APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » education » కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

Posted by APTF 1938
» education
» Wednesday, 9 March 2022

కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలివే


కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలివే

=================

రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు మరియు 11వ తరగతిలో ప్రవేశాల వివరాలు ఇవే

ప్రవేశాలకు గరిష్ఠ వయసు పెంపు - ఒకటో తరగతికి కనిష్ఠం ఆరేళ్లు, గరిష్ఠం 8 ఏళ్లు

=================

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కనిష్ఠ, గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా ఆరేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్లు ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ పేర్కొంది. ఈ రెండు వయసుల మధ్య ఉన్నవారికి మాత్రమే కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని, అంతకంటే తక్కువ, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో అయిదు నుంచి ఏడేళ్ల వరకు వయసు ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం ఉండేది.

ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కనీస వయసును 6 ఏళ్లకు, గరిష్ఠ వయసును 8 ఏళ్లకు పెంచింది. దివ్యాంగులకు గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చింది. దీని ప్రకారం ఒకటో తరగతిలో దరఖాస్తు చేసుకొనే పిల్లలు 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 1 మధ్య పుట్టినవారై ఉండాలి. దివ్యాంగులైతే 2012 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 1 మధ్యలో జన్మించి ఉండొచ్చు. ఒకటో తరగతి ప్రవేశాలకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ తెలిపింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 7 గంటలవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. మార్చి 25న తొలి, ఏప్రిల్‌ 1న రెండు, ఏప్రిల్‌ 8న మూడో ఎంపిక జాబితా ప్రచురిస్తామని తెలిపింది.

=================

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం:  28, ఫిబ్రవరి 2022, ఉదయం 10.00గంటల నుండి

దరఖాస్తుల ప్రక్రియ ఆఖరి తేదీ: మార్చి 21న సాయంత్రం 7 గంటల వరకు

తొలి జాబితా విడుదల తేదీ: మార్చి 25, 2022

రెండో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్‌ 1, 2022

మూడో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్‌ 8, 2022

=================

* రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 8 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

* 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్‌ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. 

DOWNLOAD KVS ADMISSIONS APP

NOTIFICATION

APPLY HERE

KVS Admission Schedule 2022-23

KVS Admission Guidelines 2022-23

REGISTRATION FORM CLASS-II ONWARDS

REGISTRATION FORM CLASS-XI

OPTION FORM FOR CLASS-XI

WEBSITE 

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |