పాఠశాల విద్యాశాఖలోని సొసై టీలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ పాఠశాలల్లో పనిచే స్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస టైమ్ స్కేల్ను వర్తింపచేస్తూ పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి గతంలోనే ఈ ఉత్తర్వులిచ్చినా కొన్ని సంస్థల్లో అమలుకావడం లేదు. 11వ పీఆర్సీలో భాగంగా.. 2022 జనవరి 17న ఇచ్చిన జీవో 5 ద్వారా విద్యాశాఖలో, ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లందరికీ కనీస టైమ్ స్కేల్ ఇస్తామని తెలిపారు.