గురజాడ అప్పా రావు, గుర్రం జాషువా జయంతిలను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని గురుకులాల విద్యార్థులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న గురజాడ జయంతి కాగా, 28 జాషువా జయంతి నిర్వహిస్తున్నారు. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ఆస్ఈఐఎస్), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్), ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా లయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్ఐ ఎస్) సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. గురజాడ, జాషు వాకు సంబంధించిన అంశాలపై ఈ నెల 27వ తేదీన పద్య పోటీలు, వక్తృత్వం, వ్యాస రచన పోటీలను నిర్వహించి, 28వ తేదీన బహుమతు లు అందజేస్తారు.