🌻న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్ ఫారంలు 1-5ను నోటిఫై చేసింది. కార్పొరేట్లు, ట్రస్టులకు వర్తించే ఐటీఆర్ 6,7 తదుపరి నోటిఫై చేస్తారు. కొత్త ఫారంల ప్రకారం విదేశాల్లో అందుకున్న రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఏడాదికి రూ.2.5 లక్షల పైబడిన పీఎఫ్ ఖాతాలపై సమకూరే వడ్డీ ఆదాయాలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. సీబీడీటీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ సంఖ్యలో ఉండే చిన్న, మధ్యశ్రేణి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్) రెండింటినీ మరింత సరళం చేశారు.
♦ఎవరెవరికీ ఏ ఫారం...? సహజ్ (ఫారం-1): రూ.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వేతనం, ఇంటి ఆస్తి, ఇతర వనరుల (వడ్డీలు, ఇతరం) ఆదాయం పొందే వారు.
♦ఐటీఆర్-2: వ్యక్తిగత అసెసీలు, హెచ్‌యూఎ్‌ఫలు ఈ ఫారం దాఖలు చేయాలి. ఏడాదికి రూ.2.5 లక్షలకు పైబడి పీఎఫ్ ఖాతాల్లో పెడుతున్న పెట్టుబడులపై వచ్చే వడ్డీని వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే డివిడెండ్ ఆదాయం, ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం (డీటీఏఏ) కింద పన్ను పరిధిలోకి వచ్చే డివిడెండ్ ఆదాయం వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది.
♦ ఐటీఆర్-3: వ్యాపారాలు/వృత్తిపరమైన కార్యకలాపాల నుంచి లాభంగా ఆదాయం పొందే వారు.
♦సుగమ్ (ఫారం-4): రూ.50 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, వృత్తినిపుణులు.
♦ఐటీఆర్-5: ఎల్‌ఎల్‌పీలుఐటీఆర్-1: స్థూలంగా గత ఏడాదిలో ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే నికర వేతనాన్ని మదింపు చేయడం కోసం విదేశాల్లో నిర్వహించే రిటైర్మెంట్ ప్రయోజనాల ఖాతాకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వాలన్నది కొత్త మార్పు. అలాగే ఐటీ చట్టం 89-ఎ లో నోటిఫై అయిన దేశంలోనే ఆ ఖాతా ఉన్నదా అనే అంశం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 89-ఎ సెక్షన్ కింద వారు మినహాయింపులు కూడా కోరవచ్చు.