APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF ANP
Showing posts with label APTF ANP. Show all posts
Showing posts with label APTF ANP. Show all posts

అనంతపురము జిల్లా ఎపిటిఎఫ్1938 క్యాలెండర్ ఆవిష్కరణ

Mohan
APTF Updated at: January 01, 2023

 అనంతపురము జిల్లా ఎపిటిఎఫ్1938 క్యాలెండర్ ఆవిష్కరణ సభ లో ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న జిల్లా అధ్యక్షులు జి .రవీంద్ర పాల్గొన్న రాష్ట్ర,జిల్లా నాయకులు 





పెండింగ్ బకాయిలు,DA ల విడుదల కోసం APTF ధర్నా : అనంతపురము జిల్లా

Mohan
APTF Updated at: December 26, 2022

 పెండింగ్ ...పెండింగ్ ,పెండింగ్ 🚩

ఉద్యోగ,ఉపాద్యాయులకు సంవత్సరాలుగా డి ఏ పెండింగ్, 150 నెలలుగా డి ఏ అరియర్స్ పెండింగ్,ఉపాద్యాయులు  దాచుకొన్నప్రావిడెంట్ ఫండ్ లోన్లు సంవత్సరకాలంగా పెండింగ్, మెడికల్ రీయెంబర్స్ మెంట్ బిల్స్ సంవత్సరాల తరబడి పెండింగ్,ఎపిజిఎల్ ఐసి లోన్స్ పెండింగ్,సి పి యస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్,ఉద్యోగ ఉపాద్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్, ఉపాద్యాయులు సంపాదిత లీవులు సంవత్సర కాలంగా పెండింగ్,వారంలో రద్దు చేస్తానన్న సి పి యస్ 3 సంవత్సరాలుగా పెండింగ్,ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది కోట్లరూపాయలు బకాయీ పడ్డ ప్రభుత్వం సుమారు 3 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టడం తో ఉపాద్యాయుల కుటుంబాలలో కుమార్తెల పెళ్ళిళ్లు ఆగిపోయాయని,రిటైర్డ్ ఉద్యోగుల ఆపరేషన్ లు వాయిదాపడుతున్నాయని అనేక ఉద్యమ కార్యాచరణలద్వారా ప్రభుత్వం దృష్టి కి తెచ్చినా సమస్య పరిష్కరించకపోగా,ప్రతి నెలా ఒకటో తారీకు జీతం పెన్షన్ ఇవ్వడంలేదని,అశాస్త్రీయ సిపియస్ రద్దు చేయకుండా జి పి యస్ అనే కొత్త సమస్యను సృస్టిస్తున్నదని మరో వైపు నూతన జాతీయ విద్యావిధానం ముసుగులో వేలాది ఉపాద్యాయ పోస్టులు రద్దుచేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ లేకుండాచేస్తుంది...అసంభద్ద బదిలీ ఉత్తర్వులతో ఉపాద్యాయుల మద్య వైశమ్యాలు సృస్టిస్తూంది...పై సమస్య సత్వర పరిష్కారానికి ఎపిటిఎఫ్1938 రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అనంతపురము జిల్లాశాఖ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్ష కార్యదర్శులు జి రవీంద్ర,శ్రీనివాసరెడ్డి,నాయకులు పి.వి.ప్రసాద్,విశ్వనాద్,వెంకటరెడ్డి,రఫ్ఫి,వెంకటసుబ్బయ్య,శ్రీనివాసనాయక్,బహేస్వర,నాగరాజు,నాగార్జున,రమేశ్ రెడ్డి,కె టి రంగాప్రసాద్...జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.



అనంత జిల్లాలో ధర్నా లో మాట్లాడుతున్న జిల్లా అద్యక్షులు జి .రవీంద్ర













సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి : ఏపిటిఎఫ్ డిమాండ్

Mohan
APTF Updated at: March 19, 2022

 


