ఆంధ్రప్రదేశ్ చట్టములు , అధ్యాదేశములు మరియు వినియమములు మొదలగునవి . 2022 జనవరి , 30 వ తేదీన గవర్నరు జారీ చేసిన ఈ క్రింది అధ్యాదేశపు ఇంగ్లీషు భాషలోని అధికార పాఠమును భారత సంవిధానము యొక్క 348 ( 3 ) అనుచ్ఛేదము క్రింద అందరి ఎరుక నిమిత్తము ప్రచురించబడుచున్నది .
2022 లోని 1 వ ఆంధ్రప్రదేశ్ అధ్యాదేశము భారత ప్రజారాజ్యపు డెబ్భై మూడవ సంవత్సరములో గవర్నరుచే జారీ చేయబడినది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) చట్టము , 1984 ను ఇంకనూ సవరించుటకైన అధ్యాదేశము . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) చట్టము , 1984 ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 55 సంవత్సరములుగా విహితపరచినందుననూ మరియు ఆఖరు గ్రేడు సర్వీసు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరములుగా నిర్ణయించినందుననూ ; మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) ( సవరణ ) చట్టము , 2014 ( 2014 లోని 4 వ చట్టము ) ద్వారా 02-06-2014 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మొదలగు వారికి పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరములు నుండి 60 సంవత్సరములకు పెంచుతూ 2014 వ సంవత్సరములో ప్రధాన చట్టమును ఇంకనూ సవరించినందుననూ మరియు 2014 లో ఉన్నట్టి జీవిత కాలముతో పోల్చినపుడు సగటు జీవిత కాలములో చెప్పుకొనదగిన మెరుగుదల ఉన్నందుననూ , ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019 లో ప్రాపంచిక సగటు జీవిత కాలము దాదాపు 73 సంవత్సరములుగాను మరియు భారతీయ సగటు జీవిత కాలము 70 సంవత్సరములుగాను ఉన్నందున మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితులు మెరుగైనందుననూ ; మరియు , సీనియర్ ఉద్యోగుల అనుభవము మరియు నైపుణ్యాన్ని వినియోగించుకొనుటకుగాను మరియు పెరిగిన జీవిత కాలమును , మెరుగుపడిన సాధారణ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొనుచూ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) చట్టము , 1984 క్రిందకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రస్తుత పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరములకు పెంచవలెనని మరియు సదరు నిర్ణయమును 01 -01-2022 నుండి అమలు చేయుటకు ప్రతిపాదించవలెనని పర్యాలోచించడమైనది .
పై ప్రతిపాదనను అమలుపరచుటకు గాను ఈ అధ్యాదేశమును జారీచేయుట అవసరమైయున్నది