రవి టీచర్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి: ఏపిటీఎఫ్
- గుంటూరు APTF బృందం పాఠశాల సందర్శన
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెలనాటి రవిబాబు (58సం.లు) ఉపాధ్యాయున్ని నిన్న అత్యంత అనాగరికంగా, సభ్యసమాజం సిగ్గుపడేలా విద్యార్థిని బంధువులు, గ్రామస్థులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి తెల్పారు. 7వ తరగతి విద్యార్థిని హిందీ హోమ్ వర్క్ బాగా చేశావని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తే,అది అమానుష చర్య అన్నట్లు తరగతి గదిలో బోధన చేస్తున్న సమయంలో దాడి చేయడం, అడ్డుకున్న ఇద్దరు మహిళా టీచర్లు, మరో ఇద్దరు మగ టీచర్ల పై దాడి చేయడం హేయమైన చర్య. దాడికి పాల్పడి మరియు ప్రేరేపించిన వారినందరిని తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని, పాఠశాలలోని టీచర్లందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించాలని APTF కోరింది.
రాష్ట్రంలో టీచర్లపై దాడి చేస్తే శిక్షించుటకు ప్రత్యేకమైన చట్టం రూపొందించాలని APTF డిమాండ్ చేసింది. టీచర్ రవి మరియు సిబ్బందికి APTF అండగా ఉంటుందని గుంటూరు జిల్లా APTF జిల్లా ప్రధాన కార్యదర్శి & జిల్లా ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ కె.నరసింహరావు, సహద్యక్ష్యులు పుల్లట రమేష్ బృందం ప్రత్యక్షంగా పాఠశాలకు వెళ్లి కలవడం జరిగింది.
- జి.హృదయ రాజు & కె.కులశేఖర రెడ్డి: రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు: APTF
వట్జిచెరుకూరులో ..... నిన్నటి సంఘటన పై వివరాలను సేకరిస్తున్నారు నరసింహ రావు, రమేష్, APTF