APTF:1938 KNL INFO:
13.10.2021 న APTF జిల్లా గౌరవఅధ్యక్షులు ఏ.కమలాకర రావు అద్వర్యంలో పాఠశాల సహాయకుల సీనియారిటీ ని ప్రమోషన్ పోస్ట్ లో చేరిన తేదీ కాకుండా ప్రమోషన్ తీసుకున్న తేది పరిగణనలోకి తీసుకోవాలని ఏ.పి.టి.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు ప్రాతినిధ్యం చేయడం వల్ల పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ప్రొసీడింగ్ నంబర్ 13/37/2021 ఈ.స్.టి.-3; తేదీ 01/10/2021 ద్వారా పాఠశాల సహాయకుల సీనియారిటీని ప్రమోషన్ పోస్ట్ లో చేరిన తేదీ కాకుండా ప్రమోషన్ తీసుకున్న తేది పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వులను అనుసరించి జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రొసీడింగ్ ఇవ్వవలసినది కోరడం జరిగినది. జిల్లా విద్యాశాఖ అధికారిగారు ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ పెద్దస్వామి, జిల్లా కౌన్సిలర్ సూరిబాబు , అలీ తదితరులు పాల్గొన్నారు.
ఆ మేరకు DEO గారు కమ్యునికేషన్ ఉత్తర్వు జారీ చేయడం జరిగింది.
- జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: బి.మాధవ స్వామి, యస్.ఇస్మాయిల్, APTF