు మన్నం శ్రీనివాస్, FAPTO జిల్లా చైర్మన్, సె.జ, UTF, APTF-257, HTU, Govt ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, PRTU, KVPS, PDSU నాయకులు, APTF రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి, డా. జుల్ఫికర్ ఆలీ, APTF ప్రకాశం జిల్లా, మండల నాయకులు, పదవీవిరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
వక్తలు పి.వి. సుబ్బారావు గారు మరియు పదవీవిరమణ పొందిన నాయకుల సేవల గురించి కొనియాడారు. భవిష్యత్తులో వారి సేవలను సంఘానికి అందించాలని, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రకాశం జిల్లా APTF కార్యకర్తల సమావేశం జరిగింది.