నేడు DTA (డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ & అకౌంట్స్) యన్.మోహన్ రావు గారిని కలిసి CPS ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్, PRC / DA బకాయిల 90% క్యాష్ చెల్లింపు,ప్రభుత్వ పెన్షనర్ మరణానంతరం డైవర్సడ్ / వితంతువులకు... ఇచ్చే పెన్షన్ పునరుద్దరణ, DA మంజూరు జి. వో ల అమలు, CFMS తదితర సమస్యలపై చర్చించడం జరిగింది. ఇప్పటికే CPS ఉద్యోగుల పాక్షిక ఉపసంహరణ పై ఉత్తర్వు జారీ చేసినట్లు మిగతా వాటిపై కూడా త్వరలో ఉత్తర్వు ఇస్తామని డైరెక్టర్ తెల్పారు. 152 జి.ఓ పై కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెల్పారు. DA ల జి. వో ల అమలుపై ఆర్థిక శాఖ ఆమోదం తెల్పాల్సివుందని తెలియజేశారు. - అధ్యక్షులు: జి.హృదయ రాజు & ప్రధాన కార్యదర్శి: కె.కులశేఖర రెడ్డి, APTF