ఎయిడెడ్ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ
మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ
ఎయిడెడ్ సంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనలతో మెమో జారీ
2,249 ఎయిడెడ్ సంస్థల్లో 68.78 శాతం సంస్థలు విలీనానికి అంగీకారం: ప్రభుత్వం
702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని వెల్లడి
విలీనానికి ఒప్పుకోని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్న విద్యాశాఖ
విలీనానికి 4 ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉందని మెమోలో వెల్లడి
ఆప్షన్-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వం లో విలీనానికి సుముఖత.
ఆప్షన్-2: ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు గా కొనసాగే అవకాశం.
ఆప్షన్-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.
ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.
ఈ ఆప్షన్‌లను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