APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori INCOME
Showing posts with label INCOME. Show all posts
Showing posts with label INCOME. Show all posts
పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

Mohan
APTF Updated at: February 19, 2023

 ఆదాయ పన్ను సమాచారం


పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు




♦️ ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.



♦️ అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది

March-May  15%

Jun-Aug 45%

Sep-Nov  75%

Dec-Feb 100%



అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.



♦️ ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.



♦️ ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.

 


♦️ కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

 

♦️ ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచోఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.



♦️ DDO లకు సూచనలు

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)



♦️ DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.



♦️ లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)



♦️ DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.



♦️ TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.


♦️ లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.



♦️ TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.



♦️ ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.



♦️ పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు...

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

Mohan
APTF Updated at: January 04, 2023

 ప్రాయోజిత సమాచారం

ఎపిటీఎఫ్ 1938


 Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు... 


👇👇👇👇👇

  •  1. PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి  లాస్ట్ year PAN no. తప్పు గా enter చేసి,  దాదాపు చాలా మంది teacher వాళ్ల వి జనవరి TDS AMOUNT,  government direct credit PRC salaries veyadam వల్ల వేరే వాళ్ళ pan card ki tax జమ కావడం జరిగింది..

  •  2.) E-FILING పోర్టల్ నుండి AIR (annual information report)లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి ( FD, saving Bank account interest). 

  •  3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి,  ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి. 

  •  4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి. 

  •  5.) House loan ,  joint account ఉంటే 50-50 share చేసుకోవాలి.  లేక పోతే 25-75 చేసుకోవాలి. 
  •  6.) ఇదే సూత్రం interest మరియు,  principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి. 
  •  7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ కూడా 80C పరిధిలో ఉంటుంది.  


  •  8.) NPS state government employee అయితే proof అవసరం లేదు,  అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి. 


  •  9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి. 


  •  10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents సదరన్ latest ఇవ్వాలి.. 


  •  11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి.  దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ. 


  •  12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.., 


  •  13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి.. 


  •  14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి.  తద్వారా online Form-16. Generate అవుతుంది.  మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి.  ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది. 


  •  15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి.  ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి.  తేడా tax కొరకు.


అలాగే..... 


10E గురించి పూర్తి సమాచారం తెలుసుకుoదం ...


అసలు 10E అంటే ఏమిటి,  ఎవరు File చేయడానికి అర్హులు,  ఎందుకు చేయాలి.  ఎలా చేయాలో తెలుసుకుందాము.


10E అంటే section 89(1) కింద tax రిలీఫ్ (refund) కోరడం.. అంటే గత సంవత్సరం లో రావాల్సిన బకాయిలను (SALARY/DA/PRC/IR HPL/ Ect...)....ఈ సంవత్సరంలో తీసుకోవడము వలన మనం కట్టె   tax పరిధి 5%నుండి 20% కి  & 20% నుండి 30% పెరిగిన సందర్భం లో E-filing చేసే కంటే ముందే 10E file చేయవలెను. దీనికి ముందే tax calculation ఫార్ములా ప్రకారం చేసి పెట్టుకోవాలి.  దీని కోసం గత సంవత్సరం Form-16 తప్పనిసరిగా దగ్గర ఉండాలి,  అప్పుడే మనం 10E చేసుకోవాలి .

Income Tax FY 2022-23 AY 2023-24 Income Tax Act - IT FY 2022-23 New and Old Tax Slab Rates

Income Tax FY 2022-23 AY 2023-24 Income Tax Act - IT FY 2022-23 New and Old Tax Slab Rates

Mohan
APTF Updated at: December 09, 2022

 


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై  అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ

2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ

Mohan
APTF Updated at: December 09, 2022

 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై  అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ


December 07, 2022, circular no.24/2022 


 Taxpayer/STO/DTO/DDO లు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు..... 


1.DDO లు తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల సేవింగ్స్ వివరాలు అన్ని కూడా..12BB form  లో తీసుకోవాలి,  income tax లో మినహాయించి మిగిలిన వాటికి tax cut చేయాలి.. (page 14).


 The DDO shall also ensure furnishing of the evidence or particulars in Form No. 12BB in 

 respect of deduction of interest as specified in Rule 26C read with section 192 (2D).


2.) HOUSE LOAN, లేదా HRA లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించాలి. 


3.) పని చేస్తున్న place ఇంటికి దూరంగా ఉంటే/ఇంట్లోలేకపోతే,  HRA మాత్రమే Claim చేయాలి, (page-14). 

i. 

the deduction is allowed only in case of house property which is owned and is in the 

occupation of the employee for his own residence. In case the house property is not 

occupied by the employee in view of his place of the employment being at other place, 

then his residence in that other place should not be in a building belonging to him.

3.) Topup loan 30000 వరకు చూపవచ్చు .proof submit చేయాలి..


4. Section 192(2D) with Rule 26C. Own house unte,

a.*Interest pay certificate 

b.name, aadhar, pan card physical. compulsury తీసుకోవాలి*.  (page 15)


5.)Form 24Q, (TDS ,,మే 31 లోపు ఎటువంటి పరిస్థితుల్లోనూ complete చేయాలి. ఆ తర్వాత 500/- per day. Penalties విధించ బడుతుంది. (Page 18).

6. ) ప్రతి DDO తన పరిధిలోని employees కి,  tds certificate (Form-16) ని,  విధి గా,  డిజిటల్ signatures తో authentication చేసి ఇవ్వాలి.  కానీ చాలా మంది DDO లు ఎవరికి కూడా DSC లేదు., లేకపోతే కొన్ని టెక్నికల్ problems రావచ్చు.  (Page-23)


7.)DDO లు compulsury గా HRA evidence/proof.(FORM-12BB) .Employee నుండి తీసుకోవాలి. (page-24)

8.)income tax section ప్రకారం total Tax ఎంత deduct చేయాలి అనేది DDO గారె ఫైనల్... Here STO role is zero.. సో అందరూ సెంట్రల్ government సర్క్యులర్ (24/2022) క్షుణ్ణంగా చదవవలసినది....

9) ఏదైనా తప్పుగా CALCULATE చేస్తే,  271H ప్రకారం శిక్ష అర్హులు..(page-27)

10.) ఎవరినయినా LTC leave travel concessions,  మీకు,  మీ DDO ఇచ్చి ఉంటే మాత్రమే,  10(5) కింద మినహాయించు కోవాలి. (Page-41.)


10.)80DD మరియు 80U కింద మినహాయింపు కోరే self/ఫ్యామిలీ person with challenges , తమ తమ ఒరిజినల్ documents కలిగి ఉండాలి,  Treatment/INSURANCE paper లు, /health  insurence.. ect.. 80U కోసం latest disability %certification ఉండాలి...


#INCOME_TAX


Click Here to Download Circular on Incometax



 కొత్త ఏడాదికి కొత్త ఐటీ  రిటర్న్‌ ఫారంలివే

కొత్త ఏడాదికి కొత్త ఐటీ రిటర్న్‌ ఫారంలివే

Mohan
APTF Updated at: April 04, 2022

🌻న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ ఫారంలు 1-5ను నోటిఫై చేసింది. కార్పొరేట్లు, ట్రస్టులకు వర్తించే ఐటీఆర్‌ 6,7 తదుపరి నోటిఫై చేస్తారు. కొత్త ఫారంల ప్రకారం విదేశాల్లో అందుకున్న రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, ఏడాదికి రూ.2.5 లక్షల పైబడిన పీఎఫ్‌ ఖాతాలపై సమకూరే వడ్డీ ఆదాయాలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. సీబీడీటీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ సంఖ్యలో ఉండే చిన్న, మధ్యశ్రేణి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్‌), ఐటీఆర్‌ ఫారం 4 (సుగమ్‌) రెండింటినీ మరింత సరళం చేశారు.


♦ఎవరెవరికీ ఏ ఫారం...? సహజ్‌ (ఫారం-1): రూ.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వేతనం, ఇంటి ఆస్తి, ఇతర వనరుల (వడ్డీలు, ఇతరం) ఆదాయం పొందే వారు.


♦ఐటీఆర్‌-2: వ్యక్తిగత అసెసీలు, హెచ్‌యూఎ్‌ఫలు ఈ ఫారం దాఖలు చేయాలి. ఏడాదికి రూ.2.5 లక్షలకు పైబడి పీఎఫ్‌ ఖాతాల్లో పెడుతున్న పెట్టుబడులపై వచ్చే వడ్డీని వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే డివిడెండ్‌ ఆదాయం, ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం (డీటీఏఏ) కింద పన్ను పరిధిలోకి వచ్చే డివిడెండ్‌ ఆదాయం వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది.


♦ ఐటీఆర్‌-3: వ్యాపారాలు/వృత్తిపరమైన కార్యకలాపాల నుంచి లాభంగా ఆదాయం పొందే వారు.


♦సుగమ్‌ (ఫారం-4): రూ.50 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, వృత్తినిపుణులు.


♦ఐటీఆర్‌-5: ఎల్‌ఎల్‌పీలుఐటీఆర్‌-1: స్థూలంగా గత ఏడాదిలో ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే నికర వేతనాన్ని మదింపు చేయడం కోసం విదేశాల్లో నిర్వహించే రిటైర్మెంట్‌ ప్రయోజనాల ఖాతాకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వాలన్నది కొత్త మార్పు. అలాగే ఐటీ చట్టం 89-ఎ లో నోటిఫై అయిన దేశంలోనే ఆ ఖాతా ఉన్నదా అనే అంశం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 89-ఎ సెక్షన్‌ కింద వారు మినహాయింపులు కూడా కోరవచ్చు.

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...

Mohan
APTF Updated at: February 08, 2022

  1. PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి 


 2.) E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి FD, saving Bank account interest (10వేల వరకు మినహాయింపు ఉంటుంది). 


 3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి,  ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి. 


 4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి. 


 5.) House loan ,  joint account ఉంటే 50-50 share చేసుకోవాలి.  లేక పోతే 25-75 చేసుకోవాలి. 


 6.) ఇదే సూత్రం interest మరియు,  principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి. 


 7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ kuda 80C పరిధిలో ఉంటుంది.  


 8.) NPS state government employee అయితే proof అవసరం లేదు,  అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి. 


 9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి. 


 10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి.. 


 11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి.  దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ. 


 12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.., 


 13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి.. 


 14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి.  తద్వారా online Form-16. Generate అవుతుంది.  మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి.  ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది. 


 15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి.  ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి.  తేడా tax కొరకు.


Tax Exemption for Expenditure on COVID treatment and received Ex-gratia due to Corona deaths

Tax Exemption for Expenditure on COVID treatment and received Ex-gratia due to Corona deaths

Mohan
APTF Updated at: June 26, 2021

 Tax Exemption for Expenditure on COVID treatment and received Ex-gratia due to Corona deaths


Click here to Download Copy




 Income Tax Returns ఫైల్ చేస్తున్నారా.. ?      ఈ ఏడాది వ‌చ్చిన మార్పులు తెలుసుకోండి.

Income Tax Returns ఫైల్ చేస్తున్నారా.. ? ఈ ఏడాది వ‌చ్చిన మార్పులు తెలుసుకోండి.

Mohan
APTF Updated at: June 16, 2021


    ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం ఫైల్ చేయాల్సిందే.  అయితే టాక్స్-పైల్లింగ్ చేసే విధానంలో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌తీ సంవ‌త్స‌రం కొన్ని మార్పులు చేస్తుంటుంది. ప‌న్ను చెల్లింపుదారులు త‌ప్పులు లేకుండా ఐటీ రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేంద‌కు ఈ మార్పుల‌ను తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. 


    మ‌దింపు సంవ‌త్స‌రం.. ఏవై22 కోసం రిట‌ర్ను ఫారాలను ఐటీ శాఖ నోటిఫై చేసింది.  ఐటీఆర్ దాఖ‌లు గడువును కూడా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ప‌న్ను దాఖ‌లుకు కావ‌ల‌సిన‌ ప‌త్రాల‌ను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఫైల్‌ చేయడం మంచిది. దీంతో మీ వైపు లోపాలు ఎత్తి చూపే అవ‌కాశాలు త‌గ్గ‌డంతో పాటు, రిఫండ్‌ల ప్రాసెస్ ప్ర‌క్రియ కూడా వేగంగా పూర్తిచేసేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది. అయితే,  ప‌న్ను దాఖ‌లు ప్రాసెస్‌ను ప్రారంభించేముందు ఈ నాలుగు విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి. 


1. కొత్త vs పాత ప‌న్ను విధానం.


కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2020 బ‌డ్జెట్‌లో కొత్త ప‌న్ను విధానాన్ని తీసుకొచ్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.   అయితే పాత ప‌న్ను విధానాన్ని ర‌ద్దు చేయ‌లేదు. ఆర్థిక‌ సంవ‌త్స‌రం..ఎఫ్‌వై21 నుంచి  వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు పాత, కొత్త ప‌న్ను విధానాల‌లో త‌మ‌కు అనుకూలంగా ఉండే ప‌న్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. కొత్త విధానంలో త‌క్కువ స్లాబ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పాత విధానంలో ప్ర‌కారం వ‌ర్తించే త‌గ్గింపులు, మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు కొత్త ప‌న్ను పాల‌సీలో వ‌దులుకోవ‌ల‌సి ఉంటుంది.



ఏ విధానాన్ని ఎంచుకున్నా.. సంవ‌త్స‌రం ప్రారంభంలోనే ఎంచుకోమ‌ని  స‌ల‌హా ఇస్తున్నారు నిపుణులు. పాత ప‌న్ను విధానంలో వ‌ర్తించే త‌గ్గింపులు, మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలకు అనుగుణంగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పెట్టుబ‌డులు చేయనివారు  కొత్త ప‌న్ను విధానాన్ని ఎంచుకోవ‌డం మంచింది. దీంతో త‌క్కువ స్లాబ్‌కి వ‌స్తారు కాబ‌ట్టి ప‌న్ను త‌గ్గుతుంది. 


వ్యాపార‌స్తులు మ‌రింత జాగ్ర‌త్తగా స‌రైన ప‌న్ను విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కార‌ణం ప‌న్నువిధానాన్ని ఎంచుకున్న‌ త‌రువాత ఒక‌సారి మాత్ర‌మే మార్చుకునేందుకు వీల‌వుతుంది. అయితే జీతం, ఇంటి ఆస్తి, ఇత‌ర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చుకోవ‌చ్చు. రెండు విధానాల‌లోనూ వ‌ర్తించే నిబంధ‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌న్ను లెక్కించి, ఏ విధానం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుందో నిర్ణ‌యించుకోవాల‌ని ఆదాయ‌పు ప‌న్ను ఫైల్లింగ్ పోర్ట‌ల్ ట్యాక్స్‌2విన్‌.ఇన్‌ (Tax2win.in) స‌హా వ్య‌వ‌స్థాప‌డ‌కుడు సీఈఓ అభిషేక్ సోని తెలిపారు. 


2. తేది పొడిగింపు, వ‌డ్డీ ఉప‌శ‌మ‌నం లేదు.


ఐటీఆర్ దాఖ‌లుకు సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు గ‌డువు పొడిగించారు. అయితే ప‌న్ను లైబిలిటీలో మాత్రం ఎలాంటి ఉప‌శ‌మ‌నం ఇవ్వ‌లేదు. ముందుస్తు ప‌న్ను(అడ్వాన్స్ ట్యాక్స్‌) చెల్లింపులు చేయ‌నివారు పెనాల్టీ వ‌డ్డీ చెల్లించాలి. అందువ‌ల్ల ప‌న్ను చెల్లించి వీలైనంత త్వ‌ర‌గా ఐటీఆర్‌ను దాఖ‌లు చేయ‌డం మంచిది. 


సెక్ష‌న్ 234ఏ కింద పెనాల్టీ వ‌డ్డీకి సంబంధించి కేంద్ర ప్ర‌త్యక్ష ప‌న్నుల విభాగం..సిబిడిటి కొంత స‌డ‌లింపు ఇచ్చింది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన ప‌న్ను చెల్లింపుదారుల‌ స్వీయ‌-అంచ‌నా ప‌న్ను (టీడీఎస్‌, అడ్వాన్స్ టాక్స్ మొద‌లైన‌వి చెల్లించిన‌ త‌రువాత‌) రూ. ల‌క్ష‌కు మించ‌కుంటేనే ఈ స‌డ‌లింపు వర్తిస్తుంది. ఇది రూ.1ల‌క్ష కంటే ఎక్కువ ఉంటే సెక్ష‌న్ 234ఏ కింద ఉప‌శ‌మ‌నం ల‌భించ‌దని ఆర్ఎస్ఎమ్ ఇండియా వ్య‌వ‌స్థాప‌కుడు సురేష్ సురానా అన్నారు. 


ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డంలో ఆల‌స్యం జ‌రిగితే సెక్ష‌న్ 234ఏ కింద 1శాతం చొప్పున నెల‌వారీ వ‌డ్డీని వ‌సూలు చేస్తూరు. ప‌న్ను విభాగం నిర్ణ‌యించిన తేదిల‌లోపు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అడ్వాన్స్ ప‌న్ను చెల్లించ‌డంలో విఫ‌లం అయిన ముంద‌స్తు ప‌న్ను చెల్లింపుదారుల‌కు సెక్ష‌న్ 234బి, 234సి వ‌డ్డీ చార్జ్ చేస్తారు. 



ప‌న్ను చెల్లింపుదారుడు ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌పోయినా, ప‌న్ను అంచనాలో 90 శాతం కంటే తక్కువ మొత్తాన్ని జ‌మ చేసినా.. బ‌కాయి ఉన్న మొత్తంపై సెక్ష‌న్ 234బి ప్ర‌కారం 1 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. 


సాధార‌ణంగా అడ్వాన్స్ ట్యాక్స్ త్రైమాసికంగా చెల్లించాలి. వీటికి ఆదాయపు ప‌న్ను శాఖ కొన్ని తేదీల‌ను నిర్ణ‌యిస్తుంది. ఈ తేదికి ముందే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించని వారికి సెక్ష‌న్ 234సి కింద వ‌డ్డీ పెనాల్టీ ప‌డుతుంది. 


అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే గ‌డువు..


జూన్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 15శాతం అడ్వాన్స్ చెల్లించాలి, 


సెప్టెంబ‌ర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 45శాతం అడ్వాన్స్ చెల్లించాలి. 


డిసెంబ‌ర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్ప‌టికే క‌ట్టిన ముంద‌స్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి. 


మార్చి 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్ను 100శాతం నుంచి అప్ప‌టికే క‌ట్టిక ముందస్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి. 


వ్యాపారం ద్వారా ఆదాయం లేని సినియ‌ర్ సిటిజ‌న్ల‌కు ముందుస్తు ప‌న్ను నుంచి మిన‌హాయింపు కల్పించారు. 


3. ప‌న్ను ఫారంల‌లో మార్పులు..

ప‌న్నులు చెల్లించ‌డంలో వ‌చ్చిన మార్పుల‌కు అనుగుణంగా ప్ర‌తీ సంవ‌త్సరం కొత్త ఐటీ ఫారంల‌ను రూపొందిస్తుంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. స‌రైన ఫారంను ఎంచుకునేందుకు ఈ మార్పుల‌ను తెలుసుకోవ‌డం అవ‌స‌రం.  ఈ సంవ‌త్స‌రం కూడా ఐటీఆర్‌-1 అర్హ‌త ప్ర‌మాణాల‌లో కొన్ని మార్పులు చేశారు. దీనిని సాధార‌ణంగా జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ప‌న్ను చెల్లింపుదారులు ఉప‌యోగిస్తారు.  సెక్ష‌న్ 194ఎన్ కింద న‌గ‌దు విత్‌డ్రా కోసం టీడీఎస్ డిడ‌క్ట్ చేసిన వ్య‌క్తులు లేదా య‌జ‌మాని నుంచి ఎంప్లాయిస్ స్టాక్ ఆప్ష‌న్‌(ఈఎస్ఓపీ)పై డిప‌ర్డ్ ట్యాక్స్ పొందిన వారు ఐటీఆర్ 1 ను దాఖ‌లు చేయ‌కూడ‌దు. ఈ మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని ఫారంల‌ను ఎంచుకోవాలి. 


4. క్లెయిమ్ చేయని తగ్గింపులు..

ప‌న్ను మిన‌హాయింపు పెట్టుబ‌డుల‌(జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటివి)కు సంబంధించిన ఫ్రూఫ్‌ల‌ను య‌జ‌మానికి ఇవ్వ‌డంలో విఫ‌లం అయితే ప‌న్ను డిడ‌క్ట్ అవుతుంది. అయితే దీన్ని గురించి ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు. ఐటీఆర్ దాఖ‌లు చేసేప్పుడు ఈ త‌గ్గింపుల‌ను క్లెయిమ్ చేసి, చెల్లించిన ప‌న్నును వాప‌సు పొంద‌వ‌చ్చు. అయితే వీటికి సంబందించి ఒక కాఫీని మీ వ‌ద్ద భ‌ద్ర‌ప‌ర‌చ‌డం మంచిది. 



ఈ సంవ‌త్సరం వ‌డ్డీ  ఆదాయం, అందుకున్న డివిడెండ్‌, మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్ల‌పై వ‌చ్చిన‌ మూల‌ధ‌న లాభాలు వంటి వాట‌న్నింటికి సంబంధించిన స‌మాచారం ఐటీఆర్ ఫారంల‌లో నిక్షిప్తం చేస్తుంది ఐటీశాఖ‌. త‌ప్పులు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈ స‌మాచారాన్ని మీ వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌తో పోల్చి చూడండి.  ఇందుకోసం ఫారం 16, ఫారం 26ఏఎస్ వంటి ప‌త్రాల‌ను, బ్యాంకు స్టేట్‌మెంట్ల‌ను ఐటీఆర్ ఫైల్లింగ్‌కు ముందే సేక‌రించి పెట్టుకోవాలి. 


టీడీఎస్‌(మూలం వ‌ద్ద ప‌న్ను), టీసీఎస్‌(మూలం వ‌ద్ద సేక‌రించిన ప‌న్ను) వంటివి ఫారం 26ఏఎస్‌లో జులై 15వ తేది నాటికి వారి వారి ఫారం 26ఏఎస్‌లో అప్‌డేట్ అవుతాయి. అప్ప‌టి వ‌ర‌కు మ‌దింపుదారులు వేచి ఉండ‌మ‌నేది నిపుణుల స‌లహా. టీడీఎస్‌, టీసీఎస్ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేది జూన్‌30 వ‌ర‌కు పొడిగించారు. అందువ‌ల్ల జులై 15 లోపు ఫారం 26ఏఎస్‌లో అప్‌డేట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని  క‌న్స‌ల్టింగ్ సంస్థ టాక్స్ క‌నెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ ఎల్ఎల్‌పీకి చెందిన వివేక్ జ‌ల‌న్ తెలిపారు. 


ఐటీఆర్‌ను ధృవీక‌రించే వర‌కు ప‌న్ను దాఖ‌లు ప్ర‌క్రియ పూర్తికాదు. ఐటీఆర్ దాఖ‌లు చేసిన 120 రోజుల్లో ఇది జ‌ర‌గాలి. ఆన్‌లైన్ ద్వారా గానీ, సంత‌కం చేసిన‌ ఐటీఆర్ -V ను పోస్ట్ చేయ‌డం ద్వారా గానీ ధృవీక‌రించ‌వ‌చ్చు.

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA

Mohan
APTF Updated at: February 24, 2021

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA
Frequently Asked Questions by DDOs for Housing Loan Interest Deductions

హౌసింగ్ లోన్ విషయంలో తరచు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 24 మాత్రమే కాకుండా ఇంకా వేరు సెక్షన్లలో ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది అని. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సంబంధించిన సెక్షన్ల గురించి ఓసారి చూద్దాం.

సెక్షన్ 24 :  ఈ సెక్షన్ లో గరిష్టంగా 2లక్షల వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి మినహాయింపు కలదు.

నిబంధనలకు లోబడి సెక్షన్ 24 కి అదనంగా ఇంట్రెస్ట్ మినహాయింపు ఉన్న సెక్షన్ల వివరాలు నిబంధనలు ఏంటి ఎవరికి వర్తించవచ్చు అనేది చూద్దాం.

సెక్షన్ 80EE : సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ సెక్షన్ లో గరిష్టంగా 50,000 వరకు అదనపు మినహాయింపు కలదు.

80 EE వర్తింపు నిబంధనలు:
1. హోమ్ లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని ఉండాలి.
2. లోన్ FY 2016 -17 (01.04.2016 నుండి 31.03.2017 మధ్య) లో మాత్రమే తీసుకుని ఉండాలి.
3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.
4. వారు ఈ ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం 35లక్షలు లేదా 35లక్షల లోపు ఉండాలి
5. ఇట్టి ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 50లక్షలు లేదా 50లక్షల లోపు ఉండాలి.

పై 5నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 50,000 మినహాయింపుకు అర్హులు.

సెక్షన్ 80EEA :  సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ సెక్షన్ లో గరిష్టంగా 1,50,000 వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి అదనపు మినహాయింపు కలదు.

80 EEA వర్తింపు నిబంధనలు:
1. లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని ఉండాలి.
2. లోన్ FY 2019 -20 (01.04.2019 నుండి 31.03.2020 మధ్య) లో మాత్రమే తీసుకుని ఉండాలి.
3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.
4. రిజిస్ట్రేషన్ కోసం ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 45లక్షలు లేదా 45లక్షల లోపు విలువ ఉన్న ఇంటికి స్టాంప్ డ్యూటీ చెల్లించి ఉండాలి.

పై 4నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 1,50,000 మినహాయింపుకు అర్హులు.

పై రెండు సెక్షన్లు (80EE & 80EEA) నిబంధనలు సంతృప్తికరంగా ఉన్నవారు మాత్రమే అదనపు మినహాయింపు వర్తిస్తుంది.  డి.డి.ఓ లకు సెక్షన్ 192 ప్రకారం ఉద్యోగులకు చెల్లించిన వేతనాలకు ఆదాయ పన్ను ఎలా గణించాలి ఎలాంటి సెక్షన్ల ప్రకారం మినహాయింపులు ఉంటాయి అనేది తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాయు సర్క్యూలర్ జారీ చేస్తారు.

Your Month Wise Salary Details Just Using your CFMS ID...

Your Month Wise Salary Details Just Using your CFMS ID...

Mohan
APTF Updated at: February 07, 2021

APTF1938  INFO
Your Month Wise Salary Details Just Using your CFMS ID...

Details

 First Click the Given Link Here -

Then Select Beneficiary Entry Mode as Manual Entry

Then Enter Beneficiary Code . .Here Benefiricary Code means CFMS ID

Then select the Month and Year which you want to Get the Salary Particulars

Click on Display Button in the Next screen all the Pay Details received in that month will be displayed.

Click on the Bill Number on the Left Side to get the Detailed Particulars

👇
 *https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html*

INCOME TAX  2020-2021 ANALYSIS

INCOME TAX 2020-2021 ANALYSIS

Mohan
APTF Updated at: February 06, 2021

*INCOME TAX  2020-2021 ANALYSIS*

*◙నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది.

*పాత మూడు స్లాబ్ ల విధానంలో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

*◙మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.

*1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు

*పాత విధానంలో
6,50,000-1,50,000 =5,00,000

2.5 లక్షల వరకు టాక్స్ = 0
*5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
*కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ = 0

*కొత్త విధానంలో*
2.5 లక్షల వరకు టాక్స్ =0
*2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500*
*5.0 - 6.5 లక్షల వరకు టాక్స్1,50,000 X 10% = 15,000
*చెల్లించాల్సిన టాక్స్ =27,500
 
*****
*2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు

*పాత విధానంలో
7,00,000-1,50,000 = 5,50,000

2.5 లక్షల వరకు టాక్స్ = 0
*5 లక్షల వరకు టాక్స్         2,50,000 X 5% = 12,500
*5.0 - 5.5 లక్షల వరకు టాక్స్  50,000 X 20% = 10,000
*చెల్లించాల్సిన టాక్స్ = 22,500

*కొత్త విధానంలో*
2.5 లక్షల వరకు టాక్స్ = 0
*2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X    5% = 12,500*
*5.0 - 7.0 లక్షల వరకు టాక్స్  2,00,000 X 10% = 20,000
*చెల్లించాల్సిన టాక్స్ = 32,500

****
*3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు

*పాత విధానంలో
8,50,000-1,50,000 =7,00,000

2.5 లక్షల వరకు టాక్స్ = 0
*5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500*
*5.0 - 7.0 లక్షల వరకు టాక్స్  2,00,000 X 20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ = 52,500

కొత్త విధానంలో
2.5 లక్షల వరకు టాక్స్  =0
*2.5 - 5 లక్షల వరకు టాక్స్     2,50,000 X5% = 12,500*
*5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X10% = 25,000
*7.5-8.5 లక్షల వరకు టాక్స్   1,00,000 X15% = 15,000*
*చెల్లించాల్సిన టాక్స్ = 52,500. పాత కొత్త టాక్స్ లో తేడా లేదు

******

*4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు

*పాత విధానంలో
9,00,000-1,50,000 =7,50,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
*5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500*
*5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,00 X20% = 50,000*
*చెల్లించాల్సిన టాక్స్ = 62,500*

*కొత్త విధానంలో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
*2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500*
*5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X10% = 25,000*
*7.5-9.0 లక్షల వరకు టాక్స్  1,50,000 X15% = 22,500*
*చెల్లించాల్సిన టాక్స్ = 60,000

******

*5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు

*పాత విధానంలో
12,50,000-1,50,000 =11,00,000
2.5 లక్షల వరకు టాక్స్ =0
*5 లక్షల వరకు టాక్స్   2,50,000 X 5% = 12,500
*5.0 - 10 లక్షల వరకు టాక్స్  5,00,000 X 20% = 1,00,000
*10 - 11 లక్షల వరకు టాక్స్  1,00,000 X 30% = 30,000
*చెల్లించాల్సిన టాక్స్  = 1,42,500
 
*కొత్త విధానంలో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
*2.5 - 5 లక్షల వరకు టాక్స్  2,50,000 X5% = 12,500
*5.0 - 7.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X10% = 25,000
*7.5-10 లక్షల వరకు టాక్స్     2,50,000 X15% = 37,500

*10 - 12.5 లక్షల వరకు టాక్స్  2,50,000 X20% = 50,000
*చెల్లించాల్సిన టాక్స్ = 1,25,000

*****
*6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు

*పాత విధానంలో
16,00,000-1,50,000 =14,50,000

2.5 లక్షల వరకు టాక్స్  = 0
*5 లక్షల వరకు టాక్స్         2,50,000 X5% = 12,500
*5.0-10 లక్షల వరకు టాక్స్ 5,00,000 X20% = 1,00,000
*10-14.5 లక్షల వరకు టాక్స్4,50,000 X30% = 1,35,000
*చెల్లించాల్సిన టాక్స్ = 2,47,500
 
*కొత్త విధానంలో
2.5 లక్షల వరకు టాక్స్ =0
*2.5 - 5 లక్షల వరకు టాక్స్      2,50,000 X5% = 12,500
*5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000
*7.5-10 లక్షల వరకు టాక్స్    2,50,000 X15% = 37,500
*10 - 12.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X20% = 50,000
*12.5 - 15 లక్షల వరకు టాక్స్ 2,50,000 X25% = 62,500
*15.0-16 లక్షల వరకు టాక్స్  1,00,000 X30% = 30,000
*చెల్లించాల్సిన టాక్స్ = 2,17,500

*పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానంలోనే లాభం.

6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.

    @    IncomeTax 2020-21 Calculation  

******
*Income Tax పైన కొన్ని సందేహాలు-సమాధానాలు*

👉 ప్రశ్న : *ప్రతీ నెల నా జీతం నుండి IT ని  మా DDO గారు cut చేయిస్తున్నారు. చాలా సంత్సరాల నుండి ఇలాగే చేస్తున్నాం. నేను టాక్స్ కట్టినట్ల కదా?*

జ:  *కాదు, మీరు కట్టిన వేల రూపాయలు tax వృధా అవుతుంది. ఎందుకనగా మీ DDO గారు నీ పేరు మీదుగా cut చేసిన Tax వెళ్లి DDO TAN అకౌంట్ లో పడుతుంది.(Tan అనేది ఒకరకంగా జీరో Account లాంటిదే)  అక్కడే టాక్స్ జమ అయి ఉంటుంది. కానీ ప్రభుత్వం నకు నీ పేరు మీదుగా చేరకుండా Unknown గా ఉంటుంది.*

👉ప్రశ్న : *నేను కట్టిన టాక్స్ నా పేరు మీదుగా ప్రభుత్వానికీ చేరాలంటే ఏమి చేయాలి.?*

జ: *ముందుగా మీ DDO గారి ద్వారా మీరు కట్టిన tax ను chalan no తొ పాటుగా నీ యెక్క PAN accountlo జమ చేయించుకోవాలి.దీన్నే TDS అంటారు. TDS process అయితేనే నీ PAN అకౌంట్లో నీవు కట్టిన టాక్స్ జమ అవుతుంది.*

👉ప్రశ్న :  *TDS చేయిస్తే నేను టాక్స్ కట్టినట్లేనా?*

జవాబు:  *కాదు. మీరు  ఈ -ఫైలింగ్ చేయించడం ద్వారా మీ టాక్స్ ను ప్రభుత్వం నకు కట్టినట్లు అవుతుంది.*  *చివరకు TDS-ఈ-ఫైలింగ్ అయ్యే కొద్దీ ఖర్చుకు వెనుకడుగు వేసి, వేల రూపాయల పన్నును చేతుల్లో నుండి జారవిడుచుకుంటున్నాం. పన్ను కట్టి కూడా కట్టని కోవలోకి వెళ్తున్నారు.*

*ఆలోచించి సరయిన సమయంలో ప్రతిస్పందించండి.*

*మీరు ప్రతినెల కట్ చేయించిన టాక్స్ ని TDS చేయించుకుని సరియైన సమయంలో ఈ-ఫైలింగ్ చేయిస్తేనే మీరు ప్రభుత్వం దృష్టి లో పన్ను చెల్లింపు దారులు కోవలోకి వస్తారు.*

income Tax Particulars 2020-21

income Tax Particulars 2020-21

Mohan
APTF Updated at: February 03, 2021

*APTF:1938 INFO*

IT 2020-21 కోసం ఈ  వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

(APTF-1938)

 *Name:* 
*Designation:* :- 
*Father name:* :- 
*Employee ID:* :- 
*PAN NO:* :- 
*School name:* :- 
*Mandal:* :- 
*Dist:* :- 

*Basic pay in 2020 jan:* :- 
*Basic pay in 2020 feb:* 
*Increment month:* :- 
        (APTF-1938)                                       
*HM allowence:* :- 
*APGLIC NO:*
*APGLIC amount:* :- 
*GIS:* :- 
*PT:* :- 
*CPS/GPF NO:* :- 
*GPF AMOUNT:*

*E L (30/15)Surrender month:* :-
*AAS : yes/No.* :-
 *AAS days:* :-  

*LIC Annual amount:* :- 
*Sukanya Samruddi:* :- 
*Tution Fee:* :- 
*Life Insurance:* :- 
*Others:*
*FD:* :- 
(APTF-1938)

*House loan* :
*Bank name* :
*Principle amount:*
*Intrest amount:*

*DDO Name:* 
*Designation:* 
*DDO TAN:* 
*Office:-*
*Mandal:-*
*Dist:* :- 

(APTF-1938)

*Advance Tax:* = 


*Rent details*

*House owner Name:* 
*Father name:* 
*PAN:* :
*H.NO:* 
*Vil:* 
*Man:* 
*Dist:* 
*MONTHLY RENT:*

(APTF-1938)

Filing Form 10E Benefits – How to Calculate Arrears Claim Relief under Section 89(1) FY 2019-20

Filing Form 10E Benefits – How to Calculate Arrears Claim Relief under Section 89(1) FY 2019-20

Mohan
APTF Updated at: January 19, 2021

 Form-10E and Section 89(1) Details In Telugu – Tax Relief Model Calculation For 10E Form In Income Tax, Form 10E, Section 89(1) details what is Form 10E, what is Section 89(1) in Income Tax calculation Sec 89(1) details in Telugu Form 10E filling and explanation in Telugu. Automatic Calculate the Arrears Relief Calculator with Form 10E, To save Employees from any additional Arrears of tax due to delay in receiving income, the tax laws allow a relief under Section 89(1). How to claim tax relief under Section 89 for salary arrears? How to calculate Arrears Relief Calculation U/s 89(1) with Automated Arrears Calculator with Form 10E Since FY 2015-16, FY 2016-17 and FY 2017-18, 2018-19.


How to Calculate Arrears Claim Relief under Section 89(1)

Excel Form 10E-Filing Form 10E Benefits | How to Calculate Arrears Claim Relief under Section 89(1) FY 2017-18 Arrears Relief calculator AY 2018-19 for claiming rebate under section 89(1) of Income Tax Act 1961-Download. As per section 89(1) of the Income Tax Act, 1961 relief for income tax has been provided when in a financial year an employee receives salary in arrears or advance.


Who is relief u/s 89(1)?

If you have received any your salary in arrears or in advance, you are allowed some tax relief under section 89(1).

What is Form 10E ?

Who was claim relief u/s 89(1), you must file Form 10E in Income tax Department official website.
Who claim relief u/s 89(1) without filing Form 10E receive notice from the Income Tax Department.

How to Calculate Arrears or Advance For relief u/s 89(1) :

We take a simple example. Ramanjaneyulu is a Government Teacher and he has received DA arrears FY 2018-19.
Salary income for FY 2018-19 : Rs 4,88,684
Additional DA/ PRC Arrears received: Rs 24,026
Total income of FY 2017-18 : Rs 5,12,710 ( 4,88,684 + 24,026 )

For More information Click Here

 HRA EXEMPTION  HOME LOAN TAX BENEFIT ఈ రెండూ ఉపయోగించుకోవచ్చా?

HRA EXEMPTION HOME LOAN TAX BENEFIT ఈ రెండూ ఉపయోగించుకోవచ్చా?

Mohan
APTF Updated at: January 19, 2021



We can have four situations for people claiming HRA & Home Loan tax benefit.

1)Rented house in place of employment and own house in different city

2)Own flat in city of employment and stay on rented house in same city

3)Own flat in city of employment and stay with parents/siblings in the same city and pay them rent

4)Rented house in different city and own house at place of employment.



పైన తెలిపిన సందర్భాలలో హోమ్ లోన్ మరియు హౌస్ రెంట్ రెండు క్లెయిమ్ చేసుకోవచ్చు

e-filing రూపకల్పనలో ఎదురయ్యే సమస్యలు- పరిష్కారాలు

e-filing రూపకల్పనలో ఎదురయ్యే సమస్యలు- పరిష్కారాలు

Mohan
APTF Updated at: July 20, 2020



NOV 30 ముగియనున్న e-filing గడువు

ఆర్థిక సంవత్సరం 2019-20 INCOME టాక్స్ చెల్లింపుదారులు e-filing ద్వారా వారి వారి మొత్తం ఆదాయం , సేవింగ్స్ , డిడక్షన్స్, నికర ఆదాయం వివరాలు Minstry of Finance భారత ప్రభుత్వం వారికి ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా తేదీ 30/11/2020 తో ముగియనున్నది.

కావున గడువుకు కనీసం ఒక పది రోజుల ముందే e-filing పూర్తి చేసుకునే  వీలు కల్పించుకోగలరు

ఎందుకంటే....

దిగువన తెలుపబడిన సమస్యలు/పొరపాట్లు e-filing చేస్తున్నప్పుడు ఎదురైతే,ఆ సమస్యలను/పొరపాట్లను సవరించి సులువైన మార్గంలో e-filing పూర్తి చేసుకునే వెసులుబాటును ప్రతి సంవత్సరం పొందేలా మీ మీ e-filing అకౌంట్స్ ను రూపుధ్ధికోవచ్చు.

e-filing లో ఎదురయ్యే సమస్యలు-పరిష్కరం

సమస్య 1

1. టాక్స్ ను మీరు మీ DDO ద్వారా/బ్యాంక్ ద్వారా/efiling ఫోర్టల్ ద్వారా చెల్లించినప్పుడు మీ e-filing అకౌంట్ నందు ఫారం నెంబర్ 26AS నందు మీరు కట్టిన పూర్తి టాక్స్ విలువలు ఉండాలి.లేనిచో మీ టాక్స్ చెల్లింపులో పొరపాటు జరిగింది అని గ్రహించగలరు.

పరిష్కారం

1. టాక్స్ చెలింపు DDO ద్వారా జరిగి , 26AS లో టాక్స్ విలువలు లేకపోతే మీ PAN నెంబర్ TDS  కాలేదని గ్రహించాలి.దినికై మరల TDS ను REVISE చేసి  మీ PAN నెంబర్ ను TDS చేయించాలి.చేసిన వారం లోగా ఫారం నెంబర్ 26AS లో మీ టాక్స్ జమ జరిగింది లేనిది చూసుకొని e-filing చేసుకోవాలి.26AS లో TAX వివరాలు లేకపోవడానికి కారణం మీ DDO TDS చేయజ పోవడం కానీ,  చేస్తే PAN నెంబర్ తప్పుగా నమోదుకావడం కానీ ఉండును.కావున ఇప్పటికీ ఇంకా ఎవరైనా DDO లు TDS చెయ్యకపోతే వెంటనే TDS చేసుకోవాలి.లేనిచో DDO పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బందికి గురి అవుదురు. గమనించగలరు.

బ్యాంక్ ద్వారా టాక్స్ చెల్లింపు చేసిన సందర్భంలో టాక్స్ వివరాలు 26AS లో లేకపోతే ఒక నిర్ణిత గడువు లోగా బ్యాంక్ వారికి REVISE చేసే అవకాశం ఉండును

e-ఫైలింగ్ ఫోర్టల్ ద్వారా చెల్లింపు చేసిన సందర్భంలో టాక్స్ వివరాలు 26AS లో నమోదు కాకపోతే మీ మీ INCOME TAX వార్డ్ పరిధి లోని AO ను నిర్ణత పరిదిలోగా REVISE కు విన్నవించుకోవాలి.

సమస్య 2

మీ యొక్క ఆధార్ PAN లింక్ లేకపోవడం.దీనికి కారణం మీ PAN కార్డ్ వివరాలు ఆధార్ కార్డ్ వివరాలు వేరే వేరుగా ఉండడం.

పరిష్కారం

ప్రభుత్వ సంస్థల అధీనంలో పనిచేస్తున్న  మీ సేవ కేంద్రాలకు  ORGINAL PAN కార్డ్ తీసుకెళ్లి  మీ సేవ ద్వారా PAN కార్డ్ వివరాల ప్రకారం ఆధార్ వివరాలు  మార్చుకోవచ్చు.

PAN కార్డ్ వివరాలు ఆధార్ ప్రకారం మార్చుకోవలంటే PAN  కార్డ్ రూపొందించే వారి ద్వారా కానీ/ ఏదేని మీ సేవ ద్వారా కానీ మార్చుకోవచ్చు.మార్చుకునే ముందు ఒక  సరి PAN, ఆధార్ వివరాలు పోల్చి, సరిచేసుకోవాలి.PAN ఆధార్ వివరాలు ఒకే విదంగా ఉండి PAN ఆధార్ లింక్ లేకపోతె వెంటనే PAN ఆధార్ లింక్ చెయ్యవచ్చు.  లేనిచో రెండింటి వివరాలు ఒకే విదంగా మార్చిన తారువతే వీలై e-ఫైలింగ్ e-వెరిఫికేషన్ కు వీలగును.భవిష్యత్ లో e- ఫైలింగ్ చేసుకునే వీలుండును. గమనించగలరు.

సమస్య-3

PAN ఆధార్ లింక్ ఉన్న e-verification కాకపోవడం.దీనికి కారణం ఆధార్ నెంబర్ కు ప్రస్తుతం మీ వద్ద ఉన్న మొబైల్ నెంబర్ కు లింక్ లేక పోవడం.

పరిష్కారం
ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న మీ కేంద్రాల ద్వారా ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ కు లింక్ చెయ్యడం.

సమస్య -4

ఫారం నెంబర్ 16 లోని ఆదాయం కంటే ఆదాయం పెరిగిన సందర్భంలో కానీ, అడ్వాన్స్ టాక్స్ సరిగా చెల్లించని సందర్భంలో కానీ టాక్స్ రూపంలో కానీ ,interst రూపంలో కానీ టాక్స్ పెరుగును.దీనికి కారణం ఆదాయం ఇతర మార్గాల ద్వారా పొంది ఉండడం/అడ్వాన్స్ టాక్స్ చెల్లించవలసినంత చెల్లించక పోవడం.

పరిష్కారం

E-filing ఫోర్టల్ ద్వారా ప్రస్తుతము చెల్లించవలసిన ఆదనపు టాక్స్ ను మీ మీ/ఇతరుల ATM CARD ను వినియోగించిగాని,NET బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించాలి.

పైన తెలిపిన సమస్యలు లేకుండా e-ఫైలింగ్ చేసుకోగలరు.వుంటే పరిష్కరించుకొని సౌకర్యవంతంగా e-ఫైలింగ్ రూపొందించుకోగలరు.

2019-20  Income Tax Softwares

2019-20 Income Tax Softwares

Mohan
APTF Updated at: January 29, 2020

Income Tax Calculation Excel Softwares. Income Tax Excel Calculation Softwares prepared by Teachers and Experts are very useful for calculation of Income Tax. It enables us to save our time. The Income Tax Softwares are much useful for Salaries Teachers, Employees, as they need not enter all Month with Details. The Excel utility calculates the Month Wise Salary Particulars automatically. Income Tax Software by K Vijay Kumar Medak, IT Software by Putta Srinivas, IT Software by KSS Prasad, IT Software by Ramanjaneyulu, IT Software by Jayaram etc are kept below for download.

Income Tax Calculation Excel Softwares Download

2019-20 Excel Income Tax Softwares

  •  Income tax Software 2019-20 by C.Ramanjaneyulu
  • .
  • Income tax Software 2019-20 by C.V.Prasad ( APTF)
  • AP - Vijay Kumar Income Tax Software 2019-20 FY 23rd Jan

  • KSS Prasad Income Tax Software 2019-20 FY

  • B Srinivasa Chary Income Tax Software 2019-20 FY -25th Dec

  • M Jaya Ram Income Tax Software 2019-20 FY -30th Dec

  • Telangana - Vijay Kumar Income Tax Software 2019-20 FY

  • AP Model Schools Income Tax Software by Ch V Ramana Murthy 2019-20
2018-19 Excel Income Tax Softwares
  • K Vijay Kumar Income Tax Software All Employees AP 04.02.2019
  • K Vijay Kumar IT Software All Employees Telangana 29.1.2019
  • KSS Prasad Income Tax Software 13.1.2019
  • B S Chary Income Tax Software 05.2.2019 AP-TS
  • Income Tax Software by C.Ramanjaneyulu
  • AP Model Schools IT Software Ch V Ramana Murthy for 2018-19 Updated 15/1/2019
  • IT Software by Jaya Ram updated 20/1/2019
2017-18 Excel Income Tax Softwares
  • Income Tax Software by K Vijay Kumar 2018
  • Income Tax Software by KSS Prasad
  • Income Tax Software by K Vijay Kumar for Telangana
  • Income Tax Software by Jayaram 2018
  • Income Tax Software by John Sundar
  • Income Tax Software 2nd Feb by V Ramana Murthy for AP Model Schools
  • Income Tax Software by Putta Srinivas for TS as on 22nd Jan
  • Income Tax Software by C Ramanjaneyulu as on 29th Jan
  • Mobile Income Tax Software by P Ramanjaneyulu 19th Dec

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:

Mohan
APTF Updated at: August 07, 2019


మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్,

e-filing ఆంటే ?

electronic file

భారత దేశంలోని ప్రజలు నెల వారిగా సంపాదించిన (సామానత్వం కోసం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ) ఆదాయం - ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి కొరకు ఉద్దేశించిన file  "e-filing"

e-filing ను Pan No తో అనుసంధానం (Register) చేసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయివేట్ సంస్ధలు, వ్యక్తులు  e-filing   ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖ (Income Tax Dept.) కు సులభంగా తెలుపుటకు ఉపాయోగపడే ఒక  సాదనం.

ఉపయోగాలు :

* తమ వ్యక్తిగత ఖాతాలలో జమ అయ్యే ప్రతి  మొత్తానికి Tax చెల్లించనవసరం ఉండదు.
*ఉద్యోగులు నెలవారి చెల్లించే Advance Income Tax వలన Quarter లో చెల్లించవలసిన Tax కంటె ఎక్కువ / తక్కువ చెల్లించినవారికి IT Dept. నుండి ఎలాంటి Notice లు రావు.
*Tax ఎక్కువ చెల్లించవసినా రాబోవు తదుపరి Quarters లో చెల్లించవచ్చు.
*Tax ఆదనంగా చెల్లించిన వారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది.

DDO లు తమ ఉద్యోగులు నెలవారిగా చెల్లించిన Advance Tax ను ప్రతి Quarter లో TDS update చేయించుండాలి.
అలా చేయని DDO లకు రోజుకు Rs.200/- అపరాద రుసుము చెల్లించవలసి ఉంటుంది.

■Income tax return e- Filing Anywhere Anytime

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:

పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు జులై 31 లోగా
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది.

ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి.

■ దాఖలు చేయవలసిన విధానం:

వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.

ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.

 ■ పేరు రిజిస్టర్ చేసుకొనుట:

incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

■  ఫారం 26 AS:

ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి.

■ ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:

ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది.

■  ఇ- ఫైలింగ్ చేయడం:

ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి.

PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు.

అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.

తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.

 ■ ఎకనాలెడ్జ్మెంట్:

ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి.  ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి.


జూలై 31 లాస్ట్ డేట్ : ఆన్‌లైన్‌లో Tax Returns ఎలా ఫైల్ చేయాలంటే?

జూలై 31 లాస్ట్ డేట్ : ఆన్‌లైన్‌లో Tax Returns ఎలా ఫైల్ చేయాలంటే?

Mohan
APTF Updated at: July 11, 2019

సూచించిన గడువు తేదీలోగా పన్ను దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. సరైన సమయంలో పన్ను చెల్లింపులపై చాలామందికి ఎన్నో సందేహలు వ్యక్తమవుతుంటాయి. మరికొందరికి అయితే ఆదాయ పన్ను శాఖలో ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలియకపోవచ్చు. పూర్తి అవగాహనలేక పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.*

*🔸ఐటీఆర్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఎప్పుడూ ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం అంటున్నారు ఐటీ నిపుణులు. చివరి క్షణంలో హడావుడి చేసి ఇబ్బందులు పడటం కంటే ముందుగానే ట్యాక్స్ చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే ఆల్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రీపరేషన్ సాఫ్ట్ వేర్ AY 2019-20 అప్ డేట్ చేసింది. ఈ-ఫిల్లింగ్ ఆప్షన్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ITR ఫైల్ చేసేందుకు ఆర్థిక సంవత్సరం 2018-19 (అసెసెమెంట్ ఇయర్ 2019-20) జూలై 31, 2019 వరకు మాత్రమే గడువు తేదీ ఉంది.*

*🔸ఇలోగా పన్నుదారులు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాల్సి ఉంటుంది.*
*పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఫాం 16, ఇన్వెస్ట్ మెంట్ వివరాలు (ఖర్చుల వివరాలు) వెంట ఉంచుకోవాలి.*

*🔸ఆన్ లైన్ లో మొత్తం ITR ఫిల్లింగ్ ప్రాసెస్ రెండు విధాలుగా జరుగుతుంది. అందులో ఒకటి Part A, రెండోది Part Bగా విభజించవచ్చు.* 

*🍁Part - A :*

*1. ఆన్ లైన్ లో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా. www.incometaxindiaefiling.gov.in లింక్‌ను ఓపెన్ చేయండి.* 
 *IT రిటర్న్ ప్రీపరేషన్ సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్ లోడ్స్ మెనూలో.. అసెస్ మెంట్ ఇయర్ 2019-20 అని ఉంటుంది. లేదంటే.. ఈ కింది లింక్ ఓపెన్ చేయండి. లేదంటే ఈ E-filling  లింక్ ఓపెన్ చేయండి.*
*2. అసెస్‌మెంట్ ఇయర్ 2019-20 సెలెక్ట్ చేసుకుని*
*JAR (Java Archive) file క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ zip ఫైల్ ను ఎక్స్ ట్రాక్ట్ చేయండి.*
*3. డౌన్ లోడ్ చేసిన సాఫ్ట్ వేర్ ద్వారా మీ ఆదాయ పన్ను, పేమెంట్స్, ఖర్చుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయండి.*
*మీ వ్యక్తిగత వివరాలతో పాటు ట్యాక్స్ పేమెంట్స్ లేదా TDS ఎంటర్ చేయాలి.*
*ఆ తర్వాత ‘Pre-fill’ button బటన్ పై క్లిక్ చేయండి.*
*అవసరమైన వివరాలు అన్ని పూర్తి చేశారా లేదా మరోసారి చెక్ చేసుకోండి.*
*4. డేటా అంతా ఎంటర్ చేశాక.. Calculate పై క్లిక్ చేయండి. ఇక్కడే మీ రీఫండ్ లేదా ట్యాక్స్ చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి వడ్డీతో కూడిన మొత్తం ఫైనల్ ఫిగర్ వస్తుంది.* 

*5. ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే.. వెంటనే అవసరమైన వివరాలు ఎంటర్ చేసి షెడ్యూల్ ప్రకారం పన్ను చెల్లించండి. ఇదే ప్రాసెస్ మరోసారి చేసి చూడండి. పన్ను చెల్లించాల్సిన మొత్తం జీరోకి పడిపోతుంది. అంటే పన్ను చెల్లించనట్టుగా నిర్ధారించుకోవచ్చు.* 

*6. ఆదాయ పన్ను డేటా XML ఫార్మాట్ లో జనరేట్ అవుతుంది. ఈ ఫైల్ ను మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకుని పెట్టుకోండి.*

*Part -B*

*1. మీ User Id, Passwordతో e-Filing website లో లాగిన్ అవ్వండి. పుట్టిన తేదీ, Captcha కోడ్ ఎంటర్ చేయండి.*
*2. e-File లోకి వెళ్లండి. అక్కడ Upload Return అనే బటన్ పై క్లిక్ చేయండి.*
*3. ITR సెలెక్ట్ చేసుకోండి. అసెస్ మెంట్ ఇయర్, XML ఫైల్ (Part A)లో సేవ్ చేశారు కదా.*
*4. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC), అవసరమైతే.. అప్ లోడ్ చేయండి.*
*5. ఈ-ఫైలింగ్ తో DSC రిజిస్ట్రర్డ్ అయి ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.*
*6. Submit బటన్ పై క్లిక్ చేయండి. ITR-V విండో డిస్ ప్లే అవుతుంది. (DSC ఒకవేళ వాడకుంటే)*
*7. ITR-V లింక్ డౌన్ లోడ్ చేసుకోండి. ITR-V లింక్.. మీ రిజిస్ట్రర్డ్ ఈమెయిల్ కూడా వెళ్తుంది.*
*ITR.. DSCతో అప్ లోడ్ చేసినట్టయితే.. రిటర్న్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తి అయినట్టే.*

*రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఒకవేళ DSC అప్ లోడ్ చేయకుంటే.. ప్రాసెస్ ఇలా ఉంటుంది.*

*రిటర్న్స్ DSCతో అప్ లోడ్ చేయకుంటే.. ITR-V ఫాంను ఫ్రింట్ ఔట్ తీసుకోవాలి.*
*e-Filing చేసిన తేదీ నుంచి 120 రోజుల్లోగా ఫాంపై సంతకంతో CPCకి సమర్పించాల్సి ఉంటుంది.*
*రిసిప్ట్ ఫాంపై సంతకం ఉంటేనే ITR-V ఫాం ప్రాసెస్ చేయడం జరుగుతుంది.*
*ఇప్పుడు అప్ లోడ్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.*
*ITR కోసం CPCతో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా E-Verify ITR చేసుకోవచ్చు.* 
*బ్యాంకు ATM ద్వారా కూడా E-Verify ITR ప్రాసెస్ చేసుకోవచ్చు.*
*E-Verify ITR ప్రాసెస్ చేయాలంటే.. బ్యాంకు అకౌంట్ నెంబర్, డిమాట్ అకౌంట్ నెంబర్, ఆధార్ OTP ద్వారా పూర్తి చేసుకోవచ్చు.*

🍁🍃🍁🍃🍁🍃🍁🍃

Budget at a glance

Budget at a glance

Mohan
APTF Updated at: July 05, 2019

*💁‍♂ బడ్జెట్‌ ముఖ్యాంశాలు*

*1) మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు.*
*2)  వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు.*
*3) రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.*
*4)  నగదు రహిత చెల్లింపులపై ఎండీఆర్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు.* 
*5) ఆదాయ పన్ను సమర్పణ సమయంలో ప్యాన్‌ కార్డు లేకపోయినా కేవలం ఆధార్‌ కార్డు ద్వారా ఆదాయ రిటర్న్స్‌ను ఫైల్‌ చేయవచ్చు.

*ఆదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంపు*
°°°°°°°°°°°°

TDS... 24 Q last date extended from 31st May to 30th june 2019

Mohan
APTF Updated at: June 03, 2019

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |