ఇచ్చిన హామీ మేరకు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి.
- ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయ రాజు.
 |
| కర్నూలు జిల్లా, బనగానపల్లె APTF ప్రాంతీయ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు:జి.హృదయ రాజు |
బనగానపల్లె డివిజన్ ఏపిటిఎఫ్ కార్యకర్తల ప్రాంతీయ సమావేశం ఏపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.మాధవ స్వామి అధ్యక్షతన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయ రాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలకు పెను భారంగా, గుదిబండగా ఉన్న సి పీ ఎస్ విధానాన్ని ఇచ్చిన హామీ మేరకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే రిటైర్డ్ అయినప్పుడు భద్రత లేని CPS పెన్షన్ రావడంతో జీవితం గడవక భారంగా గడపాల్సి వస్తుందని తెలిపారు. కనుక వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ లోకి ఉద్యోగులను తీసుకొచ్చి వారి జీవితాలలో వెలుగు నింపాలని కోరారు. అంతేగాక ప్రాథమిక పాఠశాలలను విడగొట్టి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు కలపడం వల్ల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు ఆక్కడికి చేరుకోలేక బడి మానేసి నిరక్షరాస్యులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . జాతీయ విద్యా విధానం లోపభూయిష్టమైన మరియు ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి విరుద్ధమైనదిగాను ఉన్నందున వెంటనే రద్దు చేయాలని పిలుపునిచ్చారు. భిన్న భాషలు భిన్న సంస్కృతులు ఉన్న మన రాష్ట్రంలో వివిధ భాషల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా ఒకే భాషలో ఆంగ్ల భాషలోనే విద్యాబోధన అభ్యసించాలన్న నిర్ణయం అసంబద్ధ నిర్ణయం అని తెలిపారు. పెండింగ్లో ఉన్న అనేక ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల ,ఉయ్యాలవాడ మండలాల కార్యవర్గ సభ్యులును ఎన్నుకోవడం జరిగింది. ఏపిటిఎఫ్ బనగానపల్లె మండలం గౌరవ అధ్యక్షులుగా గోపాల్ రావు, అధ్యక్షులుగా జె. వెంకట కృష్ణుడు, ప్రధాన కార్యదర్శిగా సుంకన్న అవుకు మండలం ఏపిటిఎఫ్ గౌరవ అధ్యక్షులుగా నాగార్జున, అధ్యక్షులుగా జి. లింగమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్. ఓబులేసు, కొలిమిగుండ్ల మండల గౌరవ అధ్యక్షులుగా బి. ప్రభాకర్ అధ్యక్షులుగా పి.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి.విజయ భాస్కర్, సంజామల మండలం గౌరవ అధ్యక్షులుగా రాఘవయ్య, అధ్యక్షులుగా హరిబాబు , ప్రధాన కార్యదర్శి పరమేశ్వరుడు, ఉయ్యాలవాడ మండలం గౌరవ అధ్యక్షులుగా రమణ, అధ్యక్షులుగా రామాంజనేయులు ,ప్రధాన కార్యదర్శిగా చిన్న చెన్నయ్య ఐదు మండలాల సబ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ లు మధుసూదన్ రావు, నాగరాజు, సీనియర్ నాయకులు లాజరస్, సుబ్బరాయుడు,కె. రమేష్, ఈరన్న, రఫీ, కృష్ణమూర్తి ఎం. రమేష్, దస్తగిరి , చౌడయ్య, జోసెఫ్ మరియు అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.