జనవరి 23 న ఎన్టీఎస్ఈ పరీక్ష..
జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ( ఎన్ టీఎస్ఈ ) 2022 జనవరి 23 న నిర్వహిస్తున్నారు
పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
గుర్తింపు పొందిన విద్యాసంస్థలు , కేంద్రియ విద్యాలయాలు , సీబీఎస్ఈ , ఐసీఎస్ ఈల నుంచి గుర్తింపు పొందిన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షకు అర్హులు
18 సంవత్సరాల్లోపు వయస్సు కలిగి దూర విద్య ద్వారా మొదటిసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు
జాతీయ ప్రతి భాన్వేషణ ఉదయం 9.30 నుంచి 11.30 గం టల వరకు పేపర్ -1 , మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది
ఈ పరీక్ష రాయదలచిన ప్రతి విద్యార్థి రూ .200 రుసుమును ఎన్టీఎస్ఈ పేమెంట్ ట్యాబ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 చివరి తేదీ, పరీక్ష రుసుమును డిసెంబర్ 1 వ తేదీలోపు చెల్లించాలి
దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు..
పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైట్ www.bseap.org లో కాని , సంబంధిత ఉప విద్యాశాఖ అధికారి కార్యా లయంలో సంప్రదించాలి