APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori PRC 2022
Showing posts with label PRC 2022. Show all posts
Showing posts with label PRC 2022. Show all posts
చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకు 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగిస్తూ ఉత్తర్వులు

చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకు 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగిస్తూ ఉత్తర్వులు

Mohan
APTF Updated at: March 09, 2022

  • . 11వ పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్‌ సింగ్‌ రావత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 
  • ఈ జీఓ ప్రకారం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలివీ..👇👇 
  • పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చు. అలాగే, ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు. 
  •  పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది. 
  •  వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులను పొందవచ్చు. హైరిస్క్‌ వార్డుల్లో పనిచేసే నర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. 
  • ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బేసిక్‌ పే లిమిట్‌ రూ.35,570గా ఉన్న నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్‌ గ్రేడ్‌ ఎంప్లాయిస్‌ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చు. 

    
            Click Here to Download G.O Ms No. 33


  

01.01.2022 నుండి Retirement Age 62 ఏళ్ళకు పెంచుతూ గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

01.01.2022 నుండి Retirement Age 62 ఏళ్ళకు పెంచుతూ గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Mohan
APTF Updated at: February 01, 2022

 
ఆంధ్రప్రదేశ్ చట్టములు , అధ్యాదేశములు మరియు వినియమములు మొదలగునవి . 2022 జనవరి , 30 వ తేదీన గవర్నరు జారీ చేసిన ఈ క్రింది అధ్యాదేశపు ఇంగ్లీషు భాషలోని అధికార పాఠమును భారత సంవిధానము యొక్క 348 ( 3 ) అనుచ్ఛేదము క్రింద అందరి ఎరుక నిమిత్తము ప్రచురించబడుచున్నది . 

2022 లోని 1 వ ఆంధ్రప్రదేశ్ అధ్యాదేశము భారత ప్రజారాజ్యపు డెబ్భై మూడవ సంవత్సరములో గవర్నరుచే జారీ చేయబడినది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) చట్టము , 1984 ను ఇంకనూ సవరించుటకైన అధ్యాదేశము . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) చట్టము , 1984 ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 55 సంవత్సరములుగా విహితపరచినందుననూ మరియు ఆఖరు గ్రేడు సర్వీసు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరములుగా నిర్ణయించినందుననూ ; మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) ( సవరణ ) చట్టము , 2014 ( 2014 లోని 4 వ చట్టము ) ద్వారా 02-06-2014 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మొదలగు వారికి పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరములు నుండి 60 సంవత్సరములకు పెంచుతూ 2014 వ సంవత్సరములో ప్రధాన చట్టమును ఇంకనూ సవరించినందుననూ  మరియు 2014 లో ఉన్నట్టి జీవిత కాలముతో పోల్చినపుడు సగటు జీవిత కాలములో చెప్పుకొనదగిన మెరుగుదల ఉన్నందుననూ , ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019 లో ప్రాపంచిక సగటు జీవిత కాలము దాదాపు 73 సంవత్సరములుగాను మరియు భారతీయ సగటు జీవిత కాలము 70 సంవత్సరములుగాను ఉన్నందున మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితులు మెరుగైనందుననూ ; మరియు , సీనియర్ ఉద్యోగుల అనుభవము మరియు నైపుణ్యాన్ని వినియోగించుకొనుటకుగాను మరియు పెరిగిన జీవిత కాలమును , మెరుగుపడిన సాధారణ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొనుచూ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) చట్టము , 1984 క్రిందకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రస్తుత పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరములకు పెంచవలెనని మరియు సదరు నిర్ణయమును 01 -01-2022 నుండి అమలు చేయుటకు ప్రతిపాదించవలెనని పర్యాలోచించడమైనది . 

పై ప్రతిపాదనను అమలుపరచుటకు గాను ఈ అధ్యాదేశమును జారీచేయుట అవసరమైయున్నది 


    Click here to Download 62 Years Ordinance





కొత్త జీతాలపై సర్కారు కసరత్తు

కొత్త జీతాలపై సర్కారు కసరత్తు

Mohan
APTF Updated at: January 23, 2022

  • కొత్త జీతాలపై సర్కారు కసరత్తు.. 
  • మార్గదర్శకాలతో తాజా ఉత్తర్వులు....
  • మరోవైపు ఉద్యోగుల సహాయ నిరాకరణ

 ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఖజానా ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్‌ తాము ఈ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రభుత్వానికి తెలిపింది. ఆ సంఘం నాయకులు పి.శోభన్‌బాబు, రవికుమార్‌ ఉన్నతాధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. తాజాగా పే అండ్‌ అకౌంట్సు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పి.శివప్రసాద్‌ కూడా ఉన్నతాధికారులను కలిసి తాము పీఆర్సీ అమలు ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు.

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో రవి సుభాష్‌, ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు, పే అండ్‌ అకౌంట్సు అధికారి కె.పద్మజ, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస పూజారి, జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ ఖజానా అధికారులు, ఉప ఖజానా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానా శాఖ నిత్యం ఏమేం చేయాలనే దానిపైనా రావత్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 

ఆ ప్రకారం...

* ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు డీడీలతో, ఎస్‌టీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పీఆర్సీ ఎలా అమలు చేయాలో వివరించాలి.

* అనంతరం ఖజానా శాఖ అధికారులందరూ సంబంధిత డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.

* ఖజానా శాఖ అధికారులంతా జనవరి 22కల్లా పరిశీలన కార్యక్రమం పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా అడుగు ముందుకు పడ్డ దాఖలాలు లేవు.

* రోజూ జిల్లా ఖజానా అధికారులు ఉదయం 11 గంటలకల్లా ఖజానా శాఖ డైరెక్టర్‌కు పురోగతి వివరించాలి. ఆయన మధ్యాహ్నం 12 గంటల లోపు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పురోగతి తెలియజేయాలి.

* సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో అవసరమైన సాంకేతిక సహకారం అందించాలి. ఖజానా శాఖ అధికారులందరికీ డీడీవో వారీగా డ్యాష్‌బోర్డులో సమాచారం అందుబాటులో ఉంచాలి.

* ఖజానా అధికారులంతా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలి.

* జనవరి 25 కల్లా అందరు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులకు తాజా పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలి. ఇంతకుముందున్న విధానం ప్రకారమే వాటిని ఖజానా అధికారులకు పే అండ్‌ అకౌంట్సు అధికారులకు వారు సమర్పించి జీతాల చెల్లింపు పూర్తిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

విషం చిమ్మే వ్యూహం!Jan 23 2022 @ 03:11AM  సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం

విషం చిమ్మే వ్యూహం!Jan 23 2022 @ 03:11AM సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం

Mohan
APTF Updated at: January 23, 2022

  •  విషం చిమ్మే వ్యూహం!

  • సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం
  • Jan 23 2022 @ 03:11AM

