APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori NEWS
Showing posts with label NEWS. Show all posts
Showing posts with label NEWS. Show all posts
ఫార్మెటివ్‌   పరీక్షలకు ఫీజు

ఫార్మెటివ్‌ పరీక్షలకు ఫీజు

Mohan
APTF Updated at: December 05, 2021

ఫార్మెటివ్‌-2 పరీక్షలకు రెసిడెన్షియల్‌, పురపాలక, ఆదర్శ, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షలను ఈ ఏడాది నుంచే అన్ని పాఠశాలలకు కామన్‌ పరీక్షలుగా చేశారు. జిల్లా పరీక్షల విభాగాల నుంచి ప్రశ్నపత్రాలను ముద్రించి, సరఫరా చేసేందుకు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్తు, ఎయిడెడ్‌ మినహా మిగతా వారు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 6-8 తరగతుల విద్యార్థులు రూ.110, 9, 10 తరగతులకు రూ.140 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి. గ్రామీణ ప్రైవేటు పాఠశాలలు 1-5 తరగతులకు రూ.70, పురపాలక పరిధిలో ఉండేవి రూ.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

CC విద్యార్థులకు వేరుగా పరీక్షలు..  కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ సూచన..

CC విద్యార్థులకు వేరుగా పరీక్షలు.. కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ సూచన..

Mohan
APTF Updated at: December 02, 2021

 ఎన్ సీసీ క్యాడెట్లకు సెమిస్టర్ పరీక్షలను ప్రత్యేక తేదీల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు సూచనలు జారీ చేసింది.


🔶️ప్రత్యేక పరీక్షలకు వచ్చే వారిని మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులుగా పరిగణించరాదని తెలిపింది.


🔷️'ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో రిపబ్లిక్ డే -క్యాంప్ కోసం ప్రిపరేషన్/ ట్రైనింగ్ క్యాంపుల్లో క్యాడెట్లు పాల్గొంటున్నారని.. ఫలితంగా వారు సెమిస్టర్ తరగతులకు హాజరు కావడంలో, పరీక్షలు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ సీసీ విభాగం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో సంస్థ ఈ సూచనలు జారీచేసింది.


🔶️వారికి ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక తేదీల్లో పరీక్షలకు వీలుగా షెడ్యూల్ను రూపాందించుకోవాలని యూజీసీ బుధవారం. జారీచేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది

విద్యారంగానికి బ్యాంకు   రుణం :: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం

విద్యారంగానికి బ్యాంకు రుణం :: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం

Mohan
APTF Updated at: November 24, 2021

  •  విద్యారంగానికి బ్యాంకు   రుణం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం
  • సాల్ట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం


🌻  ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల అభ్యసన నాణ్యతకు ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్ మధ్య రుణ ఒప్పందం జరిగింది. 50 లక్షల మందికి పైగా విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో రూ.1,861.20 కోట్ల (250 మిలియన్ డాలర్ల) విలువ చేసే ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ప్రపంచ బ్యాంక్ తరపున ఇండియా కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ సంతకం చేశారు. పాఠశాల విద్య అన్ని తరగతుల విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ నుండి ప్రయోజనం పొందుతారని పేర్కొంది.


🌻"అంగన్వాడీ కార్యకర్తలు, గ్రేడ్ 1, 2 ఉపాధ్యాయులకు స్వల్పకాల సేవలో శిక్షణా కోర్సుల ద్వారా ఫౌండేషన్ అభ్యాసనపై దష్టి కేంద్రీకరించడం, ఈ కేంద్రాలు, పాఠశాలల్లో బోధనాపరంగా తగిన బోధనా అభ్యాస సామగ్రి (టిఎల్ఎం) సరఫరా చేయడం చేస్తుంది. ఫౌండేషనల్ లెర్నింగ్పై ఇటువంటి శ్రద్ధ భవిష్యత లేబర్ మార్కెట్లకు అవసరమైన జ్ఞానం, సామాజిక ప్రవర్తన, భా నైపుణ్యాలతో పిల్లలను తయారు చేయడంలో పాఠశాల సంసిద్ధతను మెరుగుపరుస్తుంది." అని తెలిపింది.


జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Mohan
APTF Updated at: June 24, 2021

 దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 


12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందువల్ల బోర్టులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలని కోర్టు స్పష్టం చేసింది. 


అంతకుముందు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బోర్డులు కోర్టుకు తమ మూల్యాంక విధానాన్ని తెలియజేశాయి. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించాయి

పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు.. జూన్ 30, 2021 వరకు చాన్స్..

Mohan
APTF Updated at: April 01, 2021

 


కోవిడ్ వల్ల  జనగణన-2021 వాయిదా

కోవిడ్ వల్ల జనగణన-2021 వాయిదా

Mohan
APTF Updated at: March 28, 2021

  కోవిడ్-19 వల్ల జనగణన-2021 సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రాలవారీగా జనగణన 2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్ జనరల్ కార్యా లయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుం దని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయిం చలేదని వివరించింది జనగణన-2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెం బర్ 31 వరకు ఉన్న మ్యాపింగ్ ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్-19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీ ని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్ సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపింది

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |