అనంతపురం న్యూటౌన్ , మార్చి 18 ప్రభాతవార్త .స్థానిక ఉపాధ్యాయ భవన్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది . ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్రెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అదే విధంగా రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలులో లోపాలు సరిదిద్దాలని అదే విధంగా 3 , 4 , 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయరాదని ఆంగ్ల మ ఆధ్యమానికి సమాంతరంగా తెలుగు ఇతర మాతృభాష మాధ్యమాలను కొనసాగించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . త్వరలో కొత్త జిల్లాల ఏర్పరుచు నందున త్వరితగతిన ఫెడరేషన్ మండల కౌన్సిల్ సమావేశాలు పూర్తి చేయాలని , ఏప్రిల్ నెలలో నిర్వహజంచే జిల్లా కౌన్సిల్ సమావేశ్యనికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఫెడరేషన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు . ఈ సమావేశంలో నాయకులు రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు విశ్వనాథరెడ్డి , రవీంద్ర , రాష్ట్ర నాయకులు పివి ప్రసాద్ , వెంకటసుబ్బయన , మహ్మద్ రఫి , సరిత , జిల్లా అసోషియేషన్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి , కార్యదర్శిలు హరిప్రసాద్ రెడ్డి , నాగరాజు పోతులయ్య , గణేష్ రమేష్ రెడ్డి , నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు .