ఎయిడెడ్ పాఠశాలలకు నిర్వహణ గ్రాంటు చెల్లించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం కచ్చితమైన ప్రమాణాలు పాటించని బడుల నివేదికను పంపాలని డీఈవోలను ఆదేశించింది. ప్రతి ఏడాది ఆదాయ, వ్యయాలకు సంబంధించిన నివేదికను సెప్టెంబరు 30లోపు సమ ర్పించాలంది. నిబంధనలు పాటిస్తున్నాయో లేదో పేర్కొంటూ పాఠశాలల వివరాలను పంపించాలంది. గత మూడేళ్ల విద్యార్థుల సంఖ్య, ఆన్లైన్లో హాజరు, ప్రతి తరగతికి ఉన్న గదులు, తాగునీటి సదుపాయం, ఆట స్థలం, ప్రహరీ లాంటి వివరాలను పంపించాలని డీఈవోలను ఆదేశించింది