APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF NLR » బీటెక్ విద్యార్థిని తేజస్వినిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి.- ఉపాధ్యాయ ఐక్యవేదిక. సమాజం తలదించుకునేలా విద్యార్థినిల ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమెను హత్య చేసిన ఉన్మాది వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం గూడూరు టవర్ క్లాక్ వద్ద ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. నిందితుడు ముందుగానే నిర్దేశించుకున్న కుట్రలో భాగంగా విద్యార్థిని హత్య చేయడం జరిగిందని, ఇది సమాజానికి చేదు సంకేతాలు పంపుతుందని ఆయన అన్నారు. తాను నిర్దోషిగా బయటపడేందుకు తనకు నచ్చిన రీతిలో కట్టుకథలు అల్లుతూ కేసును తప్పుదారి పట్టిస్తున్నడని అన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి సత్వరం దోషికు శిక్ష విధించాలని ఆయన కోరారు. యుటిఎఫ్ నాయకులు రాదయ్య మాట్లాడుతూ విద్యార్థిని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోయడం దుర్మార్గపు చర్య అన్నారు. పి.డి జమీల మాట్లాడుతూ సమాజంలో ఆడబిడ్డలు కనీసం ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండటం సిగ్గుచేటు అన్నారు ఉపాధ్యాయ సునీత మాట్లాడుతూ కాలేజీ చదువులకు ఆడ పిల్లలు బయటకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నుండి ప్రభుత్వం తన చర్యల ద్వారా విముక్తి కల్పించాలని ఉపాధ్యాయిని సునీత అన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో జరుగుతున్న దుస్సంఘటనలు పరంపర గా కొనసాగడం పట్ల ప్రభుత్వం నిష్కర్షగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. ఉపాధ్యాయులు లీలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తేజస్విని హంతకులకు ఉరిశిక్ష పడేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై. మురళి, శివకుమార్, జైపాల్ రెడ్డి, ఎం రమణయ్య, అనిల్, చంద్రశేఖర్, రమణయ్య, షఫీ ఉల్హక్, టి. నారాయణ పిడి. కరీముల్లా, సి హెచ్ విజయలక్ష్మి, సురేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

బీటెక్ విద్యార్థిని తేజస్వినిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి.- ఉపాధ్యాయ ఐక్యవేదిక. సమాజం తలదించుకునేలా విద్యార్థినిల ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమెను హత్య చేసిన ఉన్మాది వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం గూడూరు టవర్ క్లాక్ వద్ద ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. నిందితుడు ముందుగానే నిర్దేశించుకున్న కుట్రలో భాగంగా విద్యార్థిని హత్య చేయడం జరిగిందని, ఇది సమాజానికి చేదు సంకేతాలు పంపుతుందని ఆయన అన్నారు. తాను నిర్దోషిగా బయటపడేందుకు తనకు నచ్చిన రీతిలో కట్టుకథలు అల్లుతూ కేసును తప్పుదారి పట్టిస్తున్నడని అన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి సత్వరం దోషికు శిక్ష విధించాలని ఆయన కోరారు. యుటిఎఫ్ నాయకులు రాదయ్య మాట్లాడుతూ విద్యార్థిని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోయడం దుర్మార్గపు చర్య అన్నారు. పి.డి జమీల మాట్లాడుతూ సమాజంలో ఆడబిడ్డలు కనీసం ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండటం సిగ్గుచేటు అన్నారు ఉపాధ్యాయ సునీత మాట్లాడుతూ కాలేజీ చదువులకు ఆడ పిల్లలు బయటకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నుండి ప్రభుత్వం తన చర్యల ద్వారా విముక్తి కల్పించాలని ఉపాధ్యాయిని సునీత అన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో జరుగుతున్న దుస్సంఘటనలు పరంపర గా కొనసాగడం పట్ల ప్రభుత్వం నిష్కర్షగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. ఉపాధ్యాయులు లీలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తేజస్విని హంతకులకు ఉరిశిక్ష పడేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై. మురళి, శివకుమార్, జైపాల్ రెడ్డి, ఎం రమణయ్య, అనిల్, చంద్రశేఖర్, రమణయ్య, షఫీ ఉల్హక్, టి. నారాయణ పిడి. కరీముల్లా, సి హెచ్ విజయలక్ష్మి, సురేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Posted by APTF 1938
» APTF NLR
» Monday, 5 July 2021

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |