జిల్లా
విద్యాశాఖాధికారి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా '
ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వం రాష్ట్రం నందలి అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు
చేస్తున్న కృషిలో భాగముగా జాతీయ విద్యా విధానం -2020 ను మన రాష్ట్రములో 2022-2023 విద్యాసంవత్సరము
నుండి అమలు చేయుటకు సన్నాహాలు చేయడము జరుగుచున్నది . వీలైనంతవరకు , పాఠశాలల్లో అంగసేవాడి కేంద్రాలు అనుసంధానం చేయబడి ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ ,
ఫౌండేషన్ స్కూల్స్ మరియు కండరీ స్కూల్స్ గా పిలువబడుతాయి .
ఇందులో భాగముగా
ప్రాథమిక , ప్రాథమికోన్నత
పాఠశాలలోని 3,4 మరియు 5 వ తరగతులను
నిబంధనల మేరకు ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయబడును . తద్వారా 3 వ తరగతి నుండి subject ఉపాధ్యాయులతో విద్యా బోధన
జరుగుతుంది . ప్రాధమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేయటం వలన
పాఠశాలలు బలోపేతము అగును .
అలాగే ప్రతి మండలములో
బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయుటకు సంకల్పించిరి . అలాగే జూనియర్ కళాశాలలు
లేని మండలాలల్లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా ప్రజా పరిషత్ జునియర్
కళాశాలలుగా ఉన్నతీకరించి ప్రతి మండలములో కనీసము రెండు జూనియర్ కళాశాలలు ఉండునట్లు
చర్యలు గైకొనుచున్నారు . ఈ ప్రక్రియ అమలులో ప్రస్తుతం ఉన్న వసతి సరిపోకపోతే , ఎన్ని అదనపు తరగతి గదులు అవసరమో
గుర్తించి వాటిని రెండవ విడత మనబడి నాడు నేడు కింద మంజూరు అగునటుల తగు చర్యలు
గైకొనబడుచున్నవి .
మన జిల్లా నందు
జాతీయ విద్యా విధానం -2020 అమలులో ఏ ఒక్క పాఠశాల కూడా మూసివేయబడదు మరియు ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా
మూసివేయబడదు . స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ లో భాగముగా జిల్లా యందలి పాఠశాలలు ( నాడు
నేడు పాఠశాలలు విధిగా ) అన్నియూ SVP App నందు తప్పనిసరిగా
నమోదు చేయవలెను . పాఠశాల సిఫ్టీ అన్నీ పాఠశాలల్లో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి
. .
ఇందులో భాగముగా 2022-2023 విద్యాసంవత్సరము లో పాఠశాలలు
తిరిగి పునః ప్రారంభము అగునాటికి ఇప్పటివరకు ఉన్న అంగన్వాడీ , ప్రాధమిక , ప్రాథమికోన్నత , ఉన్నత
పాఠశాలు కేటగరీ పాఠశాలాలుగా
1. . శాటిలైట్
ఫౌండేషనల్ పాఠశాలలు ,
2. ఫౌండేషనల్
పాఠశాలలు ,
3. ఫౌండేషనల్
స్కూల్ ఫ్లస్ ,
4. ఫ్రీ హై
స్కూల్ ,
5. హై స్కూల్
,
6. హై స్కూల్
ప్లస్ ) రూపాంతరం చెందును
- 3,4 మరియు 5
వ తరగతి విద్యార్ధులకు రికార్డ్ పీట్ లను జారీ చేసి , సదరు పిల్లలు అందరూ ఉన్నత పాఠశాలల్లో నమోదు చేయబడుదురు . . . పాఠశాలల్లోని
ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల హాజరును పటిష్టముగా అమలు చేయుటకు బయోమెట్రిక్
యంత్రములను అందుబాటులోకి తేవటం జరుగుతుంది .
- అలాగే ఉపాధ్యాయుల
వ్యక్తిగత సమాచారము ( TIS ) ను ఫిబ్రవరి 16 వ తేదీ లోగా CSE website నందు 100 % update చేసుకొనవలెను . సంబంధిత DDO
లు సదరు ఉపాధ్యాయుల సమాచారమును TIS నందు
ధృవీకరించవలెను .
- అలాగే ఉపాధ్యాయుల
యొక్క సర్దుబాటు మరియు బదిలీలను మే 30 వ తేదీ లోగా పూర్తి చేయబడతాయి .
- జాతీయ విద్యా
విధానం -2020 అమలులో
భాగముగా అర్హత గల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబడును మండల విద్యా శాఖాధికారులకు
స్వయం ప్రతి వత్తి హోదా కలిపిస్తూ , ఖాళీలుగా ఉన్న MEO
పోస్టులను భర్తీ చేయబడును
జిల్లా
విద్యాశాఖాధికారి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా '