ఇంటర్ అడ్మిషన్లు
★ ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 13వ తేదీ శుక్రవారం నుంచి మొదలుకానుంది.
★ విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి గతంలో మాదిరిగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. కళాశాలల్లో నచ్చిన వాటిని విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకుని చేరాలి.
★ ముందస్తుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పాటుచేసిన యాప్‌లోకి పదో తరగతి విద్యార్థి హాల్ టికెట్ ద్వారా దరఖాస్తు ప్రారంభించుకోవాలి.
★ విద్యార్థికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. దీనిలోనే జిల్లాలోని కళాశాలల వివరాలు ఉంటాయి.
★ విద్యార్థి నచ్చిన కళాశాల ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్‌లైన్ ప్రోసెస్ ఎలా ఉంటుందో దాదాపు ఆ విధంగానే విద్యార్థి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి రావాల్సి ఉంది.
★ జీపీఏ పాయింట్లు సాధించిన వారికి ఆన్‌లైన్ కళాశాల చేరికలో ముందస్తు ప్రాధాన్యత ఉంటుందా, దీంతోపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏ కళాశాల ఎంత ఫీజు చెల్లించాలన్నది తెలియజేయాలి.
★ అది ఆన్‌లైన్‌లో పొందుపరచడం, గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది ఇంకా ఆన్‌లైన్ ప్రారంభమైనప్పుడు పరిశీలిస్తే గాని తెలియదు.