జీతం పెరిగిందంటూ కరపత్రాల ముద్రణ
వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీసోషల్‌ మీడియాలోనూ ఉద్యోగులు టార్గెట్‌పనిచేయని, లంచావతారాలుగా చిత్రీకరణవారికెందుకు ఇంత జీతమని ప్రశ్నలుదీటుగా బదులిస్తున్న ఉద్యోగులుతప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రజలకు వినతి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)‘మేం ఇచ్చినంత తీసుకోవాలి. మీరు అడిగినంత మేం ఇవ్వం’ అంటున్న వైసీపీ సర్కారు ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించింది. ఇందుకు వలంటీర్లతోపాటు సోషల్‌ మీడియానూ విస్తృతంగా వాడుకుంటోంది. ‘ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి. వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లండి. మన వాదన వినిపించండి’ అని స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన మంత్రివర్గ సహచరులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ‘ఉద్యోగులు కోరినట్లుగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తే, ఏదైనా పథకాన్ని ఆపాల్సి ఉంటుంది’ అని కూడా అన్నారు. వెరసి... ఉద్యోగుల ప్రయోజనాలకు వారి ఇవ్వడం పేదల వ్యతిరేక చర్యగా చిత్రీకరించారు. ఇప్పుడు ఉద్యోగులపై కరపత్రాల యుద్ధం కూడా మొదలైంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో జీతాలు ఎలా పెరుగుతాయంటే... అంటూ ఒక పట్టికతో కరపత్రాలు ముద్రించారు. వాటిని వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంచడం మొదలుపెట్టారు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించి, సీసీఏ ఎత్తివేసినప్పటికీ జీతాలు పెరుగుతాయా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడంలేదు. ‘ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకేసారి కలిపేసి... జీతం పెరిగిందంటే ఎలా? అలా చూసినా జీతం తగ్గుతుందే తప్ప పెరగదు’ అని ఉద్యోగులు చెబుతున్నారు. అయినా సరే... జనవరి 1వ తేదీన తీసుకున్న జీతం, ఫిబ్రవరి 1న తీసుకోబోయే జీతం అంటూ ప్రభుత్వం ఒక కరపత్రాన్ని రూపొందించింది. ‘‘మొత్తంగా జీతాలు పెరుగుతున్నాయా? లేదా? అదే చూసుకోవాలి. బేసిక్‌ పెరగడం ద్వారా అదివరకు అందే గ్రాస్‌ శాలరీకన్నా, పీఆర్సీ తర్వాత అందుతున్న గ్రాస్‌ శాలరీ పెరగడం లేదా? అంటే జీతాలు పెరుగుతున్నాయా, లేవా అనే విషయాన్ని గమనించాలి. కొత్త పీఆర్సీతో జీతాల కోత అవాస్తవం. అడగకపోయినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న మాట నిజం కాదా?’’ అని ఈ కరపత్రంలో ప్రశ్నించింది. వీటిని ఇంటింటికీ పంచుతూ... జీతాలు తగ్గాయన్న ఉద్యోగుల వాదనలో నిజం లేదని ప్రచారం చేయాలని వలంటీర్లను ఆదేశించింది.
సోషల్‌ మీడియాలోనూ...ఉద్యోగులపై బురదజల్లేందుకు సోషల్‌ మీడియాను కూడా వైసీపీ వాడుకుంటోంది. తన సోషల్‌ మీడియా సైన్యాన్ని ఉద్యోగులపైకి ఉసి గొల్పుతోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ఉద్యోగులకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని, లంచావతారాలని... ఇంకా ఎందుకు జీతాలు పెంచాలని పోస్టులు పెడుతున్నారు. ఇక... టీచర్లను మరింతగా టార్గెట్‌ చేస్తున్నారు. ‘‘టీచర్లు చేసేది ఎమిటి? ఎన్ని సెలవులు? ఎన్ని రోజులు పని చేస్తున్నారు? ఎంత జీతం? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసే ఉపాధ్యాయులకు వేతనాల పెంపు ఎందుకు? ప్రభుత్వ టీచర్ల జీతమెంత... ప్రైవేటు స్కూలు టీచర్లకు జీతమెంత?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఇక... ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలను బహిరంగంగా ప్రదర్శించాలన్నది కొందరి డిమాండ్‌! ఇలా రకరకాల పోస్టులతో ఉద్యోగులను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ఉద్యోగులూ ఆలోచించండి’ అంటూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు చెప్పిన వివరాలతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అదే అస్త్రం... ఇప్పుడు ఉద్యోగులపైకి!వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక సోషల్‌ మీడియాను రెండు రకాలుగా ఉపయోగించుకుంటోంది. ఒకటి... తాము తీసుకోబోయే నిర్ణయాలకు అనుకూలంగా ముందుగానే ప్రచారం చేయడం. రెండు... గతంలోలాగా తమను వ్యతిరేకించే వారిపై విమర్శలు గుప్పిస్తూ, వారిని ఆత్మరక్షణలోకి నెట్టడం. తాజాగా... సినిమా టికెట్ల వివాదంపైనా ఇలాగే చేశారు. ‘సినిమా వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా! వాళ్లేమైనా సమాజ సేవ చేస్తున్నారా?’ అని దుమ్మెత్తి పోశారు. అమరావతి రైతుల పాదయాత్రపైనా సోషల్‌ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారానికి దిగారు. ఇప్పుడు... ప్రభుత్వ ఉద్యోగులపైనా పడ్డారు.
దీటుగా ఉద్యోగుల అస్త్రాలు...‘ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి’ అంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలతోపాటు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఉద్యోగులూ దీటుగా స్పందిస్తున్నారు. ‘కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయి అంటున్నారు కదా! మాకు అది వద్దు. ఐదు డీఏలు కలిపేసి... 27 శాతం ఐఆర్‌ ఉన్న పాత జీతమే ఇవ్వండి. డబ్బులు ఆదా చేసుకోండి’ అని చురకలు అంటిస్తున్నారు. కొత్త పీఆర్సీతో తమకు జరిగే నష్టాన్ని లెక్కకట్టి వివరిస్తున్నారు. ‘‘రివర్స్‌ పీఆర్సీ ఇచ్చారు. ఐదు డీఏలు కలిపేసి.. జీతం తగ్గకపోవడమే మహాభాగ్యం అంటున్నారు. గత ప్రభుత్వాలు అందించిన ప్రయోజనాలకూ కోత పెడుతున్నారు. ఇదేం న్యాయం అని అడిగిన మాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది పద్ధతి కాదు’’ అని ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు.
రెచ్చగొట్టడం సరికాదు‘‘న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాలు, హక్కుల కోసం సమాజంలోని వివిధ వర్గాలు పోరాటాలు చేయడం సహజం. వీరిపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రభుత్వం సమాంతర ప్రచారం చేయడం తగదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య విద్వేషాలు సృష్టించడం మానుకోవాలి. ప్రభుత్వానికి మేమూ సమాధానం ఇస్తాం. బహిరంగంగానే స్పందిస్తాం!’’        - హృదయరాజ్‌, ఏపీ జేఏసీ

వైసీపి అధికార పార్టీ వారి ప్రశ్నలకు APTF:1938 జవాబులు

Mohan
APTF Updated at: January 23, 2022

 




.




Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |