ఉపాధ్యాయ , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఫిర్యాదులు , ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో పాఠశాల విద్య డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు దిగొచ్చారు . సమస్యలపై పోరాడేం దుకు ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లినా కుదరదని , సీఎల్ పై వెళ్లినా ధర్నాలకు హాజరైతే మాత్రం సెలవు మంజూరు చేయమని , జీతం కోసేస్తామని ఆయన కొద్ది నెలల క్రితం ఉత్తర్వులిచ్చారు . దీనిపై తీవ్ర నిర సన వ్యక్తమైంది . ఎమ్మెల్సీలతో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇటీవల భేటీ అయినప్పుడు వారంతా చినవీర భద్రుడిపై ఫిర్యాదు చేశారు . సమస్యలపై పోరాడు తున్న సంఘాల గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు . దీంతో సెలవు పెట్టి ధర్నాలు , ఆందోళ నలకు హాజరైతే జీతం కోసేస్తామంటూ ఇచ్చిన ' నో వర్క్ .. నో పే ' ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ గురువారం ఆదేశాలు జారీ చేశారు