సందేహాలు - సమాధానాలు
1. ప్రశ్న:
భార్య & భర్త ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి, వారిలో భర్త మరణిస్తే, అవివాహితుడు అయిన వారి సోదరుడికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వుటకు వీలుపడుతుందా?
జవాబు:
రూల్స్ ప్రకారం అలా వీలు లేదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఏ విధమైన ఆదాయ వనరులు లేనప్పుడు మాత్రమే కారుణ్య నియామకం వీలుంటుంది.
2. ప్రశ్న:
విధులకు ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా? తెలుపగలరు.
జవాబు:
ఏ ఉపాధ్యాయుడి పైన ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా విధులకు ఆటంకం కలిగించినా దాడి చేసినా IPC186.189,353 ప్రకారం 2yr జైలు శిక్ష ఉంటుంది.
3. ప్రశ్న:
మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా? మూడవ కూతురికి వివాహం కాలేదు. How to process
జవాబు:
(1) ముందుగా మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలి. (2) ఆ మెడికల్ ఇన్‌వాలిడేషన్ తో కారుణ్య నియామకానికి ధరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటిది సాధించవచ్చు కాని రెండవ దానికి గ్యారంటీ లేదు.
ప్రశ్న:
ఒక టీచర్ 22 రోజులు మెడికల్ లీవ్ లో ఉన్నాడు
23 rd day జనరల్ హాలిడే
24 th day సెకండ్ satur day
25 th day sunday
ఈ సందర్భంగా 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా?
23 రోజులకు తీసుకు రావాలా ?
Prefix ,suffix మెడికల్ లీవ్ లకు వర్తిస్తాయా?
GO లు తెలుపగలరు
జవాబు:
ఈ కేసులో Fitness ఎప్పుడు పొందేరో ఇంపార్టెంట్.
(1) *22 రోజులకు Fitness Certificate ఇస్తే, 22-రోజులకు లీవ్ మరియు 3-రోజులకు suffix చేసుకోవచ్చు. 22-రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.
(2) *25 రోజులకు Fitness Certificate ఇస్తే, suffix ఉండదు. 25 రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.
FR 68; FR 71 మరియు AP Leave Rules ను చూడండి.