ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల్లారా.....!
నమస్కారం
ప్రభుత్వాలు, పాలకులు సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగ పునాదులను కదిలిస్తున్నారు. పేద, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల పిల్లలు చదివే పాఠశాల లను నిర్వీర్యం చేస్తున్నారు. ఒకవైపు జనాకర్షక పధకా లను ప్రవేశపెడుతూ రెండో వైపున పనిచేసే ఉపాధ్యాయు లను చదువు చెప్పనివ్వకుండా వారి బాధ్యతలను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే వారు సహజ వాతావరణంలో చదువు చెప్పలేని పరిస్థితులను సృష్టిస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బదీస్తున్నారు. సకాలంలో ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు కాలదోషం పట్టించి ఆయా ఉపాధ్యాయ కుటుంబాల ఆర్ధిక స్వేచ్ఛను చిదిమేస్తున్నారు. కల్లబొల్లి మాటలతో, హామీలతో ఉపాధ్యాయుల ఆలోచనలను వక్రీకరిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారంటూ ప్రకటనలు గుప్పిస్తూ ప్రజల్లో వితండవాదన లకు ఆజ్యం పోస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయో గించే పేరుతో ఉపాధ్యాయులను నిత్యం *యాప్* లతో కుస్తే పట్టేలా చేస్తూన్నారు. ఒకవైపు కరోనాతో గత రెండేళ్లుగా బోధన కుంటుపడగా, పిల్లలను దారికి తెచ్చుకునేందుకు ఉపాధ్యాయులు మానసికంగా సన్నద్ధమౌతున్నవేళ ప్రభుత్వ చర్యలు నిరుత్సాహ పరుస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలపై ఉక్కుపాదం మోపుతూ, అధికారుల స్థాయిలో జరిగే చర్చలను అగౌరపరుస్తూ, నిర్ణయాలను తృణీకరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను మంట గలుపుతూ, శుష్కవాగ్దానాలతో కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి మన శక్తిని, పోరాటరూపాన్ని చూపించా ల్సిన అదును వచ్చింది. పోరాట కార్యక్రమాలకు రాకుండా, ఉద్యమాల్లో పాల్గొనకుండా ఏ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కరించబడలేదనే సత్యాన్ని గుర్తించండి. ఎన్నో పోరాటాల సాధించుకున్న ఎన్నో ప్రయోజనాలు మటుమాయమయ్యాయనే వాస్తవాన్నీ, రావలసినవి నిలిచిపోయాయని గుర్తించండి.
నవంబర్ 3 వ తేదీన DEO office వద్ద APTF ధర్నా కు హాజరుకావాలని పిలుపునిస్తున్నాం.
-ఏపీటీఎఫ్ 1938, నెల్లూరు జిల్లా శాఖ