ఫార్మెటివ్-2 పరీక్షలకు రెసిడెన్షియల్, పురపాలక, ఆదర్శ, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షలను ఈ ఏడాది నుంచే అన్ని పాఠశాలలకు కామన్ పరీక్షలుగా చేశారు. జిల్లా పరీక్షల విభాగాల నుంచి ప్రశ్నపత్రాలను ముద్రించి, సరఫరా చేసేందుకు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్తు, ఎయిడెడ్ మినహా మిగతా వారు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 6-8 తరగతుల విద్యార్థులు రూ.110, 9, 10 తరగతులకు రూ.140 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి. గ్రామీణ ప్రైవేటు పాఠశాలలు 1-5 తరగతులకు రూ.70, పురపాలక పరిధిలో ఉండేవి రూ.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.