అనంతపురం న్యూటౌన్ , మార్చి 18 ప్రభాతవార్త .స్థానిక ఉపాధ్యాయ భవన్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది . ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్రెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అదే విధంగా రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలులో లోపాలు సరిదిద్దాలని అదే విధంగా 3 , 4 , 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయరాదని ఆంగ్ల మ ఆధ్యమానికి సమాంతరంగా తెలుగు ఇతర మాతృభాష మాధ్యమాలను కొనసాగించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . త్వరలో కొత్త జిల్లాల ఏర్పరుచు నందున త్వరితగతిన ఫెడరేషన్ మండల కౌన్సిల్ సమావేశాలు పూర్తి చేయాలని , ఏప్రిల్ నెలలో నిర్వహజంచే జిల్లా కౌన్సిల్ సమావేశ్యనికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఫెడరేషన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు . ఈ సమావేశంలో నాయకులు రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు విశ్వనాథరెడ్డి , రవీంద్ర , రాష్ట్ర నాయకులు పివి ప్రసాద్ , వెంకటసుబ్బయన , మహ్మద్ రఫి , సరిత , జిల్లా అసోషియేషన్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి , కార్యదర్శిలు హరిప్రసాద్ రెడ్డి , నాగరాజు పోతులయ్య , గణేష్ రమేష్ రెడ్డి , నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు .


అనంతపురం జిల్లాలో శరవేగంగా సభ్యత్వ నమోదు

Mohan
APTF Updated at: November 17, 2021

Membership campaign APTF1938 🚩Anantapur 🚩🚩🚩 
ఏపిటిఎఫ్ 1938
అనంతపురం జిల్లాలో శరవేగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. బెలుగుప్ప మండలంలో అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, జిల్లా కౌన్సిలర్ వజీర్ భాష,  ఫక్రుద్దీన్, కుల్లాయి స్వామి పాల్గొన్నారు.

అనంతపురం రూరల్ మండలంలో రాష్ట్ర నాయకులు  మహమ్మద్ రిఫీక్, జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ టి. పురుషోత్తంరెడ్డి, పి.లక్ష్మీప్రసాద్ రెడ్డి, జి.నాగేశ్వరరెడ్డి కె.బాలకృష్ణ నాయక్ మండల  ప్రధానకార్యదర్శి, కార్యకర్తలు  పాల్గొన్నారు.
అలాగే గుడిబండ మండలంలో నూర్ భాషా, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

మిత్రులారా! 
ఒకేసారి ఒకేరోజు 3 మండలంలో విస్తృతంగా సభ్యత్వం చేస్తున్న అనంతపురం జిల్లా శాఖకు ప్రత్యేక అభినందనలు
-జి హృదయ రాజు,అధ్యక్షులు కె . కుల శేఖర రెడ్డి, ప్రధాన కార్యదర్శి.

అనంతపురంలో కొనసాగుతున్న సభ్యత్వ నమోదు

Mohan
APTF Updated at: October 22, 2021



ఈరోజు APTF 1938  సభ్యత్య నమోదు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి మండలం చుక్కలూరు  పాఠశాల ఉపాధ్యాయులకు APTF 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవీంద్ర చేసిన సేవలకు గుర్తుగా ఆ పాఠశాల ఉపాధ్యాయిని  పదివేల రూపాయలు జనరల్
ఫండ్, సభ్యత్వం,ఉపాధ్యాయ ప్రగతి సంవత్సరపు చందాను చెల్లించడం జరిగింది.

🚩జై APTF✊✊✊జై జై APTF🚩

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి!

Mohan
APTF Updated at: October 21, 2021


ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలింపును నిరసిస్తూ  రాష్ట్రంలో ఖళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని  అనంతపురం  డి ఆర్ ఓ గారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా కన్వినర్ జి. రవీంద్ర, ఎపిటిఎఫ్1938, జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యం.వెంకటసుబ్బయ్య, జిల్లా అదనపు ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్, నాయకులు నాగిరెడ్డి, షమీవుల్లా, డి టి ఎఫ్ నాయకులు జార్జి, సాలవేముల బాబు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మసముద్రం మండలం కోనాపురం ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు

Mohan
APTF Updated at: September 30, 2021


ఈరోజు బ్రహ్మసముద్రం మండలం కోనాపురం ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శ రవీంద్ర సార్ మరియు జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సార్ మండల బాధ్యులు పాల్గొనడం జరిగింది

పరిష్కరిస్తే ప్రశ్నించరు :: ఏపిటీఎఫ్

Mohan
APTF Updated at: September 27, 2021

 

ఐటి ఐ డి ఎల్ టి ల రాష్ట్ర సదస్సులో వందల మంది ఉద్యోగులు పాల్గొన్న సమావేశంలో సభా వేదికపైన లక్షలాది మంది నిరుద్యోగులకు , కాంటాక్ట్ , ఔట్ సోర్సింగ్ , ఉపాధ్యాయ , ఉద్యోగ , పెన్షనర్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు ఐ.వెంకటేశ్వర రావు ను అవమానపరచిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అహంకారపూరిత వైఖరిని ఏపిటీఫ్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్సులు జి హృదయరాజు కె.కులశేఖర రెడ్డి పేర్కొన్నారు . పీఆర్సీ అమలు , కాంటాక్ట్ ఉద్యోగుల సమస్యలు , డీఎ ల మంజూరు , సీపీస్ రద్దు లపై తీవ్రమైన జాష్యంపై ప్రశ్నించిన ఎమెల్సీకి సమాధానం ఇవ్వాల్సింది పోయి లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిందిపోయి అసహనం వ్యక్తం చేయడం సరైన విధానం కాదన్నారు . బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జిహృదయ రాజు , కె.కులశేఖర రెడ్డి డిమాండ్ చేశారు .



MLC ఐ.వెంకటేశ్వరరావు గారి పైన ,  జరిగిన సభా అమర్యాద కు నిరసన తెలియజేస్తూ,  అటువంటి చర్యలను APTF తీవ్రంగా ఖండిస్తూ ఉంది  అని APTF- 1938 జిల్లా కార్యదర్శి  వి.బహేశ్వర ఆధ్వర్యంలో  విరామ సమయంలో నల్లబ్యాడ్జ్ లతో నిరసన తెలియచేయడం జరిగింది.              

 - V. బహేశ్వర, జిల్లా కార్యదర్శి, 
APTF:1938 అనంతపురం జిల్లా


అనంతపురం జిల్లా APTF 1938 సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mohan
APTF Updated at: September 24, 2021

 



కణేకల్ మండలం, అనంతపురం జిల్లా నందు APTF సభ్యత్వ నమోదు

------------------------------------------------





అనంతపురం జిల్లా కణేకల్ మండలం APTF 1938 సభ్యత్వ నమోదు కార్యక్రమం లో  జిల్లా ప్రధాన కార్యదర్శి, G. రవీంద్ర గారు,  sub-comitee  మెంబర్ v. బహేశ్వర,  కణేకల్ మండలం నాయకులు  నాగరాజు,RAAMANJINEYULU, Gangadri తదితరులు



అనంతలో ముమ్మరంగా ఎపిటీఎఫ్ సభ్యత్వ నమోదు

Mohan
APTF Updated at: September 17, 2021

APTF:1938,Info.                     
అనంతపురం, ముదిగుబ్బ మండలం ఉప్పాలపాడు HIGH స్కూల్ లో ఎపిటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ఏ. విశ్వనాథరెడ్డి, స్టేట్ కౌన్సిలర్లు నారపరెడ్డి, నాగిరెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయులకు SHOW CAUSE నోటీస్ జారీపై ఎపిటీఎఫ్ అభ్యంతరం

Mohan
APTF Updated at: September 03, 2021



ఆనంతపురం:         
  ప్రైమరీ, యూపీ, హైస్కూల్ హెడ్డుమాస్టర్స్ కి IMMS,TMF, యాప్స్ లో ఫొటోస్ అప్లోడ్ చేయలేదని SHOW CAUSE నోటీస్ జారీ చేయడం పై APTF అభ్యంతరం తెలియజేసింది. షో CAUSE నోటీస్ వెంటనే ఉపసంహరించుకోవాలని DEO గారికి  వినతి పత్రం అందజేసారు. జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి , కార్యనిర్వాహక  సభ్యులు వరప్రసాద్,సత్య ప్రసాద్, శ్రీనివాస్ నాయక్,రమణారెడ్డి, నాగార్జున రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రక్రుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతపురంలో జేడీ సర్వీసెస్ డి. మధుసూదన్ రావును కలిసిన ఏపిటిఎఫ్ 1938 నాయకులు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం.

Mohan
APTF Updated at: August 17, 2021


జేడీ సర్వీసెస్ డి మధుసూదన్ రావు గారు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, రవీంద్ర రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, సత్య ప్రసాద్, పి వి ప్రసాద్ జిల్లా నాయకులు శ్రీనివాసులు నాయక్, ఆంజనేయులు నాయక్, ఆదినారాయణ, ఫకృద్దీన్ samiullah తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగినది.

ఎన్ ఈ పీ 2020 ని నిలుపుదల చేయాలని అనంతపురం లో నిరసన.

Mohan
APTF Updated at: August 12, 2021


APTF-1938,DTF, AISF, PDSU, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో NEP అమలును నిలిపివేయాలని, 3,4,5 తరగతులు తరలింపు నిలిపివేయాలని, 25,000 టీచర్స్ పోస్టులు DSC ద్వారా భర్తీ చేయాలని నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది. తదనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో DRO గాయత్రి గారికి రెప్రెసెంటషన్ అందజేయడం జరిగింది.

ఏపిటిఎఫ్ 1938 ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం :: బుక్కరాయసముద్రం

Mohan
APTF Updated at: March 08, 2021



ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుక్కరాయసముద్రం ఉన్నత పాఠశాలలో ఏపిటిఎఫ్ 1938 ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది ఇందులో పాల్గొని ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర

అనంతప్రురము జిల్లా శ్రీ.కదిరి చాంద్ భాష గారి పదవీ విరమణ సన్మానసభ

Mohan
APTF Updated at: February 28, 2021

అనంతప్రురము జిల్లా బుక్కరాయసముద్రం మండలము సీనియర్ ఉపాద్యాయులు శ్రీ.కదిరి చాంద్ భాష గారి పదవీ విరమణ సన్మానసభలో ప్రసంగిస్తున్న ఎపిటిఎఫ్1938 రాష్ట్ర కార్యవర్గసభ్యుడు యం.వెంకటసుబ్బయ్య.


అనంతపురం జిల్లా మధ్యంతర కౌన్సిల్

Mohan
APTF Updated at: January 31, 2021


అనంతపుర0 జిల్లాలో ప్రారంభమైన మధ్యంతర కౌన్సిల్ సమావేశము 
ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు గారు,
ఎన్నికల పరిశీలకులుగా హాజరైన కర్నూల్ జిల్లా ప్రధానకార్యదర్శి ఇస్మాయిల్ గారు,
రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు కులశేఖర రెడ్డి గారు,

రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వెంకటసుబ్బయ్య.


జాతీయ విద్యావిధానం_2020 కి వ్యతిరేకంగా అనంతపురము జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమములో పాల్గొన్న రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు కులశేఖర రెడ్డి

Mohan
APTF Updated at: November 26, 2020

 జాతీయ విద్యావిధానం_2020 కి వ్యతిరేకంగా అనంతపురము జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమములో పాల్గొన్న రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు కులశేఖర రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటసుబ్బయ్య,జిల్లా నాయకులు,విధ్యార్థి సంఘం నాయకులు





invitation for MARPU SMARAKA SABHA and state subcommittee

Mohan
APTF Updated at: December 20, 2017



Dear All,
As we've decided earlier our Inspiring leader Sri Marpu Balakrishnamma smaraka sabha will be arranged at ANANTHAPUR TOWN IN Z.P conference Hall on 7th JANUARY.

Our efficient leader of AIFRTE and close associate to Marpu Prof. Sri. K. Chakradhara Rao is coming to deliver his valuable speech on contemporary problems in Education. so 

👉we must feel to attend for this sabha as our fiduciary duty. so requesting you to attend by on time and maintain discipline.

👉by 3pm our state subcommittee will be organised. all the dt and state leaders are requested to complete the campaign by the 31st December and credit state quota in respective account and send message. under any circumstances time should not be extended because we have to conduct state elections by the end of May31st and before that we have to finish mandal, district level elections WITH THE AVERAGE OF LAST TWO YEARS(2016-17+2017-18)

👉Diaries are ready for delivery by Thursday so take them from printer by paying full amount as per your previous quotation which already given

👉next month is the struggle month because 9th JANUARY  PENSION SADHANA SAMITI DHARNA at old taluk level and 29th of JanuaryFAPTO district level dharna on teachers common and most important problems.
again in February 10th pension Saadhana Samithi district level dharna
advised to make grand success all the above programs 
General Secretary, APTF.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |