APTF(1938) VZM
పాఠశాలలు upgrade అయిన వాటికి ,స్కూల్ బై ఫర్ కేషన్ అయినవాటికి,NEW Schools కి ఆర్గనైజేషన్ కోడ్ లేకపోవడం వలన ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు ఖర్చు చేసిన నిధులు డ్రా చేసే అవకాశం లేక ఆ పాఠశాలలష ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.అలాగే కొంత మంది ఉపాధ్యాయులకు పొజిషన్ ఐ డి లు క్రియేట్ కాకపోవడంతో ఉపాధ్యాయుల జీతాలు డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తెర్లాం గరివిడి ,బలిజిపేట మండల శాఖలు ఈ రెండు అంశాలను విజయనగరం జిల్లాశాఖకు ప్రాతినిధ్యం చేయటం తో. జిల్లా శాఖ రాష్ట్ర సంఘంనకు ప్రాతినిధ్యం చేయటం తో రాష్ట్ర ఏపిటిఎఫ్ బాధ్యులు DTA గారిని ,సి ఎఫ్ ఎం ఎస్ ceo గారిని,CSE కమిషనర్ గారిని కలిసి ప్రాతినిధ్యం చేశారు. దానికి స్పందించిన పై వారు ఈ నెల 25వ తేదీ తర్వాత STO లకు పై రెండు సమస్యలు పరిష్కరించే అధికారం ఇస్తామని అని హామీ ఇచ్చారు. ఈ సమస్యలు రాష్ట్రంలో దాదాపు గా అన్ని మండలాల్లో కూడా ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఏపిటిఎఫ్ శాఖ రాష్ట్ర సంఘంనకు ప్రాతినిధ్యం చేసినది.ఇదే విషయమై గత సంవత్సరము( జనవరి 2021) కూడా ప్రాతినిధ్యం చేయగా అధికారులు Non HRMS లో జీతాలు చేసుకునే వెసులుబాటు కల్పించినారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేదు.
ఈ విషయంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కృషి చేస్తున్న రాష్ట్ర బాధ్యులకు జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము