APTF ఖండన
ఒక్క పోస్ట్ రద్దు కాదు..ఒక్క స్కూల్ మూతపడవు...అంటే అర్థం ఇదా.?.ఇంకా ఎన్ని మూయడాలుంటాయో !!
- APTF:1938
యస్.జి టీచర్స్ ను మోడల్ స్కూల్స్ కు 4764 బదలాయిస్తు పోస్టులను రద్దు చేయడం వల్ల ప్రాథమిక విద్య నాశనం అవుతుందని, విద్యా శాఖలో ఏ అవసరం వచ్చినా SG పోస్టులను రద్దు చేయడం ఆనవాయితీ అయింది. ఈ విధానాన్ని కాకుండా పోస్టులను క్రియేట్ (సృష్టించి ) చేసి మార్పులను చేసుకోవాలని, ప్రాథమిక విద్య ను బలోపేతం చేయాలని, నూతన DSC ప్రకటించాలని APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.